టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్, ఇటీవల తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్లపై తగ్గింపులను మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

గత నెలలో కంపెనీ అమ్మకాలు భారీ వృద్ధి చెందాయి, ఆగస్టు నెలలో కూడా కంపెనీ ఇదే వృద్ధిని సాధించేందుకు గానూ టాటా మోటార్స్ తమ కార్లపై నగదు తగ్గింపులు మరియు ఇతర ఆఫర్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

టాటా కార్లపై కంపెనీ అందిస్తున్న ప్రయోజనాలలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు మరియు కోవిడ్ యోధుల కోసం నగదరు ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆగస్ట్ 2021 నెలలో టాటా కారును కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ.65,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ మోడళ్లపై కంపెనీ అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

టాటా హారియర్

టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ ఎస్‌యూవీ హారియర్ యొక్క కామో మరియు డార్క్ ఎడిషన్ వేరియంట్లపై కంపెనీ రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది. ఇది కాకుండా, ఈ ఎస్‌యూవీ యొక్క అన్ని ఇతర వేరియంట్లపై రూ.25,000 అదనపు నగదు తగ్గింపు కూడా అందిస్తోంది.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

టాటా సఫారీ మరియు ఆల్ట్రోజ్

టాటా మోటార్స్ నుండి లేటెస్ట్‌గా వచ్చిన కొత్త సఫారీ, 6 మరియు 7-సీటర్ ఎస్‌యూవీపై కంపెనీ కేవలం రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను మాత్రమే ఆఫర్ చేస్తోంది. అలాగే, టాటా మోటార్స్ యొక్క ప్రీమియం ఎస్‌యూవీ ఆల్ట్రోజ్ ఎక్స్‌జెడ్ వేరియంట్‌పై మాత్రమే కంపెనీ రూ.15,000 నగదు తగ్గింపును అందిస్తోంది.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

టాటా నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీ

డీజిల్ వెర్షన్ టాటా నెక్సాన్‌పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కోవిడ్ యోధులకు రూ.5,000 అదనపు ప్రయోజనాన్ని కంపెనీ అందిస్తుంది. కాగా, ఈ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క పెట్రోల్ వేరియంట్‌పై కంపెనీ కేవలం రూ.3,000 మాత్రమే కార్పొరేట్ డిస్కౌంట్‌ను మాత్రమే అందిస్తోంది. ఇదే సమయంలో, టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుపై కంపెనీ రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తోంది.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

టాటా టియాగో మరియు టిగోర్

టాటా మోటార్స్ యొక్క ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కంపెనీ రూ.20,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కోవిడ్ యోధులకు రూ.3,000 నగదు ప్రయోజనాన్ని అందిస్తోంది. కాగా, టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌పై రూ.20,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్సేంజ్ బోనస్ మరియు కోవిడ్ యోధులకు రూ.3,000 ప్రయోజనాలను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

జులై 2021లో జోరందుకున్న అమ్మకాలు

టాటా మోటార్స్ గడచిన జూలై నెలలో భారత మార్కెట్లో ప్రోత్సాహకర అమ్మకాలను సాధించింది. గత నెలలో దేశీయ మార్కెట్లో కంపెనీ అమ్మకాలు 92 శాతం వృద్ధి చెందాయి. జూలై 2021 నెలలో టాటా మోటార్స్ మొత్తం 51,981 యూనిట్ల వాహనాలను విక్రయించింది.

టాటా కార్లపై ఆగస్ట్ 2021 డిస్కౌంట్స్: హారియర్, నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో & టిగోర్

వీటిలో ప్యాసింజర్ వాహన విభాగంలో 30,185 యూనిట్లు మరియు వాణిజ్య వాహనాల వాహన విభాగంలో 23,848 యూనిట్లు ఉన్నాయి. ప్రయాణీకుల వాహన విభాగంలో కంపెనీ 101 శాతం వృద్ధిని సాధించగా, వాణిజ్య వాహన విభాగంలో 88 శాతం భారీ వృద్ధిని సాధించింది.

Most Read Articles

English summary
August 2021 offers and discounts on tata harrier safari altroz tiago nexon tigor details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X