Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ (Tata Motors) అందిస్తున్న కార్లు భారత మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. మోడ్రన్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని విభాగాల్లోని కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ బ్రాండ్ నుండి తాజాగా వస్తున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ఇంకా అధికారికంగా మార్కెట్లోకి రాకమునుపే అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే టాటా మోటార్స్ సంకల్పంలో భాగంగా, చిన్న కుటుంబాలు మరియు యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ చిన్న ఎస్‌యూవీని రూపొందించింది. టాటా పంచ్ ఈ విభాగంలో మహీంద్రా కెయువి100 మరియు మారుతి సుజుకి ఎస్-ప్రెసో వంటి చిన్న కార్లకు పోటీగా మార్కెట్లోకి రానుంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ గురించి ఇప్పటికే అనేక విషయాలను మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే, ఈ కథనంలో టాటా పంచ్ (Tata Punch) అదే కార్ బ్రాండ్ నుండి లభిస్తున్న టాటా టియాగో ఎన్ఆర్‌జి (Tata Tiago NRG) ఎడిషన్‌తో ఏరకంగా పోటీ పడుతుంది? మరియు ఈ రెండు టాటా కార్ల మధ్య సారూప్యతలు, తేడాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

టాటా మోటార్స్ తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీని టియాగో హ్యాచ్‌బ్యాక్‌కి దిగువన ఎంట్రీ లెవల్ మోడల్ గా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాబట్టి, ఇది టియాగో ఎన్‌ఆర్‌జితో పోటీగా ఉంటుంది. టాటా పంచ్ ను టియాగో ఎన్ఆర్‌జితో పోల్చడానికి ప్రధాన కారణం టియాగో ఎన్‌ఆర్‌జి కారు కొలతలు కొత్త పంచ్ మైక్రో-ఎస్‌యూవీ మోడల్‌కి అనుకూలంగా ఉంటాయి. ఏరోడైనమిక్స్‌కి అనుకూలంగా ఉండేలా ఈ రెండూ దాదాపు ఒకే పరిమాణంలో ఉంటాయి.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

అలాగే ఈ రెండింటిలో ఒకే రకమైన పవర్‌ట్రెయిన్ మరియు డ్రైవ్‌ట్రెయిన్ (ఇంజన్, గేర్‌బాక్స్) ఆప్షన్లు అందించబడ్డాయి. అయితే, టాటా పంచ్ కారులో లభించే ఫీచర్లు మాత్రం చాలా అధునాతనమైనవి. పంచ్ మార్కెట్లో విడుదలైనప్పుడు ఈ రెండు టాటా కార్ల ధరలు దాదాపుగా ఒకేలా ఉంటాయని అంచనా. కాబట్టి, టాటా టియాగోకి ప్రత్యామ్నాయ కారు కోసం చూస్తున్న వారి దృష్టి ఖచ్చితంగా పంచ్ మైక్రో-ఎస్‌యూవీ వైపు వెళ్తుంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

ఇంటీరియర్‌లో ఏది బెస్ట్?

టాటా పంచ్ మరియు టాటా టియాగో ఎన్ఆర్‌జి మోడళ్లు రెండూ కూడా పరిమాణంలో ఇంచు మించు ఒకేలా ఉన్నప్పటికీ, పొడవు, వెడల్పు, ఎత్తు, వీల్‌బేస్, గ్రౌండ్ క్లియరెన్స్ మరియు బూట్ స్పేస్ పరంగా టాటా పంచ్ టియాగో కంటే కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. టాటా పంచ్ కారు చుట్టూ అందించిన ప్లాస్టిక్ ప్యానెల్స్ (బాడీ క్లాడింగ్) వలన ఈ మైక్రో- ఎస్‌యూవీ చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

