భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

భారతదేశంలో బిఎస్ 6 ఉద్గార నిబంధనలను కఠినతరం చేసిన తరువాత, చాలా మంది కార్ల తయారీదారులు తమ కార్లలో డీజిల్ వెర్షన్లను నిలిపివేశాయి. ఉదాహరణకు మారుతి సుజుకి ప్రస్తుతం పెట్రోల్ కార్లు మినహా డీజిల్ కార్లను తయారు చేయడం లేదు. అలానే మరికొన్ని కంపెనీలు కూడా కేవలం పెట్రోల్ మరియు సిఎన్‌జి కార్లను మాత్రమే తయారు చేస్తున్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

అయితే, ఇప్పటికీ కొన్ని కార్ల కంపెనీలు మాత్రం తమ కార్లలో డీజిల్ మోడళ్లను విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాల లోబడి ఉంటాయి. వీటిలో బ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు మరియు ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.10 లక్షల ధర లోపు లభిస్తున్న బెస్ట్ డీజిల్ కార్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

1. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న హ్యాచ్‌బ్యాక్ కారు గ్రాండ్ ఐ10 నియోస్. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారులోని 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ 75 బిహెచ్‌పి పవర్‌ను మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ.7.30 లక్షల నుంచి రూ.8.45 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

2. టాటా ఆల్ట్రోజ్

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ టాటా ఆల్ట్రోజ్ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 90 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందిస్తుంది. మార్కెట్లో డీజిల్ వెర్షన్ టాటా ఆల్ట్రోజ్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.55 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

3. ఫోర్డ్ ఫిగో

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ మోటార్స్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఫిగో కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ ఫిగో కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఫోర్డ్ ఫిగో డీజిల్ కార్ల ధరలు రూ.6.86 లక్షల నుంచి రూ.8.37 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

4. ఫోర్డ్ ఫ్రీస్టైల్

ఫోర్డ్ ఇండియా నుండి లభిస్తున్న మరొక డీజిల్ కారు ఫ్రీస్టైల్. క్రాసోవర్ మాదిరిగా ఉండే ఫోర్డ్ ఫ్రీ స్టైల్ కూడా ఫిగో మాదిరిగానే ఒకేరకమైన డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ డీజిల్ కారులో 1.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 215 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఫోర్డ్ ఫ్రీస్టైల్ డీజిల్ కార్ల ధరలు రూ.7.34 లక్షల నుంచి రూ.9.02 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

5. హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి లభిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో ఈ కారు ధరలు రూ.8.21 లక్షల నుంచి రూ.10.76 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

6. హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ నుండి లభిస్తున్న మరొక డీజిల్ కారు మరియు ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ వెన్యూ. హ్యుందాయ్ వెన్యూ డీజిల్ వెర్షన్‌లో 1.5 లీటర్ల ఇంజన్‌ను ఉపయోగించారు. హ్యుందాయ్ ఐ20 మాదిరిగానే ఈ డీజిల్ ఇంజన్ కూడా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ డీజిల్ వెర్షన్ ధరలు రూ.9.44 లక్షల నుండి రూ.11.72 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

7. కియా సొనెట్

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత పాపులర్ అయిన కొరియన్ బ్రాండ్ కార్ కియా సోనెట్, ఈ విభాగంలో రెండు రకాల డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. కియా సోనెట్ రెండు డీజిల్ ఇంజన్లు కూడా 1.5 లీటర్ యూనిట్ రూపంలో ఉంటాయి. కాకపోతే, వీటిని రెండు పవర్ ట్యూన్లలో విక్రయిస్తున్నారు. ఇందులో మొదటి ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ / 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండవది, 115 బిహెచ్‌పి పవర్ / 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో కియా సోనెట్ డీజిల్ ధరలు రూ.8.35 లక్షల నుంచి రూ.13.35 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

8. టాటా నెక్సాన్

టాటా మోటార్స్‌కు చెందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారులో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 260 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మార్కెట్లో టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ.9.48 లక్షల నుండి రూ.13.24 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

9. హోండా అమేజ్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కారులోని 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో హోండా అమేజ్ డీజిల్ వెర్షన్ల ధరలు రూ.7.68 లక్షల నుండి రూ.9.99 లక్షల మధ్యలో ఉన్నాయి.

భారత మార్కెట్లో రూ.10 లక్షల లోపు లభించే బెస్ట్ డీజిల్ కార్లు!

10. హ్యుందాయ్ ఔరా

ఇక ఈ జాబితాలో చివరది హ్యుందాయ్ ఔరా. రూ. లక్షల లోపు ధరలో హ్యుందాయ్ నుండి లభిస్తున్న మూడవ డీజిల్ కారు ఇది. హ్యుందాయ్ ఔరాలో 1.2 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 75 బిహెచ్‌పి పవర్‌ను మరియు 190 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్లో దీని ధరలు రూ.7.86 లక్షల నుంచి రూ.9.31 లక్షల మధ్యలో ఉన్నాయి.

గమనిక: పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (జులై 9, 2021 నాటికి).

Most Read Articles

English summary
Best Diesel Cars Available In India Under Rs 10 Lakhs Budget: Aura, Venue, Nexon, Sonet And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X