సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

భారత మార్కెట్లోకి మరొక చైనీస్ ఎలక్ట్రిక్ కారు ప్రవేశించింది. చైనాకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto) భారతదేశంలో తమ మొట్టమొదటి 'ఇ6' (e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర, ఫీచర్లు, బ్యాటరీ, చార్జింగ్ మరియు రేంజ్ తదితర అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివి చూడటానికి ఇంచు మించు టొయోటా ఇన్నోవా మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ సాయంతో BYD e6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

బ్యాటరీ విషయానికి వస్తే, BYD e6 ఎలక్ట్రిక్ కారులో 71.6kWh 'బ్లేడ్' లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ముందు చక్రాలకు విద్యుత్ ను పంపిణీ చేస్తుంది. ఇది WLTP ప్రమాణాల ప్రకారం, పూర్తి చార్జ్ పై గరిష్టంగా 415 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

ఈ BYD e6 ఎలక్ట్రిక్ కారు యొక్క 'నగరం మాత్రమే' (సిటీ ఓన్లీ) రేంజ్, పూర్తి చార్జ్ పై 520 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ కారులో అమర్చిన కోబాల్ట్-రహిత LiFePO4 బ్యాటరీ ప్యాక్ 'బ్లేడ్' చాలా సురక్షితమైనది మరియు ఇది ప్రమాదవశాత్తు పంక్చర్ అయినప్పటికీ కాలిపోవడం లేదా పేలిపోవడం జరగదని కంపెనీ తెలిపింది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

బివైడి ఇ6 కారులోని బ్యాటరీ ప్యాక్ AC మరియు DC ఛార్జింగ్ ప్రమాణాలకు మద్దతు ఇస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, BYD e6 దాని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు మరియు దీనిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు గంటన్నర సమయం పడుతుంది. కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, కంపెనీ ఈ కారుతో పాటుగా BYD 7kW AC అనే ఛార్జర్‌ ను కూడా అందిస్తుంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

BYD e6 కొలతలను గమనిస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు 4,695 మిమీ పొడవు, 1,810 మిమీ వెడల్పు మరియు 1,670 మిమీ పొడవును కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి యొక్క వీల్‌బేస్ 2,800 మిమీ గా ఉంటుంది. BYD e6 ఎలక్ట్రిక్ కారు 570 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగి ఉంటుంది మరియు దీని మొత్తం బరువు 1,930 కిలోలుగా ఉంటుంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

బివైడి ఇ6 ఎలక్్రిక్ ఎమ్‌పివి చాలా సింపుల్ మరియు అంతే ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది. ముందు వైపు ఫేక్ గ్రిల్, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్ లో ఫేక్ ఎయిర్ ఇన్‌టేక్స్, గ్రిల్ కి ఎగువ భాగంలో క్రోమ్ స్ట్రైప్, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై టర్న్ ఇండికేటర్స్, సిల్వర్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ మరియు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

వెనుక వైపు వాలుగా ఉండే రూఫ్‌లైన్ డిజైన్, బ్లాకవుట్ చేయబడిన పిల్లర్స్, వెనుక భాగంలో మందపాటి క్రోమ్ బార్, సన్నటి ఎల్ఈడి స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, రియర్ రూఫ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బ్లాక్ అండ్ బాడీ కలర్ రియర్ బంపర్, విండో లైన్ చుట్టూ క్రోమ్ గ్రార్నిష్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో ఈ కారు చాలా స్టైలిష్ మరియు ప్రీమియంగా కనిపిస్తుంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు లోపల 10 ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, లెథర్ సీట్ అప్‌హోలెస్ట్రీ, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్స్ మరియు ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్‌ వంటి అనేక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేక్‌లు (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) మొదలైనవి ఉన్నాయి.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

BYD e6 ఎలక్ట్రిక్ వాహనంపై బిల్డ్ యువర్ డ్రీమ్ ఆటో కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే అది) వారంటీని అందిస్తోంది. అలాగే, ఇందులోని ట్రాక్షన్ మోటార్‌ పై 8 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు మరియు బ్యాటరీ సెల్ పై 8 సంవత్సరాలు లేదా 5 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

ఇక అసలు విషయానికి వస్తే.. Build Your Dreams Auto (బివైడి ఆటో) కంపెనీ విడుదల చేసిన ఈ BYD e6 (బివైడి ఇ6) ఎలక్ట్రిక్ కారు మొదటి దశలో భాగంగా ఢిల్లీ ఎన్‌సిఆర్, బెంగళూరు హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయవాడ, కొచ్చి మరియు అహ్మదాబాద్ నగరాలలోని చైనీస్ ఈవీ స్పెషలిస్ట్ షోరూమ్‌ లలో అందుబాటులో ఉంటుంది.

సర్‌ప్రైజ్.. భారత మార్కెట్లో బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విడుదల..

అయితే, బివైడి ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ప్రస్తుతం B2B (బిజినెస్ టూ బిజినెస్) సెగ్మెంట్‌ కు మాత్రమే అమ్మకానికి ఉంది. అంటే ఇది ఫ్లీట్ ఆపరేటర్లు మరియు ఇతర కార్పొరేట్ కొనుగోలుదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండదు. దేశీయ విపణిలో BYD e6 ధర రూ. 29.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 2, 2021, 10:13 [IST]
English summary
Byd e6 all electric mpv launched in india price specs and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+