మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా తమ సరికొత్త ఎస్‌యూవీ 'మహీంద్రా బొలెరో నియో' తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బొలెరో ఎస్‌యూవీతో పోల్చుకుంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

గతంలో కంపెనీ విక్రయించిన మహీంద్రా టియువి300 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఈ కొత్త బొలెరో నియో ఎస్‌యూవీని తయారు చేశారు. ఈ సరికొత్త మహీంద్రా బొలెరో నియో ఈ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు టాటా నెక్సాన్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో, పైన తెలిపిన మూడు మోడళ్ల మధ్య పోలికలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

వేరియంట్లు మరియు ధరలు

మహీంద్రా బొలెరో నియో మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటిలో N4, N8, N10 మరియు N10 (O) వేరియంట్లు ఉన్నాయి. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.8.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటే, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మొత్తం LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు ట్రిమ్స్‌లో మొత్తం 9 వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.7.51 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.11.41 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఇది XE, XM, XZ, XZ+, XMA మరియు XZA+ అనే ఆరు ట్రిమ్‌లలో మొత్తం 18 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ కారు ప్రారంభ ధర రూ.7.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13.23 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

డిజైన్ మరియు స్టైల్

డిజైన్ విషయానికి వస్తే, ఇదివరకు చెప్పుకున్నట్లుగా మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని కంపెనీ తమ మహీంద్రా టియువి300 ఆధారంగా నిర్మించింది. మొదటి చూపులోనే మహీంద్రా టియువి300 మాదిరిగా కనిపిస్తుంది. కానీ, నిశితంగా పరిశీలిస్తే ఇందులో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తుంది. కొత్త బంపర్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్, ఎల్‌ఇడి హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు కొత్త 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఇక మారుతి సుజుకి విటారా బ్రెజ్జా డిజైన్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీని సబ్-4 మీటర్ మోడల్‌గా రూపొందించారు. ఈ ఎస్‌యూవీ మీటర్ల కన్నా తక్కువ పొడవును కలిగి ఉన్నప్పటికీ, ఇది విశాలమైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉంటుంది. స్టైలిష్ డిజైన్‌తో కూడిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఎల్‌ఈడి హెడ్‌లైట్, టెయిల్ లైట్, టర్న్ ఇండికేటర్లు మరియు 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

మరోవైపు, టాటా నెక్సాన్ ఎస్‌యూవీని కూడా సబ్ -4 మీటర్ల పొడవులో డిజైన్ చేశారు. టాటా మోటార్స్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ప్రత్యేకమైన స్టైలింగ్‌ను ఇచ్చింది. ఈ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఫాగ్‌ల్యాంప్‌లు ఉంటాయి. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్తగా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఫీచర్‌ను జోడించింది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఇంటీరియర్స్

మహీంద్రా బొలెరో నియో ఎస్‌యూవీని 7 సీట్ల కాన్ఫిగరేషన్‌తో డిజైన్ చేశారు. ఇందులో మధ్యలో బెంచ్ సీట్లు, మూడవ వరుసలో ప్యాసింజర్లు ఎదురెదురుగా కూర్చునేలా జంప్ సీట్లు ఉంటాయి. ఈ కారులో జంప్ సీట్లను ముడచినప్పుడు 384 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది. దీని ఇంటీరియర్ భాగాన్ని లేత గోధుమరంగు మరియు బ్లాక్ కలర్లలో డ్యూయల్ టోన్ థీమ్‌లో డిజైన్ చేశారు.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఒక 5 సీటర్ ఎస్‌యూవీ. ఇందులో ముందు వరుసలో రెండు మరియు వెనుక వరుసలో మూడు సీట్లు ఉంటాయి. 5-సీటర్ కారణంగా ఈ కారులో 328 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. దీని ఇంటీరియర్స్‌ను ఆల్-బ్లాక్ థీమ్‌లో డిజైన్ చేశారు. ఇది ఈ ఎస్‌యూవీకి మంచి ప్రీమియం లుక్‌నిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఇక టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా 5 సీట్ల కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. ఇందులో 350 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కారు లోపలి భాగాన్ని కూడా విటారా బ్రెజ్జా మాదిరిగానే ఆల్-బ్లాక్ థీమ్‌లో డిజైన్ చేశారు. ఇందులోని సీట్లపై ట్రై-యారో డిజైన్ ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఫీచర్లు

బొలెరో నియో ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు (మాన్యువల్), కీలెస్ ఎంట్రీ, పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ మరియు ఏసి మొదలైన ఫీచర్లు కూడా లభిస్తాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

మారుతి విటారా బ్రెజ్జాలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ టెక్నాలజీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, కీలెస్-ఎంట్రీ, పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్, బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు మరియు 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

టాటా నెక్సాన్ కారులో 7.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ-స్టీరింగ్ వీల్, ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ అలర్ట్, లెథర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు బాహ్య ఉష్ణోగ్రత ప్రదర్శన వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

సేఫ్టీ ఫీచర్లు

మహీంద్రా బొలెరో నియో సేఫ్టీ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, సీట్ బెల్ట్ రిమైండర్ (ముందు వరుస కోసం), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

మారుతి విటారా బ్రెజ్జాలో ఏబిఎస్ విత్ ఈబిడి, రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు (డ్రైవర్ మరియు ప్యాసింజర్ కోసం), చైల్డ్ సేఫ్టీ లాక్, కెమెరాతో కూడిన వెనుక పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్-అసిస్ట్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఈ కారులో ఏబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ అసిస్ట్, జియో-ఫెన్స్ అలర్ట్ మరియు స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఇంజన్

మహీంద్రా బొలెరో నియోను కంపెనీ ఒకే ఇంజన్ ఆప్షన్‌తో విక్రయిస్తోంది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారులో ఇంజన్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కూడా ఉంటుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా కూడా ఒకే ఒక ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ కారులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 105 బిహెచ్‌పి శక్తిని మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో vs మారుతి విటారా బ్రెజ్జా vs టాటా నెక్సాన్: కంపారిజన్

ఇక చివరిగా, టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఈ కారు మాత్రం రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పి పవర్‌ను మరియు 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
Comparison Between Mahindra Bolero Neo, Maruti Suzuki Vitara Brezza And Tata Nexon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X