బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ: ఫుల్ వీడియో.. ఇప్పుడు మీకోసం

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవీని రూ. 35.90 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో దేశీయ మార్కెట్లో ప్రారంభించింది. మేము ఇటీవల ఈ ఫేస్ లిఫ్టెడ్ ఎక్స్1 ఎస్‌యూవీని నగరంలో మరియు హైవేపై డ్రైవ్ చేసాము. బిఎమ్‌డబ్ల్యూ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి యొక్క ఫీచర్స్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి.

బిఎండబ్ల్యు ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవిలో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు ఉంటాయి. ఇందులో ఉన్న పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఎక్స్1 ఎస్‌యూవి డాష్‌బోర్డ్‌లో 8.8 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది టచ్ చేయగానే రెస్పాండ్ అయ్యే విధంగా ఉంది. ఇది ఆపిల్ కార్ప్లేతో వస్తుంది. అయితే ఆండ్రాయిడ్ ఆటోతో సిస్టమ్‌ను సన్నద్ధం చేయడంలో బిఎమ్‌డబ్ల్యూ విఫలమైంది.

బిఎండబ్ల్యు ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవి 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది బిఎస్ 6 ఉద్గారప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 190 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. ఇందులో పవర్ ముందు చక్రాలకు మరియు వెనుక వైపుకు ప్రసారం చేయబడుతుంది.

ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌1 ఎస్‌యూవిలో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. అవి ఎకో ప్రో, కంఫర్ట్ మరియు స్పోర్ట్ మోడ్‌లు. ఎకో ప్రో మోడ్‌లో, స్టీరింగ్ తేలికగా ఉటుంది, కానీ త్రాటల్ రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది, కానీ ఈ మోడ్ లో ఇంధనం చాలావరకు ఆదా అవుతుంది.

దేశీయ మార్కెట్లో జర్మన్ బ్రాండ్ అందించే ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ ఈ బిఎమ్‌డబ్ల్యూ ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్ 1. ఈ ఎస్‌యూవీలో వాహనదారునికి అనుకూలమైన సౌకర్యం మరియు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 1 దేశీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, ఆడి క్యూ 3 ఎస్‌యూవీ వంటి వాటికిప్రత్యర్థిగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ వీడియో

More from DriveSpark

Article Published On: Friday, April 23, 2021, 17:19 [IST]
English summary
BMW X1 S-Drive 20d Review Video. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+