Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల తమ సరికొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ను సరసమైన ధరకే అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేసిన సంగతి తెలిసినదే. నిజానికి, టాటా పంచ్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు కొనుగోలుదారులు ఏ సబ్-4 మీటర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలా అనే అయోమయంలో ఉన్నారు.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

పంచ్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ఇతర బ్రాండ్ కార్లకే కాకుండా, స్వయంగా టాటా బ్రాండ్ కార్లకు కూడా పోటీగా నిలుస్తుంది. భారతదేశంలో ఈ మైక్రో-ఎస్‌యూవీపై టాటా మోటార్స్ కి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం రూ. 5.49 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్, ఇండియా) వచ్చిన కొత్త టాటా పంచ్ సబ్-4 మీటర్ ఎస్‌యూవీ, ఒక కారులో మీకు కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తుంది.

ఒకవేళ మీరు టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ కార్లలో దేనిని కొనాలనే కన్ఫ్యూజన్‌లో ఉంటే, ఈ కథనం మీ కన్ఫ్యూజన్‌ను దూరం చేయడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నాము.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

1. డిజైన్

టాటా పంచ్ మరియు టాటా నెక్సాన్ రెండూ కూడా ఎస్‌యూవీ బాడీ టైప్ వాహనాలే అయినప్పటికీ, డిజైన్ పరంగా ఇవి అంత భిన్నంగా కనిపించవు. కొత్త టాటా పంచ్ స్క్వేర్డ్ మరియు బాడీబిల్డర్ లాగా కనిపిస్తోంది, మరోవైపు టాటా నెక్సాన్ తన రిటైర్‌మెంట్‌ను ఆస్వాదించే పెద్ద బాడీబిల్డర్ లాగా కనిపిస్తుంది. ఈ రెండింటిలో టాటా పంచ్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఎస్‌యూవీ.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

టాటా పంచ్ ఎస్‌యూవీ పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ, ఇది మరింత కఠినమైన రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. మరోవైపు, టాటా నెక్సాన్ చాలా చక్కగా మరియు అర్బన్-ఫ్రెండ్లీ వాహనంలా కనిపిస్తుంది. అంతేకాకుండా, టాటా నెక్సాన్ డిజైన్ కఠినంగా కనిపించే టాటా పంచ్‌తో పోలిస్తే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

2. ఫీచర్లు మరియు సౌలభ్యం

రెండు వాహనాలలో లభించే ఫీచర్లు ఇంచు మించు ఒకేలా ఉంటాయి. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో హెడ్‌లైట్లు, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఎన్నో ఫీచర్లు ఈ రెండింటిలో ఉన్నాయి.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

అయితే, టాటా నెక్సాన్ లో పెద్ద కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ ఏసి వెంట్స్, మరింత ప్రీమియం 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్‌పి), ట్రాక్షన్ కంట్రోల్ (టిసి), డ్రైవ్ మోడ్‌లు వంటి ఫీచర్లను అందించడం ద్వారా కాస్తంత 'ఎక్స్‌ట్రా' గా ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

ఇకపోతే, టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీలో 'ట్రాక్షన్ ప్రో' అని పిలువబడే చాలా సులభమైన ఫీచర్‌ ఉంటుంది, ఇది తక్కువ రేషన్ పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు ట్రాక్షన్ ప్రో సిస్టమ్‌ని యాక్టివేట్ చేయమని డ్రైవర్‌ని ప్రోత్సహిస్తుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

3. స్పేస్

టాటా నెక్సాన్ కొలతలు 3999x1811x1523mm (LxWxH) గా ఉంటాయి. టాటా పంచ్ తో పోల్చినప్పుడు, పంచ్ కంటే నెక్సాన్ 166 మిమీ ఎక్కు పొడవు, 56 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 83 మిమీ ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. అంటే, దీని అర్థం టాటా నెక్సాన్, టాటా పంచ్ కంటే పెద్దగా ఉంటుంది. నెక్సాన్ పెద్ద ఎస్‌యూవీ కావడంతో, ఇందులో బూట్ స్పేస్ కూడా పెద్దగా ఉంటుంది. నెక్సాన్ లో 412 లీటర్ల బూట్ స్పేస్ ఉంటే, పంచ్‌లో 366 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

4. పవర్‌ట్రెయిన్ (ఇంజన్)

పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే, టాటా పంచ్‌లో అందుబాటులో ఉన్న ఏకైక ఇంజన్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 84.48 బిహెచ్‌పి శక్తిని మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) తో జతచేయబడి ఉంటుంది. ఇక టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

పెట్రోల్‌ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

5. ధర

టాటా నెక్సాన్ 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.28 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంటుంది. అయితే, ఇందులో AMT గేర్‌బాక్స్ తో కూడిన టాప్-ఆఫ్-ది-లైన్ టాటా నెక్సాన్ XZA+ (O) డార్క్ వేరియంట్ ధర రూ. 13.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

ఇక టాటా పంచ్ ధరల విషయానికి వస్తే, దీని బేస్ వేరియంట్ ధర రూ. 5.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) నుండి మొదలవుతుంది. అయితే, ఇందులో ఐఆర్ఏ ప్యాక్‌తో కూడిన టాప్-ఎండ్ క్రియేటివ్ వేరియంట్ ధర రూ. 9.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంటుంది.

Tata Punch వర్సెస్ Tata Nexon: నెక్సాన్ కన్నా పంచ్ బెస్ట్‌గా ఉందా?

చివరిమాట..

ఈ రెండు ఎస్‌యూవీలు టాటా మోటార్స్ నుండి లభిస్తున్న సబ్-4 మీటర్ వాహనాలు అయినప్పటికీ, టాటా పంచ్ తో పోల్చుకుంటే, టాటా నెక్సాన్ కోసం కస్టమర్లు సుమారు రూ. 1.79 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ధర పరంగా చూసుకుంటే టాటా పంచ్ బెస్ట్, అదే స్పేస్ పరంగా చూసుకుంటే టాటా నెక్సాన్ బెస్ట్.

Most Read Articles

English summary
Comparison between tata punch and tata nexon lets find out which one is best
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X