కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

భారతదేశంలోని కార్ల తయారీదారులు సెమీకండక్టర్ చిప్స్ కొరత కొరత మరియు కరోనా మహమ్మారి ప్రభావం నుండి కోలుకోవడం ప్రారంభించడంతో, దేశీయ విపణిలో కార్ల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

సెప్టెంబర్ 2021 నెలలో భారత మార్కెట్లో విక్రయించిన 1.86 లక్షల యూనిట్లతో పోల్చుకుంటే, అక్టోబర్ 2021 నెలలో కార్ల తయారీదారులు 2.6 లక్షల యూనిట్లకు పైగా కార్లను విక్రయించారు. ఈ సమయంలో భారత కార్ మార్కెట్ ఏకంగా 40.1 శాతం పెరిగింది. ఏదేమైనప్పటికీ, అక్టోబర్ 2020తో పోల్చుకుంటే, అక్టోబర్ 2021లో అమ్మకాలు 73,592 యూనిట్లు తగ్గి 2,60,067 యూనిట్లకు పడిపోవడంతో కార్ల అమ్మకాలు 22.1 శాతం క్షీణించాయి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

గత ఏడాది ఇదే సమయంలో (అక్టోబర్ 2020లో) భారత మార్కెట్లో కార్ల అమ్మకాలు 3,33,659 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో మారుతి సుజుకి 41.9 శాతం మార్కెట్ వాటాతో, ఎప్పటి మాదిరిగానే భారత కార్ల మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

మారుతి సుజుకి గడచిన అక్టోబర్ 2021 నెలలో మొత్తం 1,08,991 యూనిట్ల కార్లను విక్రయించింది, ఇది సెప్టెంబర్ 2021 అమ్మకాల గణాంకాలతో పోలిస్తే (63,111 యూనిట్లు) 72.7 శాతం వృద్ధి చెందింది. అయితే, అక్టోబర్ 2020 తో పోల్చినప్పుడు, ఈ అమ్మకాలు చాలా తక్కువగా అనిపిస్తాయి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

భారతదేశపు అతిపెద్ద కార్‌మేకర్ అయిన మారుతి సుజుకి, అక్టోబర్ 2020 తో పోల్చితే 7.1 శాతం మార్కెట్‌ వాటాను కోల్పోయింది. అక్టోబర్ 2020లో కంపెనీ మొత్తం 1,63,656 యూనిట్లను విక్రయించింది. కాగా, అక్టోబర్ 2021లో ఇవి 1,08,991 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఈ నెలతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 33.4 శాతం తగ్గాయి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

ఇకపోతే, భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ అయిన హ్యుందాయ్ ఈ జాబితాలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మారుతి సుజుకీ మాదిరిగానే, హ్యుందాయ్ యొక్క నెలవారీ గణాంకాల విక్రయాలు అక్టోబర్‌ 2021లో గణనీయంగా 11.9 శాతం పెరిగి 37,021 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో (అక్టోబర్ 2020లో) హ్యుందాయ్ మొత్తం 56,605 యూనిట్లను విక్రయించింది.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

ఏదేమైనప్పటికీ, మారుతి సుజుకి మాదిరిగానే హ్యుందాయ్ కూడా తన మార్కెట్ వాటాలో గణనీయమైన భాగాన్ని (2.7 శాతం) కోల్పోయింది. వార్షికంగా చూసుకుంటే, గత నెలలో హ్యుందాయ్ అమ్మకాలు 34.6 శాతం తగ్గాయి. ఒకరకంగా చెప్పాలంటే, గత నెలలో భారతదేశంలోని అన్ని పెద్ద కార్ కంపెనీల అమ్మకాలు నెగిటివ్ గానే ఉన్నాయి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

