Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

భారత ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors, దేశీయ మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే, Tata Nexon EV ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తున్న కంపెనీ, తాజాగా మరొక కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

భారతదేశంలో Ziptron టెక్నాలజీతో రూపొందించిన కొత్త Tata Tigor EV ని కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. త్వరలోనే ఇది వాణిజ్య పరంగా కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. దేశంలో Tata Nexon EV తర్వాత Ziptron టెక్నాలజీని ఉపయోగించిన రెండో Tata మోడల్ ఇది.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

Tata Ziptron అనేది ఒక అధునాతన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, ఇది Tata యొక్క ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ మరియు శక్తిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. ప్రస్తుతం, మార్కెట్లో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ సెడాన్ విభాగంలో, Tata Tigor EV కి సరిపోయే ఇతర మోడల్ మరొకటి లేదు.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

కాకపోతే, Tata Tigor EV యొక్క రేంజ్ మరియు ఫీచర్లను పెంచింది, కాబట్టి ఇది భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Tata Nexon EV తో పోల్చవచ్చు. మరి ఈ కొత్త Tata Tigor EV మరియు Tata Nexon EV మోడళ్ల మధ్య ప్రధానంగా ఉన్న తేడాలు మరియు సారూప్యతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

డిజైన్

Tata Tigor EV ఒక ఎలక్ట్రిక్ సెడాన్ కాబట్టి, దీనిని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తో పోల్చలేము. అయితే, ఈ రెండు మోడళ్లలో ఒకేరకమైన Ziptron టెక్నాలజీని ఉపయోగించారు. కాబట్టి, డిజైన్ పరంగా ఈ రెండు కార్లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

డిజైన్ పరంగా చూస్తే, కొత్త Tata Tigor EV లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, డ్యూయల్ టోన్ క్యాబిన్ ఇంటీరియర్స్, అల్లాయ్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ వెర్షన్ తెలియజేయటం కోసం కంపెనీ దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో బ్లూ కలర్ యాక్సెంట్స్‌ని ఉపయోగించింది.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

Tata Nexon ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కూడా ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ డిజైన్ అంశాలపై బ్లూ కలర్ యాక్సెంట్స్ ఉపయోగించారు. Tata Nexon EV లో సింగిల్ స్లాట్ గ్రిల్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌లు, డ్యూయల్ టోన్ క్యాబిన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

కొలతలు

Tigor EV Nexon EV
Length 3993mm 3993mm
Width 1677mm 1811mm
Height 1532mm 1606mm
Wheelbase 2450mm 2498mm
Boot Space 316 litres 350 litres
Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

రేంజ్ మరియు ఛార్జింగ్

కొత్త Tata Ziptron పవర్‌ట్రెయిన్‌తో విడుదలైన Tigor EV ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ రేంజ్‌ని ఆఫర్ చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త Tigor EV పూర్తి ఛార్జ్‌పై మీద 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేయగలదు. ఇక Nexon EV విషయానికి వస్తే, ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 312-320 కిమీల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఛార్జింగ్ సమయం విషయానికి వస్తే, కొత్త Tigor EV సాధారణ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు పడుతుంది, అయితే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే 1 గంటలో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. Nexon EV సాధారణ హోమ్ ఛార్జర్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.5 గంటలు పడుతుంది, అదే అయితే ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 1.5 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

విద్యుత్ మోటార్ మరియు శక్తి

Tigor EV Nexon EV
Power 75 hp 127 bhp
Torque 170 Nm 245 Nm
Battery 26kWh 30.2kWh
Range 300+ km (claimed) 312 km
Charging Time 1 hour (0-80%) 8.5 hours (0-100%)
Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

సేఫ్టీ ఫీచర్లు

Tata Motors ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో అనేక భద్రతా ఫీచర్లను అందిస్తోంది. కొత్త Tigor EV లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందించబడ్డాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో Tigor EV 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ఇక Tata Nexon EV విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్ మరియు ఐఎస్ఓఫిక్స్ చైల్డ్ మౌంట్స్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Tata Nexon EV.

Tigor EV vs Nexon EV: ఈ రెండు మోడళ్ల మధ్య తేడా ఏంటి?

ధర

Tata Motors ఇంకా తమ కొత్త Tigor EV ధరను అధికారికంగా ప్రకటించలేదు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.11 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇకపోతే, Tata Nexon EV ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.13.99 లక్షల నుండి రూ.16.85 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
Comparison between new tata tigor ev and nexon ev price specs range features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X