Just In
- 3 hrs ago
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- 6 hrs ago
విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!
- 7 hrs ago
ఆనంద్ మహీంద్రా నుండి థార్‌ను గిఫ్ట్‌గా పొందిన క్రికెటర్ శుబ్‌మన్ గిల్
- 8 hrs ago
కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ఫేస్‌లిఫ్ట్ వెల్లడి: ఫీచర్లు, స్పెసికేషన్లు మరియు వివరాలు
Don't Miss
- Movies
శంకర్ 'ఇండియన్ 2' రెమ్యునరేషన్ గొడవ.. ఇచ్చింది ఎంత? ఇవ్వాల్సింది ఎంత?
- News
మోదీ ఎన్నికల సభ రద్దు వట్టిదే -వర్చువల్ ప్లాన్ -బెంగాల్లో రోడ్ షోలు, బైక్ ర్యాలీల నిషేధించిన ఈసీ
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Lifestyle
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు
భారతీయ ఆటో పరిశ్రమలో 2021 మార్చి నెలలో కొన్ని కొత్త వాహనాలు విడుదలయ్యాయి. ఈ నెలలో విడుదలైన వాహనాల జాబితాలో కొత్త రెనాల్ట్ ట్రైబర్, మేడ్ ఇన్ ఇండియా జీప్ రాంగ్లర్, మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్, టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి, న్యూ బెంట్లీ బెంటాయగా వంటివి ఉన్నాయి. ఈ కొత్త వాహనాల గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

రెనాల్ట్ ట్రైబర్:
భారతమార్కెట్లో కొత్త రెనాల్ట్ ట్రైబర్ విడుదలైంది. దీని ధర రూ. 5.30 లక్షలు. కొత్త రెనాల్ట్ బుకింగ్స్ 2021 మార్చి 9 నుండి ప్రారంభమయ్యాయి. కంపెనీ ఈ కొత్త ట్రైబర్ ని మంచి డైజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్ తో విడుదల చేసింది.

ఇది మొదట 2019 ఆగస్టులో ప్రవేశపెట్టబడింది. రెనాల్ట్ ట్రైబర్ అనేది కంపెనీ యొక్క ముఖ్యమైన ఉత్పత్తులలో ఒకటిగా నిలిచింది. కంపెనీ విడుదల చేసిన ఈ కాంపాక్ట్ ఎంపివికి మార్కెట్లో మంచి ఆదరణ లభించింది.
MOST READ:ఒకేరోజు 10 సఫారీ ఎస్‌యూవీలను డెలివరీ చేసిన టాటా మోటార్స్; వివరాలు

మేడ్ ఇన్ ఇండియా జీప్ రాంగ్లర్ :
మేడ్ ఇన్ ఇండియా జీప్ రాంగ్లర్ భారతదేశంలో రూ .53.90 లక్షల ధరతో ప్రారంభించబడింది. మేడ్ ఇన్ ఇండియా జీప్ రాంగ్లర్ డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ కొత్త రాంగ్లర్ అన్లిమిటెడ్ మరియు రుబికాన్ అనే రెండు ట్రిమ్లలో తీసుకురాబడింది. అంతే కాకుండా ఇందులో పెట్రోల్ మరియు డీజిల్ ఆప్సన్స్ రెండూ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ :
మెర్సిడెస్ బెంజ్ యొక్క ఎ-క్లాస్ లిమోసిన్ ఎట్టకేలకు భారతమార్కెట్లో అడుగుపెట్టింది. దీని ధర రూ. 39.90 లక్షలు. మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంది. ఇది ఏరోడైనమిక్ డిజైన్, లగ్జరీ ఫీచర్స్ మరియు మలిఫుల్ డ్రైవ్ మోడ్ ఆప్సన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్ పెట్రోల్ మోడల్ ధర రూ .39.90 లక్షలు కాగా, డీజిల్ మోడల్ ధర రూ. 40,90 లక్షల వరకు ఉంది, ఇందులో ఎఎమ్‌జి ఎ 35 4 మ్యాటిక్ మోడల్ ధర రూ .56.24 లక్షలు. ఈ లగ్జరీ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పాటు మంచి లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంది.

న్యూ బెంట్లీ బెంటాయిగా:
కొత్త బెంట్లీ బెంటాయిగాను కూడా ఏ నెలలో భారత మార్కెట్లో అరంగేట్రం చేసింది. దీని ధర అక్షరాలా రూ. 4.10 కోట్లు. ఈ కొత్త బెంట్లీ బెంటాయగా బుకింగ్స్ ఢిల్లీ, ముంబై మరియు హైదరాబాద్ నగరాల్లో ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు దీని డిజైన్ లో కొన్ని అప్డేట్స్ చేయడం జరిగింది. కానీ ఇంజిన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
MOST READ:రెప్పపాటు కాలంలో తప్పించుకున్న స్కూటరిస్ట్.. లేకుంటే ఏమయ్యేదో?

టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి :
టాటా మోటార్స్ టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టిని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ. 5.99 లక్షలు. టాటా టియాగో ఎక్స్‌టిఎ ఎఎమ్‌టి ఈ మోడల్‌లో నాల్గవ ఎఎమ్‌టి ఆప్సన్, కాబట్టి ఇది కొత్త కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించడంలో ప్రధాన పాత్ర వహించగలదు. ఈ కొత్త వేరియంట్ ఇప్పుడు టియాగో యొక్క చౌకైన ఆటోమేటిక్ వేరియంట్‌గా మారింది. దానికి ముందు టాటా టియాగో ఎక్స్‌జెడ్ఎ చౌకైన ఆటోమేటిక్ వేరియంట్. ఈ వేరియంట్ ధర రూ. 6.46 లక్షలు.