పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

భారతదేశంలో ప్రారంభమైన పండుగ సీజన్లో ఎక్కువమంది ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ పండుగ సీజన్ ఆటో పరిశ్రమకు నిజంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు తన కంపెనీ యొక్క వాహనాల అమ్మకాలను పెంచుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తాయి. ఈ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అన్ని కూడా వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

భారతీయ కార్ల మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన విభాగాలలో ఒకటి 'కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్'. చాలా మంది కార్ల తయారీదారులు తమ ఉత్పత్తులను ఈ విభాగంలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ పండుగ సీజన్‌లో, కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల కొనువులుపై దాదాపు రూ. 40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్లో కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ విభాగంలో కారు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ఈ ఆర్టికల్ లో ఏ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ కొంటే ఎంతవరకు ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

Hyundai Santro (హ్యుందాయ్ శాంట్రో):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన Hyundai కంపెనీ యొక్క కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ Hyundai Santro. కంపెనీ ఇప్పుడు ఈ పండుగ సీజన్లో ఏకంగా రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ .25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

హ్యుందాయ్ కంపెనీ ఈ మోడల్ ని మాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్టా అనే మూడు వేరియంట్లలో అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ యొక్క బేస్-స్పెక్ ఎరా వేరియంట్ పై రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే కంపెనీ యొక్క CNG వేరియంట్‌పై మాత్రం ఎటువంటి నగదు తగ్గింపు అద్నుబాటులో లేదు. హ్యుందాయ్ శాంట్రో మంచి ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది, కావున వాహన వినియోగదారులకు చాలా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

Tata Tiago (టాటా టియాగో):

భారతదేశపు కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ. ఈ కంపెనీ యొక్క కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ Tata Tiago (టాటా టియాగో) అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడు రూ. 28,000 వరకు బెనీఫీట్స్ పొందవచ్చు.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్‌ వంటివి అందుబాటులో ఉంటాయి. ఆ ఆఫర్ కేవలం కంపెనీ యొక్క టియాగో యొక్క సెకండ్-బేస్ XTO మరియు మిడ్-స్పెక్ XT వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది కాకుండా, టాటా మోటార్స్ రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో ఇతర వేరియంట్‌లను అందిస్తోంది. పండుగ సీజన్లో ఈ వేరియంట్ కొనేవారికి ఇది అద్భుతమైన అవకాశం.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

Datsun Go (డాట్సన్ గో):

డాట్సన్ ఇండియా ఈ పండుగ సీజన్‌లో తన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ డాట్సన్ గో కారుపై దాదాపు రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ .20,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 ఎక్స్చేంజ్ బోనస్ మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా ఈ కారుపై కంపెనీ ఎలాంటి అఫర్ లేదా డిస్కౌంట్ అందించలేదు. కొనుగోలుదారులు దీనిని గమనించాలి.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

కొనుగోలుదారులు ఎంచుకున్న వేరియంట్‌ను బట్టి పైన పేర్కొన్న అన్ని ఆఫర్లు ప్రతి రాష్ట్రానికి మారే అవకాశం ఉంటుంది. కొనుగోలుదారులు దీనిని కూడా గమనించాలి. మీరు ఈ పండుగ సీజన్లో కారు కొనాలనుకుంటే మీకు సమీపంలో ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌ను సంప్రదించి కొనుగోలు చేయాలనుకునే కారు యొక్క పూర్తి వివరాలను మరియు ఆఫర్స్ తెలుసుకోవచ్చు.

పండుగ సీజన్లో ప్రత్యేకమైన ఆఫర్స్.. ఇప్పుడు ఈ కార్లపై కూడా..!!

ఈ పండుగ సీజన్లో వాహనాలను కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా గొప్ప సువర్ణావకాశం అనే చెప్పాలి. కావున కొనుగోలుచేయాలనుకునే వారు ఈ పండుగ సీజన్లో ఈ అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ వంటివి పొందవచ్చు. ఈ కంపెనీలు మాత్రమే కాకుండా దేశీయ మార్కెట్లో ఉన్న చాలా కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోడానికి, కొత్త కొత్త వాహనాలను ఆధునిక ఫీచర్స్ తో అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్లో చాలామంది కొనుగోలుదారులు తప్పకుండా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు, కావున ఈ కొత్త వాహనాలు వారిని ఆకర్శించే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Compact hatchback offers for this festive season tiago datsun go and santro details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X