భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

భారతదేశంలో కొనుగోలుదారులు ఇప్పుడు సరసమైన కార్ల కంటే కూడా సురక్షితమైన కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒకప్పుడు కారు కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధరను మాత్రమే పరిగణలోకి తీసుకున్న కస్టమర్లు, ఇప్పుడు సదరు కారు యొక్క సేఫ్టీ విషయంలో కూడా లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో కార్ల తయారీదారులు కూడా కొనుగోలుదారుల మనసు దోచేందుకు సురక్షితమైన కార్లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, మనదేశంలో ఇప్పటికీ కొన్ని అసురిక్షతమైన కార్లు ఉన్నాయి, సేఫ్టీ విషయంలో ఇవి జీరో స్టార్ రేటింగ్ లను పొందాయి.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

భారతదేశంలో తయారైన మరియు విక్రయించబడే కార్లను వివిధ గ్లోబల్ టెస్టింగ్ ఏజెన్సీలు విస్తృతంగా పరీక్షిస్తున్నాయి. ఈ పరీక్షలలో చాలా కార్లు ఐదు స్టార్లకు గానూ మూడు నుండి ఐదు స్టార్లు గెలుచుకుంటుంటే, కొన్ని కార్లు మాత్రం పూర్తిగా సున్న స్టార్ ను దక్కించుకొని, ప్రయాణీకుల భద్రతను సవాల్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ మరియు మహీంద్రా సంస్థలు తయారు చేస్తున్న వాహనాలను క్రాష్ పరీక్షలలో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నాయి.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్, టాటా పంచ్, మహీంద్రా థార్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 వంటి కార్ మోడళ్లను 4 నుండి 5 స్టార్ల మధ్యలో సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకొని దేశంలో కెల్లా అత్యంత సురక్షితమైన కార్లుగా నిలిచాయి. ఈ ఫలితాలను లాటిన్ NCAP ఏజెన్సీ క్రాష్ టెస్ట్ ద్వారా నిర్ధారించింది. అయితే, దేశంలో కెల్లా అత్యధికంగా సంఖ్యలో వాహనాలు విక్రయించి హీరో అనిపించుకుంటున్న మారుతి సుజుకి కార్లు మాత్రం సేఫ్టీ విషయంలో జీరో అనిపించుకుంటున్నాయి. మరి ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న 'జీరో స్టార్' రేటింగ్ పొందిన కార్లు ఏంటో తెలుసుకుందాం రండి.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

1. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)

భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 చిన్న కార్లలో అగ్రస్థానంలో ఉండే మారుతి సుజుకి స్విఫ్ట్, సేఫ్టీలో మాత్రం అందరికన్నా వెనుకబడి ఉంది. ఈ కారు కోసం ఇటీవల లాటిన్ ఎన్‌క్యాప్ (Latin NCAP) క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ 'సున్నా స్టార్ రేటింగ్' ను పొందింది. స్విఫ్ట్ కారును ప్రతినెలా సగటున 10,000 మంది కస్టమర్లు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మూడవ తరానికి చెందిన మోడల్. కంపెనీ దీనిని హార్టెక్ ప్లాట్‌ఫామ్ పై తయారు చేసింది.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

స్విఫ్ట్ కారు కోసం లాటిన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన స్విఫ్ట్ వయోజన భద్రత విషయంలో 15.53 శాతం మరియు పిల్లల భద్రత విషయంలో సున్నాగా రేట్ చేయబడింది. అదే సమయంలో, ఇది పాదచారులకు సంబంధించిన భద్రత విషయంలో 66 శాతం మరియు ఇతర భద్రతా లక్షణాల విషయంలో 7 శాతం రేటింగ్ ను పొందింది. లాటిన్ ఎన్‌క్యాప్ నివేదికలో, ఈ కారు యొక్క పేలవమైన సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ మరియు పరీక్ష సమయంలో పేలవమైన డోర్ పనితీరు కోసం గాను Swift కి జీరో స్టార్ రేటింగ్ ఇవ్వబడింది.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

2. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)

