BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

ఉద్యోగరీత్యా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి బదిలీ అయ్యే వారిని దృష్టిలో ఉంచుకొని, వారి వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MORTH India) ఓ కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై ఇలాంటి ఉద్యోగులు తమ వాహనాల రిజిస్ట్రేషన్ ను కొత్తగా బదిలీ అయ్యే రాష్ట్రంలోకి మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

ఇందుకోసం, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, వాహనాల కోసం భారత్ సిరీస్ (BH- Series) పేరిట కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ ను ప్రవేశపెట్టింది. MoRTH కొన్ని నెలల క్రితం వాహనాల కోసం ఈ కొత్త పాన్-ఇండియా రిజిస్ట్రేషన్ సిరీస్‌ను ప్రతిపాదించింది. ఇప్పుడు ఇది, అధికారికంగా అమల్లోకి వచ్చింది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

ఈ నిబంధన ప్రకారం, వాహన యజమాని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారినప్పుడు, అతని వాహనానికి BH- సిరీస్ గుర్తు ఉన్నరిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నట్లయితే, అతను తన వాహనాన్ని కొత్తగా బదిలీ అయిన రాష్ట్రంలో రీ-రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఉద్యోగరీత్యా తరచూ రాష్ట్రాలు మారే ఉద్యోగులకు ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

ప్రస్తుతం ఈ సదుపాయం దేశ రక్షణ సిబ్బంది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రాష్ట్ర పిఎస్‌యులు మరియు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో కార్యాలయాలు కలిగిన ప్రైవేటు రంగ కంపెనీలకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

BH-Series ప్లేట్లు : లభ్యత మరియు ఫార్మాట్

పైనక తెలిపినట్లుగా, MoRTH జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రస్తుతం ఈ సౌకర్యం కేవలం రక్షణ సిబ్బంది, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పిఎస్‌యులు మరియు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో కార్యాలయాలు కలిగి ఉన్న ప్రైవేట్ రంగ కంపెనీలకు మాత్రమే స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటుంది. అంటే, పైవిభాగాలకు చెందని సాధారణ పౌరులకు మాత్రం ఇది వర్తించదు.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

ఇక BH-Series నెంబర్ ప్లేట్ల ఫార్మాట్ విషయానికి వస్తే, ఈ ప్లేట్‌లో వాహన రిజిస్ట్రేషన్ సంవత్సరం, భారత్ సిరీస్ కోసం BH- కోడ్, సంఖ్యలు మరియు అక్షరాలు ఉంటాయి. ఈ ఫార్మాట్ ఆధారంగా, వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ విధంగా ఉంచబడుతుంది - "21 BH 0000 AA". ఇందులో 21 అనేది సంవత్సరం, BH అనేది భారత్ సిరీస్, 0000 అనేది వాహన రిజిస్ట్రేషన్ సంస్య మరియు AA అనేది రిజిస్ట్రేషన్ సిరీస్ అవుతుంది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

BH-Series ప్లేట్లు : రోడ్డు టాక్స్ స్ట్రక్చర్

కొత్త BH-Series రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాల రోడ్ టాక్స్ విధానం సాధారణ వాహనాల రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాల కన్నా భిన్నంగా ఉంటుంది. దీని ప్రకారం, కొత్త BH-Series కలిగిన వాహనాలు రోడ్ టాక్స్ ను రెండు సంవత్సరాలు లేదా దానికి రెండు గుణకాల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

అంటే, ప్రీ-పెయిడ్ విధానం మాదిరిగా, ఇలాంటి వాహన రిజిస్ట్రేషన్ కలిగిన యూజర్లు ప్రతి రెండేళ్లకు ఒక్కసారి చొప్పున రోడ్ టాక్స్ చెల్లించుకోవచ్చు. లేదంటే రెండేళ్లు లేదా నాలుగేళ్లు లేదా ఆరేళ్లు లేదా ఎనిమిదేళ్లు లేదా పదేళ్లు ఇలా రెండేళ్లకు రెండు రెట్లు చొప్పున కలుపుంటూ చెల్లించుకోవచ్చు.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

సింపుల్‌గా చెప్పాలంటే, మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే లేదా ప్రతి రెండేళ్లకు తరచూ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకునే సమస్య వద్దనుకుంటే, ఒకేసారి దీర్ఘకాలానికి గానూ ఇలాంటి వాహనాలకు రోడ్ టాక్స్ చెల్లించవచ్చు. సాధారణ వాహనాల విషయంలో ప్రతి 14 ఏళ్లకు ఒక్కసారి చొప్పున రోడ్ టాక్స్ వసూలు చేస్తారు. ఈ గడువు పూర్తయిన తర్వాత, మోటారు వాహన పన్ను లేదా రహదారి పన్ను ప్రతి ఏటా వసూలు చేస్తారు. ఇది ఆ వాహనం కోసం గతంలో వసూలు చేసిన మొత్తంలో సగం ఉంటుంది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

కొత్త రాష్ట్రానికి వాహనాల రిజిస్ట్రేషన్ ను బదిలీ చేసే సాధారణ ప్రక్రియ

ప్రస్తుతం, మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 47 ప్రకారం, ఒక వాహన యజమాని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారినప్పుడు, తనతో పాటుగా తన వాహనాన్ని కూడా కొత్త రాష్ట్రంలోకి తీసుకువెళ్లినట్లయితే, ఆ కొత్త రాష్ట్రంలో వారు తమ వాహనాన్ని పాత రాష్ట్రపు రిజిస్ట్రేషన్ నెంబరుతో 12 నెలలకు మించి ఉపయోగించడానికి వీలు లేదు.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

ఈ 12 నెలల సమయంలో సదరు వాహన యజమాని తన వాహనాన్ని కొత్త రాష్ట్రానికి బదిలీ చేయడానికి అనుమతి ఉంటుంది. సదరు వాహన యజమాని తన వాహనాన్ని కొత్త రాష్ట్రంలో రిజిస్టర్ చేయడానికి, పాత రాష్ట్రం లోని ఆర్టీఓ నుండి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ NOC ని కొత్త రాష్ట్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించి, రహదారి పన్నును ప్రో-రాటా ప్రాతిపదికన చెల్లించిన తర్వాత వాహనానికి కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది.

BH-సిరీస్ నెంబర్ ప్లేట్ కోసం ఎవరు ధరఖాస్తు చేసుకోవచ్చు? రోడ్ టాక్స్ ఎలా ఉంటుంది?

దీని తర్వాత సదరు వాహన యజమాని తన పాత రాష్ట్రంలో ప్రో-రాటా ప్రాతిపదికన రోడ్ ట్యాక్స్ రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ చాలా శ్రమ మరియు ఖర్చుతో కూడుకున్నది. ఈ రిజిస్ట్రేషన్ మార్పు కోసం వాహన యజమానులు రెండు రాష్ట్రాల ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సి ఉంటుంది. అయితే, ఈ కొత్త BH-Series రిజిస్ట్రేషన్ విధానంతో, ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.

Most Read Articles

English summary
Bh series road tax format and registration process details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X