బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త ఎస్‌యూవీ 'మహీంద్రా బొలెరో నియో' కోసం కంపెనీ ఇప్పుడు అధికారిక యాక్ససరీల జాబితాను వెల్లడి చేసింది. దేశీయ విపణివో మహీంద్రా బొలెరో నియో ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

మహీంద్రా బొలెరో నియో కోసం కంపెనీ అందిస్తున్న యాక్ససరీల జాబితాను పరిశీలిస్తే, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

 • 15 ఇంచ్ డైమండ్-కట్ సిల్వర్ అల్లాయ్ వీల్స్ - రూ.8,700
 • 15 ఇంచ్ డైమండ్-కట్ మ్యాట్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ - రూ.8,700
 • ఫ్రంట్ మరియు రియర్ డోర్ క్లాడింగ్ - రూ.7,680
 • బ్రాకెట్‌తో కూడిన అల్యూమినియం సైడ్ స్టెప్ - రూ.11,137
 • బ్రాకెట్‌తో కూడిన ప్రీమియం సైడ్ స్టెప్ - రూ.10,800
 • ఫాక్స్ లెదర్ సీట్ కవర్స్ - రూ.11,740
 • వెంటిలేటెడ్ సీట్ కవర్ - రూ.7,400
 • ఫాబ్రిక్ మరియు వినైల్ సీట్ కవర్ - రూ.6,500
 • బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా
  • ఫిట్‌మెంట్ బ్రాకెట్‌లతో రూఫ్ క్యారియర్ - రూ.5,771
  • డిజైనర్ మ్యాట్ సెట్ - రూ.3,325
  • కార్పెట్ మ్యాట్ సెట్ - రూ.2,450
  • బ్రౌన్ కార్పెట్ మ్యాట్ సెట్ - రూ.1,535
  • పూర్తి ఫ్లోర్ లామినేషన్ మ్యాట్స్ - రూ.5,068
  • బ్లాక్ పివిసి మ్యాట్ సెట్ - రూ.1,400
  • బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా
   • డోర్ హ్యాండిల్ క్రోమ్ గార్నిష్ - రూ.2,300
   • సైడ్ మిర్రర్ క్రోమ్ గార్నిష్ - రూ.2,300
   • బ్లింకర్‌తో కూడిన సైడ్ మిర్రర్ గార్నిష్ - రూ.2,097
   • రెయిన్ వైజర్ (4 సెట్) - రూ.1,775
   • టెయిల్ ల్యాంప్ క్రోమ్ గార్నిష్ - రూ.2,725
   • హెడ్‌ల్యాంప్ క్రోమ్ గార్నిష్ - రూ.1,290
   • రియర్ లైసెన్స్ ప్లేట్ క్రోమ్ గార్నిష్ - రూ.1,266
   • క్రోమ్ ఫాగ్ ల్యాంప్ యాప్లిక్ సెట్ - రూ.918
   • మడ్ ప్రొటెక్టర్ సెట్ - రూ.610
   • రియర్ రిఫ్లెక్టర్ క్రోమ్ గార్నిష్ - రూ.462
   • బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

    మహీంద్రా తమ కొత్త బొలెరో నియోను జూలై 13, 2021వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న స్టాండర్డ్ బొలెరోతో పాటుగా ఈ కొత్త బొలెరో నియో ఎస్‌యూవీని కూడా విక్రయిస్తున్నారు. గతంలో మహీంద్రా విక్రయించిన టియువి300 ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కొత్త బొలెరో నియోని తయారు చేశారు.

    బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

    మహీంద్రా బొలెరో నియో మొత్తం మూడు వేరియంట్లలో (ఎన్4, ఎన్8 మరియు ఎన్10) అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా 7 సీట్ల (2+3+2) కాన్ఫిగరేషన్‌తో లభిస్తున్నాయి. ఇందులో ముందు వరుసలో రెండు, మధ్య వరుసలో మూడు మరియు చివరి వరుసలో రెండు సీట్ల చొప్పున మొత్తం ఏడు సీట్లు ఉంటాయి.

    బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

    భారత మార్కెట్లో మహీంద్రా బొలెరో నియో మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేయబడింది. కానీ, కంపెనీ ఇందులో మూడు వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడి చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

    • బొలెరో నియో ఎన్4 - రూ.8.48 లక్షలు
    • బొలెరో నియో ఎన్8 - రూ.9.48 లక్షలు
    • బొలెరో నియో ఎన్10 - రూ.9.99 లక్షలు
    • బొలెరో నియో ఎన్10 (ఓ) - ఇంకా వెల్లడించలేదు
    • బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

     మహీంద్రా బొలెరో నియో ఎక్స్టీరియర్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ క్రోమ్ గ్రిల్, ఎల్‌ఇడి హెడ్‌లైట్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, టెయిల్ లైట్లు, స్క్వేర్ ఫాగ్ లైట్లు మరియు గ్రే కలర్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్‌, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్, అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద టైర్లు వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

     బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

     కొత్త మహీంద్రా బొలెరో నియోలో కంపెనీ గొప్ప ఫీచర్లను అందిస్తోంది. ఈ కారులో 7 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 3.5 ఇంచ్ ఎమ్ఐడి, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్‌వ్యూ మిర్రర్స్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఐఎస్ఓ-ఫిక్స్‌డ్ చైల్డ్ సీట్ యాంకర్స్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైన ఫీర్లు ఉన్నాయి.

     బొలెరో నియో కోసం యాక్ససరీస్ జాబితాను వెల్లడించిన మహీంద్రా

     ఇంజన్ ఆప్షన్స్ విషయానికి మహీంద్రా బొలెరో నియో కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మైలేజ్ పెరుగుదల కోసం ఇందులో ఆటో స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు.

Most Read Articles

English summary
Bolero neo accessories list revealed by mahindra price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X