Just In
- 11 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 3 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 2021లో బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే.. వీటిలో మీ ఫేవరేట్ ఏది?
భారత మార్కెట్లో ఎస్‌యూవీలకు గిరాకీ బాగా పెరుగుతోంది. ఈ విభాగంలో అనేక మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ వివిధ కస్టమర్ల అసరాలకు అనుగుణంగా రకరకాల మోడళ్లు లభిస్తున్నాయి.

మార్కెట్లో ఇప్పటికే ఉన్న మోడళ్లతో పాటుగా ఇటీవలి రెండు మూడు నెలల కాలంలో కొత్తగా మరిన్ని ఎస్‌యూవీలు వచ్చాయి. మరికొద్ది నెలల్లో రెనో కైగర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కొడా కుషాక్ మొదలైన ఎస్‌యూవీలు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి.

గడచిన జనవరి 2021 నెల ఎస్‌యూవీ విభాగంలో అమ్మకాలు జోరుగా సాగాయి. నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్ వంటి కొత్త మోడళ్ల రాకతో, ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు మెరుగుపడ్డాయి. గత నెలలో హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా మొదటి స్థానంలో ఉంది. డిసెంబర్ 2020లో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ కూడా టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకుంది.
MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్‌రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

జనవరి 2020లో సరికొత్త రూపంలో వచ్చిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ, కస్టమర్లను చక్కగా ఆకర్షిస్తోంది. జనవరి 2020లో 6,900 యూనిట్లను విక్రయించిన హ్యుందాయ్ జనవరి 2021లో 12,284 యూనిట్లను విక్రయించి 78 శాతం వృద్ధిని నమోదు చేసింది. టాప్-10 ఎస్‌యూవీలలో క్రెటా నెంబర్ వన్ స్థానంలో ఉంది.

క్రెటా తర్వాతి స్థానాన్ని హ్యుందాయ్ వెన్యూ ఆక్రమించింది. జనవరి 2021లో హ్యుందాయ వెన్యూ అమ్మకాలు 11,779 యూనిట్లుగా నమోదై, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే 74 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ ఏడాది హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్ తీసుకురావచ్చని సమాచారం.

మారుతి సుజుకి అందిస్తున్న విటారా బ్రెజ్జా ఈ జాబితాలో 3వ స్థానానికి పడిపోయింది. గతేడాది జనవరిలో ఈ మోడల్ అమ్మకాలు 10,134 యూనిట్లుగా ఉంటే, ఈ ఏడాది జనవరిలో 10,623 యూనిట్లు అమ్ముడయ్యాయి. అమ్మకాల పరంగా ఈ మోడల్ 4 శాతం స్వల్ప పెరుగుదలను చూసింది.

కియా మోటార్స్ అందిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెల్టోస్, మార్కెట్లోకి వచ్చిన ప్రారంభ నెలల్లో అగ్రస్థానాల్లో నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ మోడల్ అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. జనవరి 2021లో సెల్టోస్ అమ్మకాలు 34 శాతం తగ్గి 9,869 యూనిట్లుగా నమోదయ్యాయి.
MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

కియా మోటార్స్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సొనెట్ అమ్మకాలు జనవరి 2021లో 8,859 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ నెక్సాన్ ఎస్‌యూవీ, అమ్మకారల పరంగా గత కొన్ని నెలలుగా అద్భుతమైన పనితీరును చూపుతోంది.

జనవరి 2021లో టాటా నెక్సాన్ అమ్మకాలు 8,225 యూనిట్లుగా నమోదయ్యాయి. జనవరి 2020లో ఈ మోడల్ అమ్మకాలు 3,382 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సమయంలో టాటా నెక్సాన్ అమ్మకాలు 143 శాతం పెరిగాయి.
MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

మహీంద్రా అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ300 అమ్మకాలు గత నెలలో 4,612 యూనిట్లుగా నమోదై 37 వృద్ధిని సాధించాయి. ఇదే సమయంలో, కంపెనీ విక్రయిస్తున్న స్కార్పియో అమ్మకాలు 5,316 యూనిట్ల నుండి 4,081 యూనిట్లకు పడిపోయి, 23 శాతం క్షీణతను నమోదు చేశాయి.

జనవరి 2021లో టొయోటా అందిస్తున్న అర్బన్ క్రూయిజర్ అమ్మకాలు 3075 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, ఈ సమయంలో నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాలు 3,011 యూనిట్లుగా ఉన్నాయి. త్వరలో ఈ సెగ్మెంట్‌లో రెనో కైగర్ మార్కెట్లోకి ప్రవేశించనుంది.