ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా, తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'ఆడి ఇ-ట్రోన్'ను జులై 22, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ కేంద్రాలకు పంపిణీ చేయడం ప్రారంభించింది.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ఆడి ఇ-ట్రోన్ మరియు ఆడి ఇ-ట్రోన్ స్పోర్ట్‌బ్యాక్ ఎలక్ట్రిక్ వాహనాలను రెండింటినీ ఒకేసారి విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. భారత మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ.1.20 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ ఈక్యూసి మరియు జాగ్వార్ ఐ-పేస్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

డిజైన్ పరంగా చూస్తే, ఆడి ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఆక్టాగన్ ఆకారంలో ఉండే పెద్ద ఫ్రంట్ గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్‌లతో ఇది ఇతర ఆడి ఎస్‌యూవీలా మాదిరిగానే కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ కూడా చూడటానికి క్యూ5 మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఇతర ఆడి కార్లతో పోల్చుకుంటే, ఆడి ఇ-ట్రోన్ సున్నా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. దీని వెనుక భాగంలో పూర్తి-వెడల్పుతో కూడిన లైట్‌బార్ ఉంటుంది, ఇది రెండు టెయిల్ ల్యాంప్స్‌ను కలుపుతూ ఉంటుంది.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ఆడి ఇ-ట్రోన్ స్పోర్ట్‌బ్యాక్ డిజైన్ కూడా దాదాపుగా ఇ-ట్రోన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఇందులో స్పోర్టీ, కూప్ లాంటి సిల్హౌట్ కోసం బి-పిల్లర్ తర్వాత రూఫ్ వాలుగా ఉంటుంది. లోపలి భాగంలో, ఆడి ఇ-ట్రోన్ దాని ట్రెడిషనల్ పెటోల్ పవర్డ్ మోడళ్ల మాదిరిగానే, ఒకేరకమైన డిజైన్ థీమ్‌ను కలిగి ఉంటుంది.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ఆడి యొక్క లేటెస్ట్ 'ఎమ్ఎమ్ఐ టచ్‌'లో మూడు పెద్ద స్క్రీన్‌లు ఉన్నప్పటికీ, లోపలి భాగంలో స్క్రీన్‌ల ఆధిపత్యం కనిపించదు; ప్రతిదీ సంప్రదాయంగా మరియు ఉపయోగించడానికి సుపరిచితంగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి, ఇండియన్-స్పెక్ వెర్షన్‌లోని పరికరాల జాబితాను ఆడి ఇంకా వెల్లడించలేదు.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

అయితే, మార్కెట్ సమాచారం ప్రకారం, ఆడి టాప్-ఎండ్ వేరియంట్‌లో మ్యాట్రిక్స్ ఎల్‌ఈడి హెడ్‌లైట్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్ అడ్జస్టబల్ చేయగల స్టీరింగ్ వీల్ వంటి మరెన్నో ఫీచర్లను ఆశించవచ్చు.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ఆడి ఇ-ట్రోన్‌ను మూడు వేరియంట్లతో అందించనున్నారు. ఇందులో 50 క్వాట్రో వేరియంట్‌లో 71.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 312 బిహెచ్‌పి శక్తిని మరియు 540 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరింత శక్తివంతమైన 55 క్వాట్రో మరియు ఎస్ వేరియంట్లు రెండూ 95 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

అయితే, ఇందులోని ఎస్ వేరియంట్ మాత్రం గరిష్టంగా 435 బిహెచ్‌పి పవర్‌ను మరియు 808 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అలాగే, ఇందులోని బూస్ట్ మోడ్‌ను ఉపయోగించడం ద్వారా గరిష్టంగా 503 హెచ్‌పి పవర్‌ను మరియు 973 ఎన్ఎమ్‌ ట్రార్క్‌లను పొందవచ్చు.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ఇకపోతే, ఇందులో చివరి వేరియంట్ అయిన 55 క్వాట్రో గరిష్టంగా 360 హెచ్‌పి పవర్‌ను మరియు 561 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 'బూస్ట్' మోడ్ సాయంతో గరిష్టంగా 408 హెచ్‌పి పవర్ మరియు 664 ఎన్ఎమ్ టార్క్‌లను పొందవచ్చు.

ఆడి ఇండియా నుండి బిగ్ లాంచ్.. జులై 22న ఇ-ట్రోన్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఒకే ఛార్జీపై 441 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని, 150 కిలోవాట్ల డిసి ఛార్జర్‌ను ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 0-80 శాతం వరకూ ఛార్జ్ చేయవచ్చని ఆడి ఇండియా పేర్కొంది. అదే 11 కిలోవాట్ల ఏసి ఛార్జర్‌ను ఉపయోగించినట్లయితే, 0-80 శాతం చార్జ్ దాదాపు 8.5 గంటలు పడుతుంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, June 25, 2021, 12:59 [IST]
English summary
Audi India To Launch e-Tron On 22nd July 2021: Features, Specs And Details. Read in Telugu.
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+