2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా వాహనాల ధరలు ఇప్పుడు రానున్న కొత్త సంవత్సరం 2022 జనవరి నుంచి మరింత ఎక్కువవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ (Citroen) కూడా తన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ (Citroen C5 Aircross) ధరను పెంచనున్నట్లు తెలిపింది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం జనవరి నుంచి ఈ కొత్త సి5 ఎయిర్‌క్రాస్ ధర మునుపటికంటే 3 శాతం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్లో కార్ల తయారీకి కావాల్సిన ముడిసరుకులు మరియు ఇతరత్రా పరికరాల ధరలు పెరగటం వల్ల, ఈ కారు ధర పెరుగుదలకు గురైంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

సిట్రోయెన్ కంపెనీ తన సి5 ఎయిర్‌క్రాస్ ధరను పెంచడం ఇదే మొదటి సారి కాదు, మొదట ఈ ఏడాది నవంబర్‌లో కంపెనీ తన కారు ధరను రూ. 1 లక్ష పెంచింది. తరువాత కూడా కంపెనీ రూ. 1.40 లక్షలు పెంచింది. ఇప్పుడు ముచ్చటగా మూడవ సారి ధరల పెరుగుదల జరుగుతోంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

Citroen C5 Aircross భారతదేశంలో 2021 ఏప్రిల్ 07 న ప్రారంభించబడింది. ప్రస్తుతం సి5 ఎయిర్‌క్రాస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి ఫీల్ వేరియంట్ కాగా, మరొకటి షైన్ వేరియంట్. ఇందులో ఫీల్ వేరియంట్ ధర రూ. 31.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, షైన్ వేరియంట్ ధర రూ. 32.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కంపెనీ యొక్క ప్రీమియం SUV, ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

Citroen C5 Aircross సంస్థ యొక్క పిఎస్‌ఎ ఇఎమ్‌పి 2 ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది. Citroen C5 Aircross క్రాస్ఓవర్ డిజైన్‌ను కలిగి ఉండేలా రూపొందించబడింది. ఇందులో డ్యూయల్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, ట్విన్ స్లాట్ స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ఫాగ్ లాంప్స్, స్ప్లిట్ టెయిల్ లాంప్‌ కలిగి ఉంటుంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

Citroen C5 Aircross యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో ఫుట్ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, ఇంజిన్ స్టాప్-స్టార్ట్ ఫంక్షన్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఫోన్ మిర్రరింగ్ ఫంక్షన్‌తో 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి ఉన్నాయి.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

ఈ C5 Aircross లో పనోరమిక్ సన్‌రూఫ్, స్ప్లిట్ ఎసి వెంట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, మూడ్ లైటింగ్, ఎకౌస్టిక్ విండ్‌స్క్రీన్, ఫ్రంట్ విండో గ్లాసెస్, 3 పర్సనల్, రిక్లైనింగ్, అడ్జస్టబుల్ అండ్ మాడ్యులర్ రియర్ సీట్లు ఇవ్వబడ్డాయి. బూట్ స్పేస్ మరింత అవసరమైనప్పుడు వాటిని ఫోల్డ్ చేయవచ్చు.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

C5 Aircross యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ విత్ ఇబిడి, బ్లైండ్‌స్పాట్ మానిటరింగ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రివర్స్ కెమెరా, 5 మోడ్ ఆప్షన్లతో గ్రిప్ కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా కంపెనీ దీనికి అనేక యాక్ససరీస్ ఆప్సన్స్ కూడా అందుబాటలోకి తీసుకురానుంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

Citroen C5 Aircross లో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ 174 బిహెచ్‌పి పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 18.60 కి.మీ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న Citroen C5 Aircross (సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్) చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది చాలా వరకు అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమందిని ఆకర్శించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

ఈ ఎస్‌యూవీని నాలుగు మోనో టోన్, మూడు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంచారు. సిట్రోయెన్ తన మొదటి కారుని లాంచ్ చేయడానికి ముందే దేశవ్యాప్తంగా అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, కొచ్చిన్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు గురుగ్రామ్‌లలో వంటి ప్రాంతాలలో 10 షోరూమ్‌లను ఓపెన్ చేసింది. మొత్తానికి ధరల పెరుగుదల తరువాత అమ్మకాలపైన ప్రభావం చూపుతుందా.. లేదా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

2022 లో మరో సారి పెరగనున్న Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర.. ఈ సారి ఎంతంటే?

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ SUV భారతీయ మార్కెట్లో జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. త్వరలో కంపెనీ తన రెండవ మోడల్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇది సబ్‌కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ విభాగంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్‌ వాటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 8, 2021, 9:40 [IST]
English summary
Citroen c5 aircross suv price hike upto 3 percent from january 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+