Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 14 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 15 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 2021లో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ ఎమ్‌యూవీలు ఇవే..
భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఎమ్‌యూవీ (మల్టీ యుటిలిటీ వెహికల్) విభాగంలో ప్రస్తుతం అనేక మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ విభాగంలో టొయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగా పేరు మాత్రమే ఎక్కువగా వినిపించేది. అయితే, మార్కెట్లో కొత్త మోడళ్లు ప్రవేశించడంతో ఈ విభాగంలో పోటీ మరింత అధికమైంది.

గడచిన నెలలో ఈ విభాగంలో అనేక మోడళ్ల అమ్మకాల పరంగా ప్రోత్సాహకర వృద్ధిని నమోదు చేశాయి. ఈ విభాగంలో, మారుతి సుజుకి అందిస్తున్న ఎర్టిగా ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. మహీంద్రా బొలెరో ద్వితీయ స్థానంలో ఉండగా, అనూహ్యంగా రెనో ట్రైబర్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది.

జనవరి 2021లో మారుతి సుజుకి ఇండియా మొత్తం 9,565 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌యూవీలను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య కేవలం 4,997 యూనిట్లుగా మాత్రమే ఉంది. అప్పటితే పోలిస్తే ఈ మోడల్ అమ్మకాలు 91 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం ఎర్టిగా కేవలం పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తోంది. బిఎస్6 అప్‌గ్రేడ్ తర్వాత కంపెనీ ఇందులో డీజిల్ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి; దానిని పోలీసులే..

మహీంద్రా అందిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ బొలెరో కూడా గడచిన జనవరి 2021లో 7,567 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. జనవరి 2020లో ఈ మోడల్ అమ్మకాలు 7,223 యూనిట్లుగా ఉన్నాయి. అప్పటితో పోలిస్తే బొలెరో అమ్మకాలు 4.7 శాతం తగ్గాయి. అయితే, మహీంద్రా బొలెరోను ఈ సంవత్సరం కొత్త అవతారంలో ప్రవేశపెట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త మోడల్ రాకతో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Rank | Model | Jan'21 | Jan'20 | Growth (%) |
1 | Maruti Ertiga | 9,565 | 4,997 | 91.4 |
2 | Mahindra Bolero | 7,567 | 7,223 | 4.7 |
3 | Renault Triber | 4,062 | 4,119 | -1.38 |
4 | Toyota Innova Crysta | 3,939 | 2,575 | 52.9 |
5 | Maruti XL6 | 3,119 | 770 | 305 |
6 | Kia Carnival | 328 | 450 | -27.1 |
7 | Mahindra Marazzo | 175 | 1,267 | -86 |
8 | Datsun Go+ | 30 | 55 | -45 |
9 | Toyota Vellfire | 0 | 0 | 0 |

ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో విక్రయిస్తున్న ట్రైబర్ ఎస్‌యూవీ. జనవరి 2021 లో, ఈ మోడల్ అమ్మకాలు 4062 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరి 2020లో దీని అమ్మకాలు 4119 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ట్రైబర్ అమ్మకాలు 1 శాతం క్షీణించాయి.
MOST READ:కొత్త ఫీచర్‌తో విడుదలైన టీవీఎస్ జుపిటర్ ; పూర్తి వివరాలు

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా విక్రయిస్తున్న పాపులర్ ఎమ్‌పివి ఇన్నోవా క్రిస్టా అమ్మకాలు గత నెలలో 52 శాతం పెరిగి 3,939 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇన్నోవా అమ్మకాలు 2,575 యూనిట్లుగా ఉన్నాయి. టొయోటా ఇన్నోవాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం పుంజుకోలేదు.

మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం ఎమ్‌యూవీ మారుతి ఎక్స్‌ఎల్ 6 జనవరి 2021లో 305 శాతం వృద్ధిని సాధించి 3,119 యూనిట్ల విక్రయాలను నోమదు చేసింది. గతేడాది జనవరిలో ఈ మోడల్ కేవలం 770 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ కార్నివాల్ అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీని అధిక ధర కారణంగా, మార్కెట్లో ఇది రాణించలేకపోతోంది. ఆటో ఎక్స్‌పో 2020లో విడుదలైన ఈ మోడల్ గత జనవరి 2021లో కేవలం 328 యూనిట్లను విక్రయాలను మాత్రమే నమోదు చేయగలిగింది.

జనవరి 2021లో మహీంద్రా మరాజో అమ్మకాలు 86 శాతం తగ్గి 175 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో డాట్సన్ గో ప్లస్ అమ్మకాలు 30 యూనిట్లుగా మాత్రమే నమోదై 45 శాతం క్షీణతను నమోదు చేసింది. గత నెలలో టొయోటా అందిస్తున్న లగ్జరీ ఎమ్‌పివి వెల్‌ఫైర్ ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు.
MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో