టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) గడచిన సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ (Tata Xpres-T EV) ఎలక్ట్రిక్ కారు కోసం భారీ ఆర్డర్ ను దక్కించుకుంది. ఈ మేరకు టాటా మోటార్స్ ప్రముఖ ఎలక్ట్రిక్ రైడ్-హెయిలింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ మొబిలిటీ (BluSmart Mobility) తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

ఈ ఒప్పందంలో భాగంగా, టాటా మోటార్స్ మొత్తం 3,500 యూనిట్ల ఎక్స్‌ప్రెస్-టి ఎలక్ట్రిక్ వాహనాలను బ్లూస్మార్ట్ మొబిలిటీకి అందజేయనుంది. బ్లూస్మార్ట్ మొబిలిటీ ఈ ఎలక్ట్రిక్ కార్లను ఢిల్లీ ఎన్‌సిఆర్ రీజియన్‌ లో ఫుల్-ఎలక్ట్రిక్ ట్యాక్సీ ఫ్లీట్ గా ఉపయోగించనుంది. అప్‌డేటెడ్ టాటా టిగోర్ ఈవీ (Tata Tigor EV) ఎలక్ట్రిక్ కారు ఆధారంగా చేసుకొని, టాటా మోటార్స్ ఈ ఎక్స్‌ప్రెస్-టి అనే కారును ప్రత్యేకించి ఫ్లీట్ ఆపరేటర్ కస్టమర్ల కోసం రూపొందించింది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ కేవలం ఫ్లీట్ ఆపరేటర్లు మరియు వాణిజ్య వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది సాధారణ కస్టమర్ల కోసం విక్రయించబడదు. ఆసక్తిగల కస్టమర్లు దీని స్థానంలో టాటా టిగోర్ ఈవీని కొనుగోలు చేయవచ్చు. దేశీయ మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ. 9.54 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

బ్లూస్మార్ట్ మొబిలిటీ అనేది ఆల్-ఎలక్ట్రిక్, ఆన్‌లైన్ రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్, ఇది ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలోని వినియోగదారులకు జీరో ఎమిషన్ రైడ్‌ లను అందిస్తోంది. కంపెనీ ఇప్పటికే నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ లో 22 మిలియన్ కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఇప్పటి వరకు 7,00,000 కంటే ఎక్కువ రైడ్‌ లను అందించింది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

బ్లూస్మార్ట్ మొబిలిటీ కేవలం మహిళా వినియోగదారులకు మాత్రమే కాకుండా మహిళా డ్రైవర్ భాగస్వామ్యులకు కూడా ఎంపిక చేసుకునే వేదికగా మారింది. ఇందులో డ్రైవర్ భాగస్వామ్యులు, కంపెనీ నుండి ఎటువంటి ఆస్తి యాజమాన్య అవాంతరాలు లేకుండా ఒత్తిడి లేని సమానమైన సంపాదన అవకాశాన్ని పొందుతారని కంపెనీ పేర్కొంది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ విషయానికి వస్తే, అప్‌డేటెడ్ టిగోర్ ఈవీ మాదిరిగానే ఇది లేటెస్ట్ జిప్‌ట్రాన్ (Ziptron) టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ టెక్నాలజీ కారణంగా, ఇది మునుపటి కంటే మెరుగైన రేంజ్ మరియు పరవ్, టార్క్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ Tata Xpres-T EV ఎలక్ట్రిక్ కారును లాంగ్ రేంజ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలతో అందిస్తోంది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

కస్టమర్ల అవసరాలను బట్టి కొత్త Xpres-T EV ఎలక్ట్రిక్ సెడాన్ రెండు రకాల రేంజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది పూర్తి చార్జ్ పై 213 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేసే 21.5 kWh బ్యాటరీ ప్యాక్ మరియు రెండవది పూర్తి చార్జ్ పై 165 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేసే 16.5 kWh బ్యాటరీ ప్యాక్. (గమనిక: ఈ రేంజ్ ARAI ధృవీకరించబడినది).

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

ఇక చార్జింగ్ సమయం విషయానికి వస్తే, టాటా ఎక్స్‌ప్రెస్-టి ఎలక్ట్రిక్ కారులోని 16.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ని ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి కేవలం 90 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే, ఇందులోని 21.5 kWh బ్యాటరీ ప్యాక్‌ ను 110 నిమిషాల్లో 0 నుండి నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

ఈ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ చార్జర్ తో పాటుగా స్టాండర్డ్ 15 యాంప్స్ హోమ్ చార్జర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కారును ఏదైనా సాధారణ 15 amp ప్లగ్ పాయింట్ నుండి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో స్టాండర్డ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ ను కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, దీని ఇంటీరియర్ థీమ్ మొత్తం ప్రీమియం బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈవీ ఎలక్ట్రిక్ కారును కంపెనీ XM మరియు XZ అనే రెండు ట్రిమ్ లలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు సున్నా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇది సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్ డ్రైవర్ మరియు కో ప్యాసింజర్ కోసం) మరియు ఈబిడి తో కూడిన ఏబిఎస్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా లభిస్తాయి.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

ఈ డీల్ సందర్భంగా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (కమర్షియల్) హెడ్ రమేష్ దొరైరాజన్ మాట్లాడుతూ.. "ఎక్స్‌ప్రెస్-టి ఈవీతో టాటా మోటార్స్ ఫ్లీట్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. మేము బ్లూస్మార్ట్ మొబిలిటీతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది మరియు ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ ఫ్లీట్‌ను పెంచడంలో వారి నిరంతర ప్రయత్నాలకు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము" అని అన్నారు.

టాటా నుండి 3500 Xpres-T ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేసిన బ్లూస్మార్ట్ మొబిలిటీ!

ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొత్త టాటా ఎక్స్‌ప్రెస్-టి ఈీ సరైన బ్యాటరీ పరిమాణం, క్యాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్‌తో వస్తుందని, ఇది యాజమాన్యం యొక్క తక్కువ ధరకు హామీ ఇస్తుందని చెప్పారు. భద్రత మరియు ప్రయాణీకుల సౌకర్యాలతో పాటు, ఫ్లీట్ ఓనర్లు మరియు ఆపరేటర్‌లకు ఇది సమగ్రమైన మరియు ఆకర్షణీయమైన ప్రతిపాదనగా మారిందని, తాము ఇటీవలే రోడ్డుపై 10,000 టాటా ఈవీల కీలక మైలురాయిని కూడా అధిగమించామని అన్నారు.

Most Read Articles

English summary
Blusmart mobility brought 3500 xpres t evs from tata motors details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X