పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

భారతదేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారు ప్రధానంగా ఆలోచించే విషయం వాటి చార్జింగ్ సదుపాయాల గురించి. ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ పవర్ పై ఆధారపడి ఉంటాయి కాబట్టి, వాటిపై దూర ప్రయాణాలు చేయలేం.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

ప్రస్తుతం, మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ మౌళిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే, రానున్న సంవత్సరాల్లో ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ చాలా విస్తృతంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం, మనకు పెట్రోల్ బంకులు అడుగడునా అందుబాటులో ఉన్నట్లుగానే, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

పెట్రోల్ బంకుల్లోనే చార్జింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పి) ఓ ప్రకటన చేయగా, తాజాగా భారతదేశపు రెండవ అతిపెద్ద పెట్రోలియం రిటైలర్ అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కూడా ఈవీ చార్జింగ్ నెట్‌వర్క్ గురించి ఓ కీలక ప్రకటన చేసింది.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో సహాయపడటానికి తమ పెట్రోల్ పంపుల నెట్‌వర్క్‌ను ఉపయోగించనున్నట్లు బిపిసిఎల్ తెలిపింది. రానున్న ఐదేళ్లలో ఈవీ చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్లు ప్రకటించింది.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

సంప్రదాయ పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా సమాన స్థాయిలో ఉండే సమయంలో ఈ పెట్టుబడి BPCL కి ఎంతగానో సహాయపడుతుందని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా 1000 మెగావాట్ల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని BPCL లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

కేవలం ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లపై మాత్రమే కాకుండా, భవిష్యత్తు కోసం జీవ ఇంధనం మరియు హైడ్రోజన్‌ ఫ్యూయెల్ పై కూడా బిపిసిఎల్ పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం, BPCL కి దేశవ్యాప్తంగా 19,000 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. వీటి సాయంతో ఛార్జింగ్ సౌకర్యం, ఫ్లెక్స్-ఫ్యూయల్ మరియు హైడ్రోజన్ అందించడం ద్వారా సమీప భవిష్యత్తులో వీటిని 7,000 పవర్ స్టేషన్లుగా మార్చాలని కంపెనీ యోచిస్తోంది.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

ఇందుకోసం BPCL రాబోయే సంవత్సరాలలో ఖర్చు చేయబోయే సమగ్ర పెట్టుబడి ప్రణాళికలను వెల్లడి చేసింది. ఈ కంపెనీ గ్రూప్ స్థాయిలో ఒక లక్ష కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడుతుంది. ఇందులో ప్రధానంగా పెట్రోకెమికల్ సామర్థ్యాన్ని పెంచడం మరియు శుద్ధి చేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం రూ. 30,000 కోట్లు, గ్యాస్ సరఫరా కోసం రూ. 20,000 కోట్లు, గ్యాస్ అన్వేషణ మరియు ఉత్పత్తి కోసం రూ. 18,000 కోట్లు మరియు మార్కెటింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ. 18,000 కోట్లు ఖర్చు చేసే ప్రణాళికలు ఉన్నాయి.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) అభివృద్ధిని చూస్తోందని మరియు దేశంలో చాలా వరకూ ద్విచక్ర వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాలు ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలని ఆశిస్తున్నామని కంపెనీ ఛైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ చెప్పారు. ఆటోమొబైల్ వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఇదొక కొత్త వ్యాపార అవకాశమని ఆయన అన్నారు.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

బిపిసిఎల్ ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో 44 పెట్రోల్ పంపులలో EV ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్యను 1,000 కి పెంచాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా, కొచ్చి మరియు లక్నో నగరాల్లో ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాల కోసం బ్యాటరీ మార్పిడి ట్రయల్స్ కూడా ఈ చమురు కంపెనీ ప్రారంభించింది.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

ప్రత్యామ్నాయ ఇంధనాలను మరియు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త విధానాలను రూపొందిస్తున్న సంగతి తెలిసినదే. ఇందులో భాగంగా, దేశవ్యాప్తంగా 69,000 పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం కింద, ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పెట్రోల్ పంపుల వద్ద విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించబడతాయి.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

ఇతర దేశాలతో పోలిస్తే, మనదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం దేశంలో తగినంత ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడమే. ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి వాహనాన్ని ఛార్జ్ చేయడం.

పెట్రోల్ కొడతాం.. చార్జింగ్ పెడతాం..: పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!

ఎలక్ట్రిక్ వాహనంలో రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు ఛార్జ్ ఖాలీ అయిపోతే మరియు సమీపంలో ఛార్జింగ్ స్టేషన్ లేనట్లయితే, సదరు డ్రైవర్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, బిపిసిఎల్ మాదిరిగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లయితే, ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. మరి బిపిసిఎల్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.

Most Read Articles

English summary
Bpcl to setup ev charging stations at petrol pumps plans to invest rs 1 lakh crore in 5 years
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X