భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న ప్రధాన సమస్య సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత. ఈ చిప్స్ కొరత కారణంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కుంటున్నాయి. తాజాగా, భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ Maruti Suzuki కూడా ఈ చిప్స్ కొరత కారణంగా తమ వాహనాల ఉత్పత్తిని తగ్గించనుంది.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత కొరత కారణంగా Maruti Suzuki (మారుతి సుజుకి) ఇప్పటికే గడచిన ఆగస్ట్ 2021 నెలలో తీవ్ర ఉత్పత్తి అంతరాయాన్ని ఎదుర్కొనగా, ఇప్పుడు సెప్టెంబర్ నెలలో కూడా అదే పరిస్థితి ఏర్పడనుంది. ఈ చిప్స్ లభ్యత తక్కువగా ఉన్నందున సెప్టెంబర్ నెలలో హర్యానా మరియు గుజరాత్ రాష్ట్రాల్లోని కంపెనీ ప్లాంట్లలో ఉత్పత్తి భారీగా తగ్గుతుందని పేర్కొంది.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

ఈ రెండు ప్లాంట్లలో సెప్టెంబర్ నెలలో కార్ల ఉత్పత్తి సాధారణ ఉత్పత్తి స్థాయి కంటే సుమారు 60 శాతం వరకూ తక్కువగా ఉండవచ్చని కంపెనీ అంచనా వేసింది. భారతదేశంలో కేవలం Maruti Suzuki నే కాకుండా, Tata Motors, Mahindra, Toyota వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ సెమీకండక్టర్ చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని కారణంగా కొత్త వాహనాల వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

కరోనా మహమ్మారి కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలు మరియు గ్లోబల్ సెమీకండక్టర్ కొరత గురించి Tata Motors మరియు Mahindra and Mahindra ఇప్పటికే పరిశ్రమను హెచ్చరించాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో చిప్ కొరత మునుపటి కంటే తీవ్రంగా ఉంటుందని Tata Motors తెలిపింది, దీని కారణంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల అమ్మకాలు 50 శాతం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

అయితే, ఈ సెమీకండక్టర్‌ల విషయంలో Maruti Suzuki ఒకే విక్రేతపై ఆధారపడనందున, కంపెనీ ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం ఉండబోదని నిపుణులు భావిస్తున్నారు. కానీ, కంపెనీ ఛైర్మన్ ఆర్‌సి భార్గవ మాత్రం సెమీకండక్టర్ సంక్షోభం ఇప్పట్లో ముగియదని మరియు తరువాత ఏమి జరుగుతుందో అంచనా వేయడం కష్టమని సూచించారు.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

సెమీకండక్టర్ చిప్స్ ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా ముఖ్యమైన భాగంగా మారాయి మరియు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా వాహనాలలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. కొత్త వాహనాలు అధునాతన టెక్నాలజీతో వస్తున్న నేపథ్యంలో, వాటిలో అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉంటున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్‌లు మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్‌లు మొదలైన వాటికి ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ఎంతో అవసరం.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

కాబట్టి, ఈ సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారు తయారీలో అవసరమైన ఇలాంటి ముఖ్యమైన భాగాలను తయారు చేయలేరు మరియు వాటిని అమర్చలేరు. ఫలితంగా, కార్ల ఉత్పత్తి కూడా అసాధ్యంగా మారుతుంది. ఈ సమస్య వలన Maruti Suzuki మరికొంత కాలం పాటు తమ వాహనాల ఉత్పత్తిలో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

చిప్ కొరతతో ఆటోమొబైల్ రంగం ప్రభావితమైంది

Maruti Suzuki తో పాటుగా MG Motor, Nissan, Tata Motors మరియు Mahindra సహా అనేక ఇతర కార్ల తయారీదారులు కూడా ఈ చిప్ కొరతను ఎదుర్కుంటున్నారు. ఈ చిప్స్ కోసం కేవలం ఒకే వెండర్‌పై ఆధారపడకుండా, వాటిని బహుళ విక్రేతల నుండి కొనుగోలు చేయడం సహా ప్రపంచ సెమీకండక్టర్ కొరతను ఎదుర్కోవడానికి వివిధ చర్యలను ప్లాన్ చేసినట్లు Tata Motors ఇటీవల తెలియజేసింది.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

ఈ చిప్స్ కొరతను అధిగమించడానికి, కంపెనీలు తమ ఉత్పత్తులను సవరించడంతో పాటు, సెమీకండక్టర్ తయారీదారుల నుండి నేరుగా చిప్‌లను కొనుగోలు చేసే పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఇది కాకుండా, కంపెనీలు చిప్‌ను మార్చడం ద్వారా లేదా ఇతర చిప్‌లను ఉపయోగించడం ద్వారా చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో సరఫరా పరిస్థితి సవాలుగా ఉంటుందని Maruti Suzuki తెలిపింది.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

జులైలో 36 శాతం పెరిగిన Maruti Suzuki సేల్స్

జూలై 2021 నెల అమ్మకాలలో Maruti Suzuki మెరుగైన పనితీరును కనబరిచింది. గత నెలలో, కంపెనీ దేశీయ అమ్మకాలు 36 శాతం వృద్ధి చెందగా, ఎగుమతులలో 7 శాతం పెరిగాయి. మినీ కార్ విభాగంలో 19,685, కాంపాక్ట్ కార్ విభాగంలో 70,268 మరియు యుటిలిటీ వాహన విభాగంలో 32,272 యూనిట్లను కంపెనీ విక్రయించింది. జూలై 2021 లో Maruti మొత్తం 1,62,462 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది జూలై 2020 లో ఇవి 1,08,064 యూనిట్లుగా ఉన్నాయి.

భారీగా పెరగనున్న Maruti Suzuki కార్ల వెయిటింగ్ పీరియడ్; కారణం ఏంటంటే?

సెప్టెంబర్ నెలలో పెరగనున్న Maruti Suzuki కార్ల ధరలు

ఈ పరిస్థితులు ఇలా ఉంటే, Maruti Suzuki మరొక బాంబ్ పేల్చింది. సెప్టెంబర్ నెల నుండి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది Maruti Suzuki ఇప్పటికే మూడుసార్లు తమ కార్ల ధరలను పెంచగా, ఇప్పుడు వరుసగా నాల్గవసారి సెప్టెంబర్ 2021 నెలలో కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. అయితే, ఏయే మోడల్ ధరలు ఎంత మేర పెంచుతామనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Most Read Articles

English summary
Chip shortage maruti suzuki production may fall by 60 percent in september
Story first published: Wednesday, September 1, 2021, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X