పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. నేటి (అక్టోబర్, 4, 2021వ తేదీ) నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని వరుసగా రూ. 5 మరియు రూ. 10 మేర తగ్గిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం దీనిని ప్రజలకు అందిస్తున్న దీపావళి కానుకగా అభివర్ణిస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

అయితే, దేశ ప్రజలు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం సంతృప్తిగా లేరు. పెంచింది బారెడు, తగ్గించింది మాత్రం మూరెడు అంటూ విమర్శలు చేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తే మాత్రమే సరిపోదని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ (వ్యాల్యూ యాడెడ్ టాక్స్) ను తగ్గించాలని కోరుతున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

నవంబర్ 4, 2021 నుండి పెట్రోల్ , డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రికార్డు స్థాయిలో తగ్గిస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ డ్యూటీలో పెద్ద సడలింపు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రెండు ఇంధనాల ధరల నుండి రిటైల్ కస్టమర్లకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుందని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన విధానాన్ని గమనిస్తే, ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకూ లీటరు పెట్రోల్ ధరపై రూ. 23 మేర పెరగగా, డీజిల్ ధర రూ. 24.55 మేర పెరిగింది. గత కొన్ని నెలలుగా అయితే, ఈ రెండు ఇంధనాల ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోయాయి. ఇంధన ధరలలో నిరంతర పెరుగుదల కారణంగా వాహనాల అమ్మకాలు కూడా ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయి.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

వాహనాల అమ్మకాలు దెబ్బతినడంతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు మరియు పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి కూడా గండి పడింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పండుగ సీజన్ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ఇంధనాల ధరలను తగ్గించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ ధరలపై వ్యాట్ ను తగ్గించడం ద్వారా, ఈ పండుగ సీజన్‌లో సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

నిజానికి, పెట్రోల్ ధరల నియంత్రణ ప్రస్తుతం చమురు కంపెనీల చేతిలోనే ఉంది. కేంద్రం ఈ విషయంలో ఎప్పుడో చేతులు ఎత్తేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు లేదా తగ్గింపుపై నిర్ణయం మీదేనని చమురు కంపెనీలకు అప్పజెప్పింది. అప్పటి నుండి దేశంలో ఇంధన ధరలు రాకెట్ లా దూసుకుపోయాయి. అయితే, ఇప్పుడు హఠాత్తుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కొంతకాలంగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 117 దాటిపోయింది. ఈ పరిస్థితులో కేంద్రం తగ్గిస్తున్న రూ. 5 ధర కేవలం నామ మాత్రమే అనొచ్చు. అందుకే, ప్రజలు ఈ విషయంలో పెంచిందేమో బారెడు, తగ్గించేదేమో మూరెడు అంటూ విమర్శిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

నరేంద్ర మోదీ ప్రభుత్వం డీజిల్‌ ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం, రైతులు రబీ పంటను సాగు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, డీజిల్ ధరను తగ్గించడం కారణంగా అన్ని వస్తువుల రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ఇది సాధారణ వినియోగదారులకు కూడా కొంత మేర ఉపశమనాన్ని కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని నెలలుగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో, దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే, ఇటీవల ఈ ధరలు దిగిరావడంతో, దేశంలో కూడా ధరలను తగ్గించేందుకు సిద్ధమయ్యారు. ఈ ధర తగ్గింపుతో పాటు ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, సరఫరా సజావుగా సాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 110.04 నుండి రూ. 105.04 కి తగ్గింది. అదే సమయంలో లీటరు డీజిల్ ధర రూ. 98.42 నుండి రూ. 88.42 కి తగ్గింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ. 32.90 మరియు లీటరు డీజిల్‌పై రూ. 31.80 ఎక్సైజ్ సుంకం విధిస్తోంది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత లీటరు పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 27.90 కి మరియు లీటరు డీజిల్‌పై రూ. 21.80 కి తగ్గింది.

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు: పెంచిందేమో బారెడు.. తగ్గించిందేమో మూరెడు..

ఇంధనాలపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని రికార్డు స్థాయిలో తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పుడు అదే నిష్పత్తిలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గాయి. చమురు పరిశ్రమకు సంబంధించిన మూలాల ప్రకారం, ఏప్రిల్-అక్టోబర్ 2021లో వినియోగం ఆధారంగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల భారత ప్రభుత్వం ప్రతి నెలా రూ. 8,700 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ గణాంకాల ఆధారంగా, ఈ ఏడాదిలో ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల రూపాయాల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Central government reduces excise duty on petrol and diesel by rs 5 and rs 10
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X