మారుతి సుజుకి విక్రయిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో, స్విఫ్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే ఈ చిన్న కారును తయారు చేశారు. ఇది కూడా సేఫ్టీలో సున్నా రేటింగ్ ను దక్కించుకుంది. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఈ సెగ్మెంట్‌లో టాటా అల్ట్రోజ్ మరియు హ్యుందాయ్ ఐ20 వంటి కార్లతో డుతోంది. బాలెనో కోసం లాటిన్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో ఇది 0 (సున్నా) స్టార్ ప్రొటెక్షన్ రేటింగ్‌ను అందుకుంది.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

ఈ క్రాష్ టెస్టులో మారుతి సుజుకి బాలెనో పెద్దల రక్షణలో 20.03 శాతం, పిల్లల రక్షణలో 17.06 శాతం, పాదచారుల రక్షణలో 64.06 శాతం మరియు భద్రతా సహాయంలో 6.98 శాతం స్కోరును పొందింది. ఓవరాల్ గా లాటిన్ NCAP క్రాష్ టెస్టులో ఈ కారు 0-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ ను పొందిందని ఒక ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇది స్విఫ్ట్ కంటే గణనీయంగా ఎక్కువ పాయింట్లను కలిగి ఉంది.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

3. రెనాల్ట్ డస్టర్ (Renault Duster)

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో భారతదేశంలో విక్రయిస్తున్న తమ సెకండ్ జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీ కూడా సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ పొందింది. మొదటి తరం డస్టర్ ఎస్‌యూవీని తొలిసారిగా 2012 లో భారత దేశంలో విడుదల చేశారు. ఆ తర్వాత ఇందులో రెండవ తరం మోడల్ ని 2019 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. అయితే, లాటిన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో ఈ సెకండ్ జనరేషన్ రెనో డస్టర్ ఎస్‌యూవీ సున్నా సేఫ్టీ రేటింగ్ ను పొందింది. ఈ క్రాష్ పరీక్షలో ఎస్‌యూవీ పూర్తిగా విఫలమైంది.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

రెనో డస్టర్ కోసం లాటిన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్ లో ఈ ఎస్‌యూవీ వయోజన భద్రత కోసం 29.47 శాతం, పిల్లల రక్షణ కోసం 22.93 శాతం, పాదచారుల భద్రత కోసం 50.79 శాతం మరియు ప్రమాదకర రోడ్డు వినియోగదారుల రక్షణ కోసం మరియు సేఫ్టీ అసిస్ట్ బాక్స్‌ లో భద్రత కోసం 34.88 శాతం స్కోర్ సాధించింది. ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా లభిస్తాయి.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

4. హ్యుందాయ్ టక్సన్ (Hyundai Tucson)

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న 2021 మోడల్ 'టక్సన్' ఎస్‌యూవీ కూడా జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ ని కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీ కోసం 2021 లాటిన్ ఎన్‌క్యాప్ (Latin NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో ఇది 0-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుంది. హ్యుందాయ్ నుండి అత్యంత ప్రసిద్ధి చెందిన కార్ మోడళ్లలో టక్సన్ ఎస్‌యూవీ కూడా ఒకటి. భారత మార్కెట్లో ఇది అత్యంత ఖరీదైన హ్యుందాయ్ ఎస్‌యూవీగా ఉంది.

భారతదేశంలో జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు: మారుతి స్విఫ్ట్, మారుతి బాలెనో, రెనో డస్టర్..

టక్సన్ ఎస్‌యూవీ యొక్క భద్రతా సామర్థ్యాల గురించి తెలుసుకోవడానికి లాటిన్ ఎన్‌క్యాప్ ఈ కారును ఘర్షణ పరీక్ష (క్రాష్ టెస్ట్)కు గురి చేసింది. ఈ అధ్యయనంలో హ్యుందాయ్ టక్సన్ ప్రయాణీకుల సేఫ్టీలో పూర్తిగా విఫలమైనట్లు తేలింది. హ్యుందాయ్ నుండి అత్యంత ఖరీదైన మరియు పాపులర్ అయిన ఈ కారు జీరో స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడం అందరినీ షాక్‌కు గురిచేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే టక్సన్ ఎస్‌యూవీలో కొత్త తరం మోడల్ కోసం యూరో ఎన్‌క్యాప్ (Euro NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టులో దీనికి 5-స్టార్ (ఫైవ్ స్టార్) సేఫ్టీ రేటింగ్ లభించింది. కాకపోతే, ఈ కొత్త తరం మోడల్ మార్కెట్లోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Cars in india with zero star safety rating swift baleno duster tucson
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X