టాటా పంచ్ పేరుకే మైక్రో ఎస్‌యూవీ, ఇంటీరియర్ స్పేస్‌లో ఇది ప్రీమియం కార్లకు ఏమాత్రం తీసిపోదు. ముఖ్యంగా పంచ్ కారు వెనుక భాగంలో స్టోరేజ్ ఏరియాని చాలా చక్కగా డిజైన్ చేశారు. పెద్ద బాహ్య కొలతలు ఫలితంగా, టాటా పంచ్ టియాగో ఎన్ఆర్‌జి కారు కంటే ఎక్కువ ఖాళీతో కూడిన అంతర్గత క్యాబిన్‌ను కలిగి ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

ఇంజిన్ మరియు గేర్‌బాక్స్

టాటా టియోగో ఎన్ఆర్‌జి మరియు టాటా పంచ్ రెండు ఎస్‌యూవీలు కూడా ఆల్ఫా ఆర్కిటెక్చర్ నిర్మించబడ్డాయి. ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‌ఫామ్ ను పంచుకున్నట్లుగానే, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను కూడా పంచుకుంటాయి. ఈ రెండు కార్లలో ఒకేరకమైన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో లభిస్తుంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

ఈ ఇంజన్ గరిష్టంగా 84.4 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందించబడుతుంది. ఇంజన్ పవర్ టార్క్ గణాంకాల్లో పంచ్ మరియు టియాగో ఎన్ఆర్‌జి మోడళ్లలో పెద్దగా తేడా లేదు కాబట్టి, ఈ రెండింటిలోనూ ప్రయాణ అనుభవం దాదాపు ఒకేలా ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

మరి ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?

వాస్తవానికి టాటా పంచ్ కారులో అందించబోయే పూర్తి ఫీచర్ల వివరాలను టాటా మోటార్స్ ఇంకా విడుదల చేయనప్పటికీ, ఈ మైక్రో-ఎస్‌యూవీ యొక్క టాప్ వేరియంట్‌లలో ఆశించే ఫీచర్‌లను టియాగో ఎన్‌ఆర్‌జి యొక్క టాప్ వేరియంట్‌తో పోల్చి చూసినప్పుడు దాదాపు రెండూ ఒకేలా ఉంటాయని తెలుస్తోంది.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

మరో మాటలో చెప్పాలంటే, టియాగో ఎన్‌ఆర్‌జి యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌ లలో అందించే టెక్ ఫీచర్ల కంటే టాటా పంచ్ మోడల్‌లో ఆఫర్ చేయబోయే టెక్ ఫీచర్లే ఎక్కువగా ఉంటాయి. టాటా పంచ్ కారులో సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మరియు ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కానీ ఇవి టియాగో ఎన్ఆర్‌జి కారులో ఇలాంటివి లేవు.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

అయితే, ఈ రెండు టాటా కార్లలో వెనుక సీటు ప్రయాణీకుల కోసం ఏసి వెంట్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ హుక్స్ వంటి ఫీచర్లు అందించబడలేదు. కాకపోతే, టాటా టియాగో ఎన్‌ఆర్‌జి మోడల్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ లో ఐదు స్టార్లకు నాలుగు స్టార్ల సేఫ్టీ స్కోర్ ని దక్కించుకుంది. కాబట్టి, టాటా పంచ్ కూడా సేఫ్టీ విషయంలో ఇదే పనితీరును కనబరచగలదని ఆశిస్తున్నాము.

Tata Punch వర్సెస్ Tiago NRG: అసలు ఈ రెండికీ పోలిక ఏంటి?

ధర

టాటా పంచ్ కారులో కంపెనీ కొన్ని అదనపు టెక్నాలజీలను ఆఫర్ చేసినప్పటికీ, కంపెనీ ఈ మైక్రో ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధరను సుమారు రూ. 4.5 లక్షల నుంచి రూ. 7.5 లక్షల రేంజ్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక టాటా టియాగో ఎన్ఆర్‌జి విషయానికి వస్తే, మార్కెట్ ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.6 లక్షలుగా ఉంది.

Most Read Articles

English summary
Comparison between new tata punch micro suv and tiago nrg hatchback
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X