Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 15 hrs ago
భారత్లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనవరి 2021లో టాప్ 10 కార్ బ్రాండ్స్ ఇవే..
భారతదేశపు ఆటోమొబైల్ పరిశ్రమ పూర్వవైభవాన్ని తెచ్చుకుంటోంది. గత నెలలో వాహనాల అమ్మకాల పరంగా కొన్ని కార్ కంపెనీలు అద్భుతమైన ఫలితాలను నమోదు చేశాయి. అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే జనవరి 2021లో మొత్తం కార్ల అమ్మకాలు 17.7 శాతం వృద్ధి చెందాయి.

జనవరి 2021లో మొత్తం కార్ల విక్రయాలు 3,03,399 యూనిట్లుగా నమోదయ్యాయి. అక్టోబర్ 2020 నెల తర్వాత మొత్తం కార్ల అమ్మకాలు మూడు లక్షల మార్కును దాటడం ఇదే మొదటి సారి. ఆ సమయంలో మొత్తం అమ్మకాలు 3,33,659 యూనిట్లుగా నమోదయ్యాయి.

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ జనవరి 2021లో మొత్తం 1,39,002 యూనిట్లను విక్రయించి, టాప్-10 జాబితాలో తన అగ్రస్థానాన్ని అలానే నిలుపుకుంది. గత ఏడాది ఇదే సమయంలో (జనవరి 2020లో) కంపెనీ అమ్మకాలు 1,39,844 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మారుతి సుజుకి అమ్మకాలు 0.6 శాతం తగ్గి, మార్కెట్ వాటా 45.8 శాతానికి పడిపోయింది.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!

గత నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు 23 శాతం పెరిగాయి. జనవరి 2021లో కంపెనీ మొత్తం 52,005 యూనిట్లను విక్రయించింది. అంతకుముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 42,002 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది 16 శాతంగా ఉన్న కంపెనీ మార్కెట్ వాటా ఇప్పుడు 17 శాతానికి పెరిగింది. టాప్-10 జాబితాలో హ్యుందాయ్ 2వ స్థానంలో ఉంది.
Rank | Brand | Jan'21 | Jan'20 | Growth (%) |
1 | Maruti Suzuki | 1,39,002 | 1,39,844 | -0.6 |
2 | Hyundai | 52,005 | 42,002 | 23.8 |
3 | Tata | 26,980 | 13,893 | 94.2 |
4 | Mahindra | 20,498 | 19,555 | 4.8 |
5 | Kia | 19,056 | 15,450 | 23.3 |
6 | Honda | 11,320 | 5,299 | 113.6 |
7 | Toyota | 11,126 | 5,804 | 91.7 |
8 | Renault | 8,209 | 7,805 | 5.2 |
9 | Ford | 4,141 | 4,881 | -15.2 |
10 | Nissan | 4,021 | 1,413 | 184.6 |
11 | MG | 3,602 | 3,130 | 15.1 |
12 | Volkswagen | 2,041 | 1,102 | 85.2 |
13 | Skoda | 1,004 | 1,347 | -25.5 |
14 | FCA | 934 | 701 | -43.8 |

ఈ జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్. గడచిన జనవరి 2021లో టాటా మోటార్స్ మొత్తం 26,980 యూనిట్లను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య 13,893 యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 94 శాతం పెరిగాయి. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 5.3 శాతం నుండి 8.9 శాతానికి పెరిగింది.
MOST READ:న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

మహీంద్రా కంపెనీ గత జనవరి అమ్మకాల్లో టాప్ 10 కంపెనీల్లో 4వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సమయంలో కంపెనీ 20,498 వాహనాలను విక్రయించి 4.8 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది. జనవరి 2020లో కంపెనీ అమ్మకాలు 19,555 యూనిట్లుగా ఉన్నాయి.

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ దేశీయ మార్కెట్లో మూడు ఉత్పత్తులనే (సోనెట్, సెల్టోస్, కార్నివాల్) విక్రయిస్తున్నప్పటికీ, ఇది టాప్-10 జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో కియా మోటార్స్ మొత్తం 19,056 వాహనాలను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య 15,450 యూనిట్లుగా ఉంది.
MOST READ:రేసు గుర్రం వంటి కొత్త నిస్సాన్ పాత్‌ఫైండర్ టీజర్ వీడియో

గత నెలలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 11,320 కార్లను విక్రయించింది. జనవరి 2020లో వీటి సంఖ్య కేవలం 5,299 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు గరిష్టంగా 113 శాతం వృద్ధిని సాధించాయి. కంపెనీ ఇటీవలే తమ సివిక్, సిఆర్-వి మోడళ్లను మార్కెట్ నుండి తొలగించి వేసింది.

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా ఈ జాబితాలో 7వ స్థానాన్ని దక్కించుకుంది. జనవరి 2021లో టొయోటా మొత్తం 11,126 యూనిట్లను విక్రయించి 91 శాతం వృద్ధిని నమోదు చేసింది. జనవరి 2020లో కంపెనీ అమ్మకాలు 5,804 యూనిట్లుగా ఉన్నాయి.
MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గత నెలలో 8209 యూనిట్లను విక్రయించి 5.2 శాతం వృద్ధిని నమోదు చేయగా, అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ గత నెలలో 4,141 యూనిట్లను విక్రయించి 15.2 శాతం క్షీణతను నమోదు చేసింది.

ఈ జాబితాలో 10వ స్థానంలో ఉన్న నిస్సాన్ గత నెలలో 4,021 యూనిట్లను విక్రయించి 184.6 శాతం వృద్ధిని సాధించింది. ఈ కంపెనీ గడచిన డిసెంబర్ నెలలో మార్కెట్లో విడుదల చేసిన మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కంపెనీ అమ్మకాల పెరుగుదలకు చక్కగా సహాయపడింది.