ఇదిలా ఉంట, గత నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు మాత్రం గరిష్టంగా 43.8 శాతం వృద్ధి చెందాయి. అక్టోబర్ 2020లో టాటా మోటార్స్ మొత్తం 23,600 కార్లను విక్రయించగా, అక్టోబర్ 2021లో ఇవి 33,926 యూనిట్లకు పెరిగాయి. గత నెలలో కంపెనీ విడుదల చేసిన మైక్రో ఎస్‌యూవీ 'టాటా పంచ్' (Tata Punch) టాటా మోటార్స్ మొత్తం అమ్మకాల పెరుగదలకు దోహదపడిందని చెప్పవచ్చు.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

అలాగే, ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు కూడా గత నెలలో సానుకూలంగానే ఉన్నాయి. అక్టోబర్ 2020లో మహీంద్రా మొత్తం 18,317 వాహనాలను విక్రయిస్తే, అక్టోబర్ 2021లో కంపెనీ మొత్తం 20,034 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 9.4 శాతం పెరిగాయి. మహీంద్రా లేటెస్ట్‌ గా విడుదల చేసిన ఎక్స్‌యూవీ700 (XUV700) వలన కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

ఈ జాబితాలో కియా ఐదవ స్థానంలో ఉంది. గత నెలలో కియా మొత్తం అమ్మకాలు 16,331 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, అక్టోబర్ 2020లో కంపెనీ మొత్తం 21,021 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ సమయంలో కియా అమ్మకాలు 22.3 శాతం క్షీణించాయి. కాగా, కియా మార్కెట్ వాటాలో మాత్రం ఎలాంటి మార్పు లేదు, ఇదు 6.3 శాతం వద్ద స్థిరంగా ఉంది.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా గత నెలలో మొత్తం 12,440 యూనిట్ల వాహనాలను విక్రయించి ఆరవ స్థానంలో నిలిచింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 12,373 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో టొయోటా అమ్మకాలు స్వల్పంగా 0.5 శాతం పెరిగాయి. అయితే, మార్కెట్ వాటా మాత్రం 1.1 శాతం పెరిగి 3.7 శాతం నుండి 4.8 శాతానిని వృద్ధి చెందింది.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గత నెలలో 8,910 యూనిట్లను విక్రయించింది. కాగా, అక్టోబర్ 2020లో ఇవి 11,005 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో రెనో అమ్మకాలు 19 శాతం తగ్గాయి. గత నెలలో హోండా కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 2020లో కంపెనీ విక్రయించిన 10,836 యూనిట్లతో పోల్చుకుంటే, కంపెనీ గత నెలలో 8,108 కార్లను విక్రయించి, అమ్మకాలలో 25.2 శాతం క్షీణతను నమోదు చేసింది.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నది జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్. అక్టోబర్ 2020లో నిస్సాన్ కేవలం 1,105 కార్లను మాత్రమే విక్రయిస్తే, అక్టోబర్ 2021లో కంపెనీ 3,913 కార్లను విక్రయించింది. ఈ సమయంలో నిస్సాన్ ఇండియా అమ్మకాలు గణనీయంగా 254.1 శాతం వృద్ధి చెందాయి. మార్కెట్ వాటా 1.2 శాతం పెరిగి 0.3 శాతం నుండి 1.5 శాతానికి చేరుకుంది. మాగ్నైట్ ఎస్‌యూవీ కారణంగా కంపెనీ అమ్మకాలు పెరిగాయి.

కార్ కంపెనీలపై కరోనా పంజా.. కోలుకునేలోపే సెమీకండక్టర్ చిప్స్ కొరత..

టాప్ 10 జాబితాలో చివరి స్థానంలో ఉన్న ఫోక్స్‌వ్యాగన్. గత నెలలో ఫోక్స్‌వ్యాగన్ 3,077 కార్లను విక్రయించి 49.8 శాతం వృద్ధిని సాధించింది. అలాగే, స్కోడా ఆటో కూడా గత నెలలో 3,065 కార్లను విక్రయించి 115.7 శాతం వృద్ధిని సాధించింది.

Most Read Articles

English summary
Car sales declined in october 2021 brand wise sales report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X