రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

భారతదేశంలో ఓవైపు కార్ కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతుంటే, ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో మాత్రం తమ మొత్తం ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోపై లేటెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. రెనో క్విడ్, ట్రైబర్, డస్టర్ మరియు కైగర్ యొక్క అన్ని వేరియంట్‌లపై కంపెనీ ఆగస్టు 2021 నెల ఆఫర్లను అందిస్తోంది.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్ మరియు రాష్ట్రాన్ని బట్టి ఈ ఆఫర్లు వేర్వేరుగా ఉంటాయి. ఈ నెలలో రెనో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.1.3 లక్షల వరకూ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, లాయల్టీ బెనిఫిట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ ఆగస్టు 1 మరియు ఆగస్టు 31 మధ్యలో కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి. మోడల్ వారీగా డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

రెనో క్విడ్ ఆఫర్లు

రెనో ఇండియా లభిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌కై క్విడ్‌పై కంపెనీ గరిష్టంగా ఈ నెలలో రూ.60,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. వీటిలో రూ.20,000 వరకు నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.10,000 వరకు లాయల్టీ బోనస్ మొదలైనవి ఉన్నాయి.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

స్టాండర్డ్ ఆఫర్లలో భాగంగా, అర్హతగల వినియోగదారులకు రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా రూ.5,000 గ్రామీణ ఆఫర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. పై ఆఫర్లు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మరియు కేరళలకు చెల్లుతాయి. భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాల నుండి కొనుగోలుదారులు గరిష్టంగా రూ.50,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

రెనో ట్రైబర్ ఆఫర్లు

భారతదేశంలో అత్యంత సరసమైన 7-సీటర్ ఎమ్‌పివి రెనో ట్రైబర్‌పై కంపెనీ ఈ ఆగస్ట్ నెలలో గరిష్టంగా రూ.90,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. 2020 మోడల్ ఇయర్ ట్రైబర్‌ను ఎంచుకునే కస్టమర్లు రూ.35,000 నగదు తగ్గింపు రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 వరకు లాయల్టీ బోనస్‌లను పొందవచ్చు.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

అలాగే, రెనో ట్రైబర్ యొక్క 2021 మోడల్ ఇయర్‌ని ఎంచుకునే కొనుగోలుదారులు రూ.25,000 నగదు తగ్గింపును రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మరియు రూ.10,000 వరకు లాయల్టీ బోనస్‌ని పొందవచ్చు. ఇవే కాకుండా ట్రైబర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లందరూ కార్పొరేట్ బోనస్ లేదా రూ.10,000 గ్రామీణ ఆఫర్ కోసం అర్హులు.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

రెనో కైగర్ ఆఫర్లు

రెనో ఇండియా అందిస్తున్న లేటెస్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్‌పై కూడా కంపెనీ గరిష్టంగా రూ.20,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ బోనస్ రూ.10,000 మరియు లాయల్టీ బోనస్ రూ.10,000 కలిసి ఉన్నాయి.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

రెనో ఇండియా ఎంపిక చేసిన రాష్ట్రాలలో కొంతమంది కస్టమర్‌లకు ఈ ఎస్‌యూవీపై 5 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల పొడిగించిన వారంటీని కూడా అందిస్తోంది. అంతేకాకుండా, ఈ ఎస్‌యూవీ కోసం ఇప్పుడు కొనుగోలు చేయండి తర్వాత చెల్లించండి అనే కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

రెనో డస్టర్ ఆఫర్లు

రెనో బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ డస్టర్‌పై ఈ నెలలో గరిష్టంగా రూ.1.3 లక్షల ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. ఇందులో రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 నగదు ప్రయోజనం మరియు రూ.15,000 లాయల్టీ బెనిఫిట్‌లు కలిసి ఉన్నాయి.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

స్టాండర్డ్ ఆఫర్లలో భాగంగా, ఈ ఎస్‌యూవీపై వినియోగదారులు రూ.30,000 కార్పొరేట్ డిస్కౌంట్ లేదా రూ.15,000 గ్రామీణ ఆఫర్ మరియు రీ-లివ్ స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ.10,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌కి కూడా అర్హులు. ఈ ఆఫర్లు మహారాష్ట్ర, గుజరాత్, గోవా మరియు కేరళలో మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

రెనో కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్.. రూ.1.లక్షల వరకూ క్యాష్ బెనిఫిట్స్..

ఇతర రాష్ట్రాల్లో కొనుగోలుదారులు గరిష్టంగా రూ.60,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ.30,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.15,000 లాయల్టీ బెనిఫిట్‌లు ఉన్నాయి. వీరు కూడా కార్పొరేట్ డిస్కౌంట్ లేదా గ్రామీణ ఆఫర్లకు అర్హులు.

More from DriveSpark

Article Published On: Monday, August 9, 2021, 12:18 [IST]
English summary
August 2021 discounts and offers on renault cars details
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+