ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

భారతదేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతుంటే, లగ్జరీ కార్ల అమ్మకాలు మాత్రమే నానాటికి క్షీణించిపోతున్నాయి. దేశంలో కరోణా కారణంగా కుదేలైన లగ్జరీ కార్ల అమ్మకాలు, ఇప్పటికీ కోలుకోలేదు. గడచిన ఫిబ్రవరి 2021 నెలలో కూడా దేశీయ లగ్జరీ కార్ అమ్మకాలు క్షీణించాయి.

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

గత నెలలో భారతదేశంలో మొత్తం లగ్జరీ కార్ల అమ్మకాలు 52 శాతం క్షీణించి 1,732 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో భారత లగ్జరీ కార్ బ్రాండ్ల మొత్తం అమ్మకాలు 3,629 యూనిట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

తాజా డేటా ప్రకారం, ఫిబ్రవరి 2021లో కూడా టాప్ 10 లగ్జరీ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది. కేవలం 23 యూనిట్ల తేడాతో బిఎమ్‌డబ్ల్యూ రెండవ స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఆడి, వోల్వో, పోర్ష్ మొదలైన బ్రాండ్‌లు ఉన్నాయి. గత నెలలో బ్రాండ్ వారీగా అమ్మకాల వివరాలు ఇలా ఉన్నాయి:

Rank Brand Feb-21 Feb-20 Growth (%)
1 Mercedes-Benz 649 911 -28.8
2 BMW 626 755 -17.1
3 JLR 188 298 -36.9
4 Audi 187 314 -40.4
5 Volvo 88 123 -28.5
6 Porsche 33 40 -17.5
7 Bentley 3 4 -
8 Ferrari 2 2 0.0
9 Lamborghini 2 2 0.0
10 Rolls-Royce 1 2 -50.0

Source: Autopunditz

MOST READ:కొచ్చిలో కొత్త డీలర్‌షిప్‌ ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ; వివరాలు

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

ఫిబ్రవరి 2021లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలో 649 లగ్జరీ కార్లను విక్రయించింది. కాగా, ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య 911 యునిట్లుగా ఉంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 28.8 శాతం క్షీణించాయి.

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

ఈ జాబితాలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ద్వితీయ స్థానంలో ఉంది. గత నెలలో మొత్తం 626 బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కార్లు అమ్ముడుపోగా, ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య 755 యునిట్లుగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ గత నెలలో 17.1 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. గత నెలలో జెఎల్ఆర్ మొత్తం 188 కార్లను విక్రయించింది. అంతకు ముందు ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు 298 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో జెఎల్ఆర్ 36.9 శాతం క్షీణతను నమోదు చేసింది.

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నది జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి. గత ఫిబ్రవరి 2021లో ఆడి ఇండియా మొత్తం 187 లగ్జరీ కార్లను విక్రయించగా, ఫిబ్రవరి 2020లో 314 కార్లను విక్రయించి 40.4 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ:బాలీవుడ్ స్టార్ 'షాహిద్ కపూర్' కొనుగోలు చేయనున్న కొత్త కార్, ఇదే

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

ఇక ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది స్వీడన్‌కి చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో. వోల్వో ఇండియా గడచిన ఫిబ్రవరి 2021లో మొత్తం 88 కార్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020లో ఇవి 123 యూనిట్లుగా నమోదయ్యాయి. అప్పటితో పోల్చుకుంటే కంపెనీ అమ్మకాలు 28.5 శాతం క్షీణించాయి.

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

ఆరవ స్థానంలో ఉన్న పోర్ష్ లగ్జరీ బ్రాండ్ ఫిబ్రవరి 2021లో 33 యూనిట్లను విక్రయించి 17.5 శాతం క్షీణతను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో కంపెనీ మొత్తం అమ్మకాలు 40 యూనిట్లుగా ఉన్నాయి.

MOST READ:చిల్డ్రన్స్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ఎంజి సెంటర్ సభ్యులు చేయూత

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

గడచిన జనవరి 2021లో కేవలం 1 కారును మాత్రమే విక్రయించిన బెంట్లీ, ఫిబ్రవరి 2021లో 3 కార్లను విక్రయించింది. ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య 4 యూనిట్లుగా ఉంది. గత నెలలో ఫెరారీ రెండు కార్లను విక్రయించగా, అంతకు ముందు కూడా ఇదే సమయంలో రెండు కార్లను విక్రయించింది.

ఫిబ్రవరిలోనూ కలిసిరాని లక్.. లగ్జరీ కార్ల అమ్మకాలు స్లిప్..

లాంబోర్గినీ కూడా ఫెరారీ బాటలోనే పయనించి, గత నెలలో 2 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో కూడా లాంబోర్గినీ 2 కార్లను విక్రయించింది. రోల్స్ రాయిస్ విషయానికి వస్తే, ఈ బ్రాండ్ గడచిన ఫిబ్రవరి 2021లో 1 కారును మాత్రమే విక్రయించింది.

Most Read Articles

English summary
Brand Wise Luxury Car Sales In India In February 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X