మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Tata Nexon EV ను కంపెనీ త్వరలోనే అప్‌డేట్ చేయనుంది. తాజాగా ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి ఓ ఇటీవల ఢిల్లీ RTO పత్రం బయటకు వచ్చింది, ఇందులో ఈ కారు గురించి కొత్త సమాచారం వెల్లడైంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

ఈ పత్రం ప్రకారం, కంపెనీ తమ Nexon EV లో మరింత శక్తివంతమైన వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న Tata Nexon EV గరిష్టంగా 129 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే, కొత్తగా రానున్న మరింత శక్తివంతమైన వెర్షన్ దీని కంటే అదనంగా 7 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని సమాచారం.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

ఒకవేళ ఇదే గనుక జరిగితే కొత్త అప్‌డేటెడ్ Tata Nexon EV పవర్ అవుట్‌పుట్ ఈ విభాగంలో లభిస్తున్న Hyundai Kona ఎలక్ట్రిక్ కారు యొక్క పవర్ అవుట్‌పుట్‌తో సమానంగా ఉండే అవకాశం ఉంది. అయితే, ఈ పవర్ అవుట్‌పుట్ పెరిగిన తర్వాత కూడా, Tata Nexon EV ఈ విభాగంలో లభిస్తున్న మరొక ఎలక్ట్రిక్ కారు MG ZS EV కంటే 7 బిహెచ్‌పిలు తక్కువగా ఉంటుంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

కాగా, Nexon EV లో చేయనున్న ఈ పవర్ అప్‌గ్రేడ్, దాని రేంజ్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. పవర్ పెరిగిన కారణంగా, దాని రేంజ్ అలాగే ఉంటుందా లేక తగ్గుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఒక్క మార్పు మినహా కొత్త Tata Nexon EV లో వేరే ఏ ఇతర మార్పులు చేయబడవని తెలుస్తోంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో Tata Nexon EV ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XM, XZ+ మరియు XZ+ Lux అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో దాని బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అదే సమయంలో, దాని టాప్-మోడల్ వేరియంట్ ధర రూ. 16.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కెల్లా చవకైనదిగా మరియు ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంటుంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

Tata Motors ప్రస్తుతం Tata Nexon EV ని 30.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో విక్రయిస్తోంది మరియు ఈ కారు పూర్తి చార్జ్‌పై గరిష్టంగా 312 కిమీ సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 129 బిహెచ్‌పి పవర్ ను మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

ఈ కారు బ్యాటరీలను డిసి ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 60 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో, ఇంటి వద్ద ఉండే సాధారణ ఛార్జర్ సాయంతో దీనిని 8 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ కారు కోసం కంపెనీ దేశవ్యాప్తంగా పబ్లిక్ చార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తోంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

Tata Nexon EV లో డ్యూయల్ పాడ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, 16 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా, సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, లెదర్ కవర్ స్టీరింగ్ వీల్, పుష్ బటన్ స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్ వంటి పలు ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

Tata Motors తమ ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారుల కోసం దేశంలో చార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తృతం చేసేందుకు కంపెనీ ఇటీవలే Tata Power సంస్థతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఇరు సంస్థలు భారీగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

Tata Motors మరియు Tata Power సంస్థలు ఇప్పటివరకు దేశంలోని 45 నగరాల్లో 400కి పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్లను కంపెనీ డీలర్‌షిప్స్ మరియు పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇతర నగరాలు మరియు రహదారులపై 2500 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

Tata Tigor EV విడుదల

ఇదిలా ఉంటే Tata Motors ఇటీవలే తమ సరికొత్త Tata Tigor EV ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. Nexon EV ని తయారు చేసిన Ziptron ప్లాట్‌ఫామ్ పైనే కంపెనీ ఈ కొత్త Tigor EV కూడా తయారు చేసింది. ఫలితంగా, మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త Tigor EV రేంజ్ భారీగా పెరిగింది.

మరింత శక్తివంతమైన Tata Nexon EV వస్తోంది.. పూర్తి వివరాలు

Tata Motors తమ కొత్త Tigor EV ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 31, 2021వ తేదీన కంపెనీ ఈ కారును మార్కెట్లో విడుదల చేయనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 26, 2021, 11:46 [IST]
English summary
Coming soon more powerful tata nexon ev details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+