Just In
- 1 hr ago కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 17 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 18 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భారత్‌లో ఒక్కసారిగా రూ. 1 లక్ష పెరిగిన Citroen C5 Aircross ధర: పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఇప్పటికే చాలామంది కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలు పెంచారు. ఇందులో భాగంగానే ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) కూడా తన బ్రాండ్ అయిన సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ (Citroen C5 Aircross) ధరను పెంచినట్లు తెలిపింది. కంపెనీ యొక్క భారతీయ పోర్ట్‌ఫోలియోలో ఉన్న ఏకైక సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్.
దేశీయ మార్కెట్లో ఈ సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ 'ఫీల్ మరియు షైన్' అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఈ SUV ధర ఇప్పుడు రూ. 1 లక్ష వరకు పెరిగింది.
కంపెనీ భారతీయ మార్కెట్లో తన Citroen C5 Aircross యొక్క బేస్-వేరియంట్ మోనోటోన్ మరియు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.
ఇక కంపెనీ యొక్క టాప్-స్పెక్ షైన్ మోనోటోన్ మరియు డ్యూయల్-టోన్ వేరియంట్ల ధరలు రూ. 50,000 వరకు పెరిగింది. కావున ఈ ధర పెరుగుదల తర్వాత, ఇప్పుడు కొత్త సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ షైన్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 32.80 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Citroen C5 Aircross సంస్థ యొక్క పిఎస్ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. Citroen C5 Aircross క్రాస్ఓవర్ డిజైన్‌ను కలిగి ఉండేలా రూపొందించబడింది. ఇందులో డ్యూయల్ బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ట్విన్ స్లాట్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, స్ప్లిట్ టెయిల్ లాంప్ కలిగి ఉంటుంది.
Citroen C5 Aircross యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.
ఈ C5 Aircross లో పనోరమిక్ సన్‌రూఫ్, స్ప్లిట్ ఎసి వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, మూడ్ లైటింగ్, ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్, 3 పర్సనల్, రిక్లైనింగ్, అడ్జస్టబుల్ అండ్ మాడ్యులర్ రియర్ సీట్లు ఇవ్వబడ్డాయి. బూట్ స్పేస్ మరింత అవసరమైనప్పుడు వాటిని ఫోల్డ్ చేయవచ్చు.
C5 Aircross యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, బ్లైండ్స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్ కెమెరా, 5 మోడ్ ఆప్షన్లతో గ్రిప్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ దీనికి అనేక యాక్ససరీస్ ఆప్సన్స్ కూడా అందుబాటలోకి తీసుకురానుంది.
Citroen C5 Aircross లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 174 బిహెచ్పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 18.60 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Citroen C5 Aircross (సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్) చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా వరకు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమందిని ఆకర్శించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఈ ఎస్‌యూవీని నాలుగు మోనో టోన్, మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచారు. సిట్రోయెన్ తన మొదటి కారుని లాంచ్ చేయడానికి ముందే దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు గురుగ్రామ్‌లలో వంటి ప్రాంతాలలో 10 షోరూమ్‌లను ఓపెన్ చేసింది. మొత్తానికి ధరల పెరుగుదల తరువాత అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా.. లేదా అనే విషయం త్వరలో తెలుస్తుంది.కావున అప్పటివరకు వేచి ఉండక తప్పదు.