ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

హ్యాచ్‌బ్యాక్ కన్నా విశాలంగా ఉండి, బెస్ట్ లుకింగ్ కారు కోసం చూసేవారికి కాంపాక్ట్ సెడాన్ కార్లు చక్కటి ఆప్షన్ గా ఉంటాయి. మనదేశంలో ఇప్పటికే అనేక కాంపాక్ట్ సెడాన్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆగస్టు 2021 లో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ సెడాన్ ల జాబితా వెల్లడైంది.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

ఈ జాబితా ప్రకారం, గత నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ అమ్మకాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. సాధారణంగా, ఈ విభాగంలో డిజైర్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. అయితే ఈసారి అమేజ్ అమ్మకాలు ఏకంగా 79 శాతం వృద్ధి చెంది అగ్రస్థానంలో నిలిచింది.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

ఇందుకు ప్రధానం కారణం, కంపెనీ ఇటీవల హోండా అమేజ్ లో కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ని ప్రవేశపెట్టడమే. ఈ జాబితాలో అమేజ్ మరియు డిజైర్ ల తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ ఔరా, టాటా టిగోర్ మరియు ఫోర్డ్ ఆస్పైర్ మొదలైన మోడళ్లు ఉన్నాయి. కాంపాక్ట్ సెడాన్ మోడల్ వారీగా అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

హోండా అమేజ్ (Honda Amaze) అమ్మకాలు గడచిన ఆగస్టు 2020 లో 3684 యూనిట్లుగా ఉండగా, ఆగస్టు 2021 నెలలో ఇవి 6591 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కార్ల అమ్మకాలు 79 శాతం వృద్ధిని సాధించాయి. ప్రస్తుత పండుగ సీజన్ లో కంపెనీ ఈ కాంపాక్ట్ సెడాన్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

ప్రస్తుతం మార్కెట్లో హోండా అమేజ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో E, S మరియు VX వేరియంట్లు ఉన్నాయి. ఇందులో S మరియు VX వేరియంట్లు కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ అవతార్‌లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సెడాన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ మోడల్ లో కస్టమర్లు ఎక్కువ ఇంజన్ ఆప్షన్లు మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశాన్ని పొందుతారు.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire) విషయానికి వస్తే, ఈ విభాగంలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే ఈ మోడల్, ఇప్పుడు ఆగస్ట్ 2021 లో రెండవ స్థానానికి పడిపోయింది. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 5714 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్ట్ 2020 లో) ఇవి 13,629 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

ఈ సమయంలో మారుతి డిజైర్ అమ్మకాలు 58 శాతం భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ప్రస్తుతం మారుతి సుజుకి డిజైర్ కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, మారుతి సుజుకి బ్రాండ్ పట్ల కస్టమర్లలో ఉన్న విశ్వాసం కారణంగా, ఎక్కువ మందిదీనిని ఎంచుకుంటున్నారు. కానీ, ఇటీవల ఏర్పడిన సెమీకండక్టర్స్ చిప్స్ కొరత కారణంగా కంపెనీ అమ్మకాలు కూడా ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ ఔరా (Hyundai Aura). గడచిన ఆగస్టు 2021 నెలలో ఈ మోడల్ అమ్మకాలు 3094 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయం (ఆగస్ట్ 2020 లో) ఇవి 3228 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఔరా అమ్మకాలు 4 శాతం తగ్గాయి. ఈ మోడల్ కొత్త అవతార్‌లో ప్రవేశపెట్టిన తర్వాత దీని అమ్మకాలు జోరుగా ఉన్నాయి. అలాగే, ఈ పండుగ సీజన్ లో కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్ (Tata Tgor) ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గత నెలలో (ఆగస్ట్ 2021లో) ఈ మోడల్ అమ్మకాలు 1673 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (ఆగస్చ్ 2020లో) ఇవి 1016 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంతో పోలిస్తే టిగోర్ అమ్మకాలు అమ్మకాల్లో 65 శాతం పెరుగుదలను చూశాయి.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

టాటా టిగోర్ సెడాన్ లో కంపెనీ ఇటీవలే కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ ను కూడా విడుదల చేసింది. సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ టాటా టిగోర్ ఈవీ మునుపటి కన్నా అధిక పెర్ఫార్మెన్స్ మరియు అధిక రేంజ్ ను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ రాకతో, భవిష్యత్తులో టాటా టిగోర్ అమ్మకాలు మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

ఇటీవలే భారతదేశం విడిచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ (Ford) అందిస్తున్న ఏకైక కాంపాక్ట్ సెడాన్ ఫోర్డ్ ఆస్పైర్ (Ford Aspire) ఈ జాబితాలో చివరి స్థానంలో ఉంది. గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో విక్రయించిన 431 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గత ఆగస్ట్ 2021లో కేవలం 94 యూనిట్లు మాత్రమే విక్రయించింది. - ఫోర్డ్ ఇండియా నిష్క్రమణ గురించి మరింత తెలుసుకోవటానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఆగస్ట్ 2021లో బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్స్.. లిస్ట్‌లో హోండా అమేజ్ టాప్..!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ దాని స్వంత విభిన్న వినియోగదారులను కలిగి ఉంది మరియు ఇప్పటికీ చాలా మంది కస్టమర్లు ఈ విభాగాన్ని తమ మొదటి కారుగా కొనుగోలు చేయటానికి ఇష్టపడుతుంటారు. ఈ పరిస్థితిలో, హోండా అందిస్తున్న అమేజ్ అమ్మకాలు పెరగడం సెగ్మెంట్ వృద్ధికి ఓ శుభ సూచకంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Best selling compact sedans in august 2021 amaze tops the list details
Story first published: Sunday, September 12, 2021, 9:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X