ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీలే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే ఈ విభాగాల్లో పోటీ ఎక్కువగా ఉంటే, కొత్తగా వచ్చిన సోనెట్, మాగ్నైట్ మరియు కైగర్ వంటి మోడళ్లతో ఈ పోటీ మరింత అధికమైంది.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

తాజాగా, గడచిన ఫిబ్రవరి 2021 నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీల వివరాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో సరికొత్త అవతార్‌లో వచ్చిన 2020 క్రెటా అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో విటారా బ్రెజ్జా నిలిచింది.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

గడచిన ఫిబ్రవరి 2021 నెలలో హ్యుందాయ్ క్రెటా గరిష్టంగా 12,428 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఫిబ్రవరి 2020లో వీటి సంఖ్య కేవలం 700 యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ సమయంలో క్రెటా అమ్మకాలు అత్యధికంగా 1675 శాతం వృద్ధిని సాధించాయి.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా గడచిన నెలలో 11,585 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఈ మోడల్ అమ్మకాలు 6,866 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బ్రెజ్జా అమ్మకాలు 69 శాతం పెరిగాయి.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

హ్యుందాయ్ వెన్యూ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ సమయంలో వెన్యూ అమ్మకాలు 9 శాతం పెరిగి 10,321 యూనిట్ల నుండి 11,224 యూనిట్లకు పెరిగాయి. కియా సెల్టోస్ అమ్మకాలు 40.7 శాతం క్షీణించి 14,024 యూనిట్ల నుండి 8,305 యూనిట్లకు పడిపోయాయి.

Rank Model February 2021 February 2020 Growth (%)
1 Maruti Vitara Brezza 11,585 6,866 69
2 Hyundai Venue 11,224 10,321 9
3 Kia Sonet 7,997 0 -
4 Tata Nexon 7,929 3,894 104
5 Renault Kiger 3,226 - -
6 Mahindra XUV300 3,174 2,431 31
7 Ford Ecosport 3,171 3,317 -15
8 Nissan Magnite 2,991 0 -
9 Toyota Urban Cruiser 2,549 0 -
10 Honda WR-V 1,004 0 -

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

గతేడాది మార్కెట్లోకి విడుదలైన కియా సోనెట్ ఈ జాబితాలో ఐదవ స్థానాన్ని దక్కించుకుంది. గత నెలలో కియా సోనెట్ అమ్మకాలు 7,997 యూనిట్లుగా ఉన్నాయి. టాటా మోటార్స్ అందిస్తున్న నెక్సాన్ అమ్మకాలు గరిష్టంగా 103 శాతం వృద్ధిని సాధించి 3,894 యూనిట్ల నుండి 7,929 యూనిట్లకు పెరిగాయి.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదల ఎమ్‌జి హెక్టర్ అమ్మకాలు జోరందుకున్నాయి. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 3,662 యూనిట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 2020లో ఇదే మోడల్ అమ్మకాలు 1,218 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో హెక్టర్ అమ్మకాలు 200 శాతం పెరిగాయి.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

ఇకపోతే, మహీంద్రా స్కార్పియో అమ్మకాలు 134 శాతం వృద్ధి చెంది 1,505 యూనిట్ల నుండి 3,532 యూనిట్లకు పెరిగాయి. గత నెలలోనే మార్కెట్లోకి విడుదలైన రెనో కైగర్ ఈ జాబితాలో 9వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ సమయంలో కైగర్ అమ్మకాలు 3,226 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఫిబ్రవరి 2021లో బెస్ట్ కాంపాక్ట్, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఇవే!

మహీంద్రా ఎక్స్‌యూవీ300 అమ్మకాలు 30 శాతం వృద్ధి చెంది 2,431 యూనిట్ల నుండి 3,174 యూనిట్లకు పెరిగాయి. గత నెలలో 3,171 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లు అమ్ముడయ్యాయి. ఇకపోతే, నిస్సాన్ మాగ్నాట్, మహీంద్రా థార్ మరియు టొయోటా అర్బన్ క్రూయిజర్ మోడళ్ల అమ్మకాలు వరుసగా 2,991, 2,842 మరియు 2,549 యూనిట్లుగా నమోదయ్యాయి.

Source: Autopunditz

More from DriveSpark

Article Published On: Friday, March 5, 2021, 10:08 [IST]
English summary
Compact SUV Sales In February 2021; Creta And Vitara Brezza Tops The List, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+