Just In
- 1 hr ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 2 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 2 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
- 16 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
Don't Miss
- News
ప్రోనింగ్ : ఇలా చేస్తే కోవిడ్ పేషెంట్లు తేలిగ్గా శ్వాస తీసుకోవచ్చు... ఎలా చేయాలో తెలుసుకోండి..
- Lifestyle
చికెన్ చాప్స్
- Finance
భారీ నష్టాలతో ప్రారంభమై, లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు: బ్యాంక్, మెటల్ జంప్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మార్చి నెలలో బెస్ట్ ఎమ్‌పివిలు; అగ్రస్థానంలో మారుతి ఎర్టిగా!
భారత్ వంటి మార్కెట్లలో అధిక సీటింగ్ సామర్థ్యం కలిగిన ఫ్యామిలీ కార్స్‌కి ఎల్లప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. గడచిన మార్చి 2021 నెలలో ఎమ్‌పివి విభాగంలో జరిగిన అమ్మకాల గణాంకాలు వెల్లడయ్యాయి. ఈ సెగ్మెంట్లో లభిస్తున్న అన్ని మోడళ్లు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివి. ఇది కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తున్నప్పటికీ, గత నెలలో గరిష్టంగా 9,303 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి కేవలం 3,969 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ఎర్టిగా అమ్మకాలు 134 శాతం పెరిగాయి.

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయిస్తున్న పాపులర్ పీపుల్స్ క్యారియర్ మహీంద్రా బొలెరో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. మహీంద్రా గత నెలలో 8,905 యూనిట్ల బొలెరో వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ 2,080 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో అమ్మకాలు ఏకంగా 328 శాతం పెరిగాయి.
MOST READ:రష్మిక మందన్న కార్స్ ఎప్పుడైనా చూసారా.. అయితే ఇది చూడండి

ఈ సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న టొయోటా ఇన్నోవా గడచిన నెలలో అమ్మకాల పరంగా మూడవ స్థానానికి పడిపోయింది. గత నెలలో టొయోటా ఇన్నోవా అమ్మకాలు 5,743 యూనిట్లుగా ఉన్నాయి. మార్చి 2020లో ఇవి 3,810 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో అమ్మకాలు 50.7 శాతం పెరిగాయి.

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో విక్రయిస్తున్న ట్రైబర్ ఎమ్‌పివి ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 4,133 యూనిట్ల రెనో ట్రైబర్ ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 1,644 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ట్రైబర్ అమ్మకాలు 151 శాతం వృద్ధి చెందాయి.
MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న కార్తీక్ ఆర్యన్.. దీని రేటు అక్షరాలా..

మారుతి సుజుకి అందిస్తున్న ప్రీమియం ఎమ్‌పివి మారుతి ఎక్స్‌ఎల్6 ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 3,062 యూనిట్ల ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలు అమ్ముడయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 2,221 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ఎక్స్ఎల్6 అమ్మకాలు 37.8 శాతం పెరిగాయి.

మహీంద్రా అండ్ మహీంద్రాకు అందిస్తున్న మరాజ్జో ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. మార్చి 2021లో కంపెనీ మొత్తం 255 యూనిట్లను మరాజ్జోలను విక్రయించగా, గత ఏడాది మార్చిలో కేవలం 23 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో మరాజ్జో అమ్మకాలు 1008 శాతం పెరిగాయి.
Rank | Model | Mar'21 | Mar'20 | Growth (%) |
1 | Maruti Suzuki Ertiga | 9,303 | 3,969 | 134 |
2 | Mahindra Bolero | 8,905 | 2,080 | 328 |
3 | Toyota Innova Crysta | 5,743 | 3,810 | 50.7 |
4 | Renault Triber | 4,133 | 1,644 | 151 |
5 | Maruti XL6 | 3,062 | 2,221 | 37.8 |
6 | Mahindra Marazzo | 255 | 23 | 1008 |
7 | Toyota Vellfire | 65 | 96 | -32.2 |
8 | Kia Carnival | 45 | 1,117 | -96 |
9 | Datsun Go Plus | 30 | 12 | 150 |

ఇక ఈ జాబితాలో ఇతర ఎమ్‌పివిల అమ్మకాలను గమనిస్తే, టొయోటా వెల్‌ఫైర్ లగ్జరీ ఎమ్‌పివి అమ్మకాలు 32.2 శాతం క్షీణించి 65 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో కియా కార్నివాల్ అమ్మకాలు 1,117 యూనిట్ల నుండి 45 యూనిట్లకు పడిపోయి 96 శాతం క్షీణతను నమోదు చేశాయి. కాగా డాట్సన్ గో ప్లస్ అమ్మకాలు 12 యూనిట్ల నుండి 30 యూనిట్లకు పెరిగి 150 శాతం వృద్ధిని సాధించాయి.