ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ప్రణాళికలను ప్రకటించాయి. ఇందులో భాగంగానే హర్యానాలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కూడా కావలసిన చర్యలు తీసుకుంటున్నారు.

ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం, చండీఘర్ లోని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కరోలిన్ రోవెట్ శుక్రవారం హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో సమావేశమై దీని గురించి పలు అంశాలపై చర్చించారు. అంతే కాకుండా కరోలిన్ రోవెట్ హర్యానాలో ఎలక్ట్రిక్ వాహనాలు, పౌర విమానయానం మరియు అగ్రిటెక్లను ప్రోత్సహించడానికి సహకారాన్ని బలోపేతం చేయడం గురించి మాట్లాడారు.

ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సమగ్ర వృద్ధిని పెంపొందించాలనే హర్యానా ప్రభుత్వం లక్ష్యం గురించి దుష్యంత్ చౌతాలా కరోలిన్ రోవెట్‌కు వివరించారు. అంతే కాకుండా భవిష్యత్తులో రానున్న ఎలక్ట్రిక్ వాహనాల గురించి మరియు వాటి ద్వారా జరిగే వృద్ధి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

ఇదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అభివృద్ధి చేయడానికి మరియు ఏరోస్పేస్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చౌతాలా కరోలిన్‌కు సమాచారం ఇచ్చారు. ఇవన్నీ భవిష్యత్ లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముసాయిదా విధానం ఉత్తేజకరమైన అవకాశాలను జోడించిందని ఆయన అన్నారు.

ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

ఈ విధానంలో భూమి మరియు మౌలిక సదుపాయాల సబ్సిడీ, ప్రీ మరియు పోస్ట్ అప్రూవల్, విద్యుత్, ఆస్తి, పన్ను మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల గురించి చర్చలు జరిపారు. మేము ఇప్పటికే ఆటోమోటివ్ రంగంలో ప్రముఖ తయారీదారులలో ఒకరిగా ఉన్నాము మరియు ఇప్పుడు ఈ ప్రగతిశీల విధానాల ద్వారా ఇతర రంగాలలో ముందంజలో ఉన్నాము, అని కూడా ఆయన అన్నారు.

ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

రాబోయే ప్రాజెక్టులకు కూడా హర్యానా ప్రభుత్వానికి కావలసిన మద్దతు ఇస్తానని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కరోలిన్ రోవెట్ హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి ఎక్కువ మద్దతు ఇస్తానని కరోలిన్ వాగ్దానం చేశారు. విధానాన్ని ఖరారు చేయడానికి ముందు ఇన్‌పుట్‌లు భాగస్వామ్యం చేయబడతాయి. హర్యానా ప్రభుత్వ ముసాయిదా విధానాలను అభినందిస్తూ, హర్యానా ప్రభుత్వ భవిష్యత్తు విధానం ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు.

ఎలక్ట్రిక్ వాహన విధానానికి బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ మద్దతు; వివరాలు

ఇప్పటికే దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీనికి ప్రభుత్వాలు కూడా చాలా పథకాలను కొనుగోలుదారులకు అనుకూలంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
British Deputy High Commissioner Supports Haryana Government E Vehicle Policy. Read in Telugu.
Story first published: Saturday, July 3, 2021, 19:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X