2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కంపెనీలలో ఒకటి. ఈ కంపెనీ రానున్న కొత్త సంవత్సరం 2022 లో బీఎండబ్ల్యూ ఎక్స్3 ఫేస్‌లిఫ్ట్ BMW X3 Facelift విడుదల చేయనుంది. ఈ కొత్త కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

భారతీయ మార్కెట్లో 2022 కొత్త సంవత్సరంలో విడుదల కానున్న ఈ కొత్త బీఎండబ్ల్యూ కారు కంపెనీ యొక్క మొదటి కారు కానుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి రెండవ వారంలో తీసుకురావాల్సి ఉంది, కానీ కంపెనీ దీనిని అనేక మార్పులతో తీసుకురానున్న కారణంగా ఇది మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 2022 లో మొదటి త్రైమాసికంలోనే ఇది విడుదలయ్యే అవకాశం ఉంటుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. BMW X3 ఫేస్‌లిఫ్ట్ 2021 లోనే ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయబడింది. ఈ కొత్త SUV ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది, అంతే కాకూండా ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

BMW X3 ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద ఫ్రంట్ కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు రీడిజైన్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌ వంటి వాటిని పొందుతుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

ఈ SUV యొక్క రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉన్న LED టైల్‌లైట్లు మరియు ట్వీడ్ డిఫ్యూజర్‌తో కొత్త డిజైన్ బంపర్ పొందుతుంది. మొత్తానికి దీని ఎక్స్టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున కస్టమర్లను ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

2022 BMW X3 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని క్యాబిన్ లేఅవుట్ చాలా వరకు అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ గేజ్ క్లస్టర్, సరికొత్త ఐడ్రైవ్ కనెక్టివిటీ, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి వాటిని పొందుతుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

ఈ SUV పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 248 బిహెచ్‌పి పవర్ శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, 2.0-లీటర్, ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజన్, ఇది 188 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడ్డాయి, అంతే కాకూండా ఈ SUV ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంటుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

కంపెనీ ఇప్పటికే అందించిన ఒక కొత్త ప్లాన్ ప్రకారం, బహుశా ఇది మొదటి కారు కావచ్చు. BMW రానున్న సంవత్సరం భారతదేశంలో 25 కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. భారతదేశంలో తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి భారతదేశంలో వచ్చే 6 నెలల్లో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించనుంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

ఇదిలా ఉండగా, బిఎమ్‌డబ్ల్యూ తమ సరికొత్త ఐ4 (BMW i4) ఎలక్ట్రిక్ ఫోర్ డోర్ కూప్ మోడల్ కారును వచ్చే ఏడాది భారతదేశంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ జర్మన్ బ్రాండ్ వచ్చే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిఫైడ్ వాహనాలను ప్రారంభించాలని యోచిస్తోంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

ఇందులో మొదటిది iX SUV, ఇది వచ్చే ఏడాది BMW నుంచి వస్తున్న మొదటి EV అవుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత బిఎమ్‌డబ్ల్యూ తమ ఆల్-ఎలక్ట్రిక్ BMW i4 ఫోర్-డోర్ కూప్ సెడాన్ ను భారతదేశంలో విడుదల చేయవచ్చని సమాచారం. ఈ ఏడాది మార్చి నెలలోనే బిఎమ్‌డబ్ల్యూ తమ ఐ4 ఎలక్ట్రిక్ కూప్ మోడల్ ను అంతర్జాతీయంగా విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ ఎలక్ట్రిక్ కారు విడుదల గురించి ఖచ్చితమైన ప్రారంభ తేదీని విడుదల చేయనప్పటికీ, ఇది 2022 మధ్య నాటికి అమ్మకానికి రావచ్చని భావిస్తున్నారు.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

కొత్త BMW i4 ఎలక్ట్రిక్ కూప్ 4,783 మిమీ పొడవు, 1,852 మిమీ వెడల్పు మరియు 1,448 మిమీ ఎత్తును కలిగి ఉండి, పరిమాణంలో దాని IC (ఇంటర్నల్ కంబషన్) ఇంజన్ 3-సిరీస్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును CLAR ప్లాట్‌ఫారమ్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

కొత్త BMW i4 ఫోర్-డోర్ కూపే ఎలక్ట్రిక్ సెడాన్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో షట్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, రేపర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు ఎక్స్టీరియర్స్ లో ప్రత్యేకమైన బ్లూ హైలైట్‌లు ఉంటాయి. ఈ బ్లూ కలర్ డీటేలింగ్స్ ఇతర వాహనాలతో దీనిని ప్రత్యేకంగా ఉంచేందుకు మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ అని గుర్తు చేసేందుకు సహకరిస్తాయి.

2022 లో భారత్‌లో BMW విడుదల చేయనున్న ఫస్ట్ కార్, ఇదే.. చూసారా..!!

గ్లోబల్ మార్కెట్‌ లలో విక్రయించబడుతున్న ఈ ఎలక్ట్రిక్ కారులో రియల్ వీల్ డ్రైవ్ వేరియంట్ లో ఒక ఎలక్ట్రిక్ మోటార్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. BMW i4 eDrive40 వేరియంట్ గరిష్టంగా 340 బిహెచ్‌పి శక్తిని మరియు 430 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకోగలదు.

Most Read Articles

English summary
Bmw x3 facelift india launch on january 2022 details
Story first published: Wednesday, December 29, 2021, 14:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X