మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

సాధారణంగా భారతదేశంలో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు వాటి ఫీచర్స్ మరియు మైలేజ్ అంటి విషయాలను మాత్రమే కాకుండా ధరను కూడా ఖచ్చితంగా గమనిస్తారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లను ఎక్కువమంది కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతారు.

ఎక్కువ ధర కలిగి ఉన్న కార్లను బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే కొనుగోలు చేస్తారు. కావున ఎక్కువ ధర కలిగిన కార్లకు సామాన్య ప్రజలనుంచి ఆదరణ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ కారణంగానే మార్కెట్లో ఆశించిన స్థాయిలో ఇవి అమ్ముడుపోవు. కావున తక్కువ ధర కలిగిన కార్ల అమ్మకాలతో పోలీస్తే వీటి అమ్మకాలు చాలా వెనుకబడి ఉంటాయి. ధర ఎక్కువ ఉన్న కారణంగా మార్కెట్లో వెనుకబడి ఉన్న కార్లను గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Honda Civic (హోండా సివిక్):

Honda కంపెనీ యొక్క Honda Civic (హోండా సివిక్) అత్యుత్తమ పర్పామెన్స్ సెడాన్ కారు. ఇది అంతర్జాతీయ మార్కెట్లలో బాగా ప్రాచుర్యం పొందింది, కానీ భారతదేశంలో అధిక ధర కారణంగా, ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోయింది. హోండా సివిక్ ఆకర్షణీయమైన లో ఫ్లోర్ డిజైన్ మరియు ఫ్యూచరిస్టిక్ ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Honda Civic 2005 నుండి భారతదేశంలో విక్రయించబడుతోంది. కంపెనీ తన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని 2019 లో భారతదేశంలో విడుదల చేసింది. అయితే, కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మారుతి, హ్యుందాయ్ మరియు టాటా నుండి సరసమైన కార్లతో పోటీ పడలేకపోయింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

అయితే చివరికి Honda కంపెనీ చివరకు 2020 డిసెంబర్‌లో గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తన సివిక్ ఉత్పత్తిని నిలిపివేసింది. హోండా సివిక్ ధర భారతదేశంలో రూ .19 లక్షల నుండి 24 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. ఈ ధర కారణంగానే ఇది దేశీయ మార్కెట్లో ఆశించిన అమ్మకాలను పొందలేకపోయింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Honda Jazz (హోండా జాజ్):

హోండా కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన అనేక మోడల్స్ లో ఒకటి హోండా జాజ్. ఇది 2000 సంవత్సరంలో, కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ప్రవేశించింది. హోండా జాజ్ ఈ రోజు భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 మరియు మారుతి ఎస్-క్రాస్‌లకు ప్రత్యర్థిగా ఉంది. ఈ కార్లతో పోలిస్తే హోండా జాజ్ అమ్మకాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

దేశీయ మార్కెట్లో హోండా జాజ్ ధర హ్యుందాయ్ ఐ20 కంటే ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా ఫీచర్ల పరంగా ఐ20 కంటే వెనుకబడి ఉంది. హోండా జాజ్ ఆశించిన స్థాయిలో అమ్మకాలను పొందకపోవడానికి ఇదే ప్రధాన కారణం.హోండా జాజ్ యొక్క ధర ఇతర ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Honda Accord (హోండా అకార్డ్):

హోండా సివిక్ మాదిరిగా, హోండా అకార్డ్ కూడా 2000 సంవత్సరంలో భారతీయ మార్కెట్లోకి వచ్చిన మొదటి లగ్జరీ కార్లలో ఒకటి. ఇది కొన్ని ఫస్ట్-క్లాస్ లగ్జరీ ఫీచర్లను అందించింది, అంతే కాకుండా ఇది దాని ప్రత్యర్థుల కంటే కూడా తక్కువ ధరను కలిగి ఉంది. హోండా అకార్డ్ మార్కెట్లో ప్రసిద్ధి చెందడానికి కారణం కారు పెద్ద సైజు మాత్రమే కాదు, దాని 3.2-లీటర్ వి 6 ఇంజిన్ కూడా చాలా శక్తివంతమైనది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

హోండా 2016 లో అకార్డ్ యొక్క హైబ్రిడ్ వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది, అయితే దీనిని సిబియు మార్గం ద్వారా భారతదేశానికి తీసుకువస్తున్నారు. దీని కారణంగా ఈ విభాగంలో ఉన్న ప్రత్యర్థి కార్ల కంటే దీని ధర చాలా ఎక్కువగా మారింది. ఈ కారణంగా ఇది ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోయింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Toyota Yaris (టయోటా యారిస్):

ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'టయోటా' ఇటీవల భారతదేశంలో యారిస్ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేసింది. దీనితో సెడాన్ ఇప్పుడు భారతదేశంలో కంపెనీ లైనప్ నుండి తొలగించబడింది.

హోండా సిటీ మరియు హ్యుందాయ్ వెర్నా వంటి కార్లు భారతదేశంలో టయోటా యారిస్ కంటే తక్కువ ధరలో లభిస్తూ ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగానే టయోటా యారీస్ ముందుకు సాగలేకపోయింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Nissan Kicks (నిస్సాన్ కిక్స్):

జపనీస్ కార్ల తయారీ సంస్థ అయిన నిస్సాన్ యొక్క మోడల్స్ లో ఒకటి ఈ నిస్సాన్ కిక్స్. ఇది కంపెనీ యొక్క అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. కొత్త ఫీచర్లు మరియు డిజైన్ అప్‌డేట్‌లతో కంపెనీ కిక్స్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను 2019 లో విడుదల చేసింది.

ఈ కారు మంచి సేఫ్టీ ఫీచర్స్ మరియు మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది. అయితే ఇతర కార్లకంటే కూడా దీని దార ఎక్కువ కావడం వల్ల ఇది మార్కెట్లో ఆశించిన అమ్మకాలను సాగించలేకపోయింది. కంపెనీ నిస్సాన్ కిక్స్ SUV ని టర్బో పెట్రోల్ ఇంజిన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికి కూడా ఇది ప్రజాదరణ పొందలేకపోయింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

Maruti Suzuki Kizashi (మారుతి సుజుకి కిజాషి):

మారుతి సుజుకి కిజాషి అనేది మారుతి సుజుకి యొక్క మోడల్. ఈ మోడల్ దేశీయ మార్కెట్లో ప్రజాదరణ పొందలేక పోయింది. మారుతి సుజుకి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కార్ బ్రాండ్ అయినప్పటికీ ఈ కిజాషి విషయంలో మాత్రం విజయం సాదించలేకపోయింది.

మీకు తెలుసా.. ధర కారణంగానే భారత్‌లో వెనుకబడిన కార్లు.. ఇవే

మారుతి సుజుకి కిజాషి భారతదేశానికి కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా తీసుకురావాల్సి వుంది, కావున దీని ధర ఎక్కువవయ్యింది. మారుతి సుజుకి కిజాషి మార్కెట్లో హ్యుందాయ్ ఎలంట్రా, టయోటా కరోలా మరియు హోండా సివిక్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. ఈ కార్లకంటే కూడా ఇది ఎక్కువ ధర కలిగి ఉన్న కారణంగా ఇది కూడా అమ్మకాల్లో వెనుకపడి క్రమంగా వెనుకబడిపోయింది.

Most Read Articles

English summary
Cars failed in india due to high prices honda civic jazz toyota yaris and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X