ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త అప్డేటెడ్ SUV అయిన 'ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌' (Audi Q5 Facelift) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త SUV ప్రారంభ ధర రూ. 58.93 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త SUV చాలా అప్డేట్స్ గమనించవచ్చు. Audi Q5 Facelift గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అయితే ఈ రెండు వేరియంట్లు కూడా ఒకే పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త SUV యొక్క బుకింగ్స్ కంపెనీ గత నెలలోనే ప్రారంభించింది. కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్ నుండి రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

ఆడి కంపెనీ ఈ కారు యొక్క పాత మోడల్‌ను గత కొంతకాలంగా నిలిపివేసింది. అయితే ఇది ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్‌ రూపంలో మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కొత్త SUV చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ కొత్త కారు యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ Q8 యొక్క లార్జ్ సింగిల్-ఫ్రేమ్ ఆక్టాగోనల్ గ్రిల్‌, వర్టికల్ క్రోమ్ స్లాట్ మరియు రీడిజైన్ చేయబడిన కొత్త LED హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ 19 ఇంచెస్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. అంతే కాకూండా, ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో ట్వీక్ చేయబడిన ఎల్ఈడీ టైల్‌లైట్‌లు, క్రోమ్ ఇన్‌సర్ట్‌లు మరియు రీప్రొఫైల్డ్ రియర్ బంపర్ వంటివి కూడా ఉన్నాయి. ఇందులో యారో షేప్ లో ఉండే OLED టైల్‌లైట్‌ కూడా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ SUV అల్ట్రా బ్లూ మరియు డిస్ట్రిక్ట్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో విడుదల చేయబడింది. ఈ రెండూ కూడా చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

కొత్త క్యూ5 ఫేస్‌లిఫ్ట్ SUV యొక్క ఇంటీరియర్‌ విషయానికి వస్తే, సెంటర్ కన్సోల్‌లో డ్యూయల్-డిస్ప్లే సెటప్ ఇప్పుడు తొలగించబడింది, అయితే సరికొత్త 10.1 ఇంచెస్ ఎమ్ఎమ్ఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ చేయబడిన డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా ఇందులో త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త SUV ఈ ఏడాది కంపెనీకి 9 వ ఉత్పత్తి కానుంది. ఆడి క్యూ5 తన సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమంది వాహన వినియోగదారులు ఈ SUV ని కొనుగోలు చేసే అవకాశం ఉంది, అని భావిస్తున్నాము.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే 12 వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో అందించబడుతుంది. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజిన్ యొక్క పవర్ దాని నాలుగు చక్రాలకు పంపుతుంది. ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ గంటకు 240 కిమీ వేగంతో ప్రయాణింస్తుంది.క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది, కావున ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన Audi Q5 Facelift: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ GLC, బీఎండబ్ల్యూ X3, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు వోల్వో XC60 వంటి ఇతర లగ్జరీ SUVలకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త కారు దేశీయ మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతోంది అనే విషయం తెలుసుకోవడానికి మరి కొంత కాలం వేచి చూడాలి. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 23, 2021, 14:22 [IST]
English summary
Audi india launched new q5 facelift suv price features engine details
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+