భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

భారతదేశంలో కొన్ని నెలల ముందు, రోడ్డు, రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) వాహన రిజిస్ట్రేషన్ కోసం కొత్త నంబర్ సిరీస్‌ను ప్రకటించింది. ఎప్పుడూ బదిలీ మీద వెళ్లే ఉద్యోగాలలో ఉన్న వారితో పాటు వారి వాహనాలను తీసుకెళ్లాలనుకునే వ్యక్తుల కోసం కొత్త భారత్ సిరీస్ (BH) నంబర్‌ప్లేట్‌లు ప్రవేశపెట్టబడ్డాయి.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

ఇప్పుడు ఎట్టకేలకు మహారాష్ట్ర రవాణా శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ మొదటి 'బీహెచ్' నెంబర్​ ప్లేటు ఉన్న వాహనాన్ని ఆవిష్కరించారు. ముంబయికి చెందిన 'శ్రద్ధా సూటే' అనే మహిళ పేరుపై ఈ వాహనం రిజిస్టర్ అయింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సమన్వయంతో కేవలం ఎనిమిది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వడం విశేషం.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

సాధారణంగా ఇంతకు ముందు, వాహన యజమానులు 12 నెలలకు పైగా తన వాహనాన్ని కొత్త రాష్ట్రానికి తరలిస్తే ఆ వాహనానికి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యోగాలు లేదా ఇతర కారణాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అనేక బదిలీలు తీసుకునే వ్యక్తులకు ఇది చాలా దుర్భరమైనది. అయితే ఇలాంటి వాటికి స్వస్తి పలకడానికి ఈ BH నంబర్‌ప్లేట్‌లను పరిచయం చేయబడింది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

ఇందులో భాగంగానే కన్వెన్షనల్ రిజిస్ట్రేషన్ కింద 15 ఏళ్లపాటు రోడ్ టాక్స్ చెల్లించాలి. అయితే BH నంబర్ సిరీస్‌లో, రోడ్ టాక్స్ మొదట రెండు సంవత్సరాలు మాత్రమే చెల్లించబడుతుంది. ఆ తర్వాత యజమానులు వారు మారిన రాష్ట్రానికి సంబంధించిన టాక్స్ చెల్లించవచ్చు.

'BH సిరీస్' అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, కొన్ని రకాల ప్రైవేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకూ బదిలీ అవుతుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, వారు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాల్లోని నిబంధనల మేరకు BH Registration Road Tax చెల్లించాలి. ఆ తరవాత వాహనం మొదట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న రాష్ట్రంలోని రవాణా శాఖలో వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే, ఆ రాష్ట్రంలో అంతకుముందు చెల్లించిన పన్నుల మొత్తాన్ని తిరిగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కొన్ని నెలలు పడుతుంది.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

దీని కోసం రాష్ట్రాల మధ్య పలు సార్లు తిరగాల్సి వస్తుంది. ఇది చాలా కష్టంతో కూడుకున్న మరియు డబ్బుతో కూడుకున్న పని, కావున వాహనాల యజమానులు బదిలీ అయిన రాష్ట్రంలో వాహనాల నమోదుకు ఆసక్తి కనబర్చటం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం 'BH' విధానాన్ని తీసుకువచ్చింది. ఇది ఇప్పుడు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

ఉద్యోగ బదిలీ కారణంగా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి మారే ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, వారి వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో, వారికి లబ్ధి చేకూరేలా 'ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషన్' ఉండేలా భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త BH సిరీస్ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న వాహనాలను దేశంలోని ఏ రాష్ట్రంలో నైనా ఎంత కాలమైనా, ఎలాంటి ఆంక్షలు లేకుండా నడుపుకోవచ్చు. మరి ఈ BH సిరీస్ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం అర్హులైన వారు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం గురించి ఇక్కడ కింద చూడవచ్చు.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

మొదటి దశ 1 :- భారత్ సిరీస్ (BH Series) రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం, ముందుగా మీరు మీ రాష్ట్రం (మీ వాహనం ప్రస్తుతం ఎక్కడైతే రిజిస్టర్ చేయబడి ఉంటుందో ఆ రాష్ట్రం) నుండి NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ను పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మరొక రాష్ట్రం (కొత్తగా బదిలీ అయ్యే రాష్ట్రం) యొక్క BH సిరీస్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

రెండవ దశ 2 - ఇలా ఎన్ఓసి పొందిన తర్వాత, కొత్త రాష్ట్రంలో రోడ్ టాక్స్ ను ప్రో -రాటా ప్రాతిపదికన చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త రాష్ట్రం మీకు భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్ నెంబరును కేటాయిస్తుంది.

మూడవ దశ 3 - ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తుదారులు తమ మాతృ రాష్ట్రంలో రోడ్ టాక్స్ వాపసు కోసం దరఖాస్తును దాఖలు చేసుకోవాలి. రోడ్డు పన్ను వాపసు పొందే ప్రక్రియ రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుందని వాహనదారులు తెలుసుకోవాలి.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

BH సిరీస్ రిజిస్ట్రేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది?

BH రిజిస్ట్రేషన్ ఫార్మాట్ "YY BH #### XX" గా ఉంటుంది. ఇందులో YY అనేది మొదటి సంవత్సరం రిజిస్ట్రేషన్, BH అనేది భారత్ సిరీస్ కోడ్, #### అనేది 0000 నుండి 9999 వరకు గల ఏవైనా నాలుగు సంఖ్యలు మరియు చివరగా XX అనేది AA నుండి ZZ వరకు కలిగిన ఆంగ్ల అక్షరాలు. ఉదాహరణకు, ఈ కొత్త సిరీస్ క్రింద వాహన రిజిస్ట్రేషన్ సంఖ్య [21 BH 1234 AB] ఇలా ఉంటుందని అనుకోవచ్చు.

భారత్‍లో మొదలైన BH సిరీస్ ప్రక్రియ.. మొదటి నెంబర్ ప్లేట్ ఎవరికంటే?

ఇలా BH సిరీస్ రిజిస్ట్రేషన్ పొందిన వినియోగదారులు తమ వాహనానికి సంబంధించిన మోటార్ వాహన పన్ను రెండు సంవత్సరాలకు ఒక్కసారి చొప్పున లేదా 4, 6, 8, 10 ఇలా రెండేసి గుణకాల చొప్పున చెల్లించే సదుపాయం ఉంటుంది. సాధారణంగా, వాహనాల విషయంలో ప్రతి 14 ఏళ్లకు ఒక్కసారి చొప్పున రోడ్ టాక్స్ వసూలు చేస్తారు. ఈ గడువు పూర్తయిన తర్వాత, మోటారు వెహికల్ టాక్స్ లేదా రోడ్ టాక్స్ అనేది ప్రతి ఏటా వసూలు చేస్తారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా వాహన వినియోగదారులు తెలుసుకోవాలి.

NOTE: ఈ ఆర్టికల్ లో మొదటి 4 చిత్రాలు తప్ప మిగిలినవి కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Bharat series bh number plates started details
Story first published: Sunday, October 31, 2021, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X