డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

గడచిన డిసెంబర్ 2020 నెలలో జరిగిన అన్ని విభాగాల వాహన రిజిస్ట్రేషన్ డేటాను ఎఫ్ఏడిఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్) విడుదల చేసింది. డిసెంబర్ 2019తో పోలిస్తే, డిసెంబర్ 2020లో మొత్తం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు 11 శాతం పెరిగినట్లు ఎఫ్ఏడిఏ పేర్కొంది.

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

ఎఫ్ఏడిఏ విడుదల చేసిన డేటా ప్రకారం, గడచిన నెలలో ప్యాసింజర్ వాహన విభాగం (ఫోర్-వీలర్), ద్విచక్ర వాహన విభాగం (టూ-వీలర్) మరియు ట్రాక్టర్ వాహన విభాగం మాత్రమే వృద్ధిని నమోదు చేశాయి. కాగా, త్రీవీలర్ మరియు వాణిజ్య వాహనాల విభాగాలు క్షీణతను నమోదు చేశాయి.

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

డిసెంబర్ 2020లో అన్ని వాహన విభాగలకు సంబంధించిన డీలర్లు 18,44,143 యూనిట్ల వాహనాలను విక్రయించి, గత డిసెంబర్ 2019 అమ్మకాలతో (16,61,245 యూనిట్లతో) పోలిస్తే 11.01 శాతం వృద్ధని సాధించినట్లు ఎఫ్ఏడిఏ తెలిపింది. గతేడాది ద్వితీయార్థంలో అమ్మకాలు క్రమంగా మెరుగుపడటాన్ని ఇది సూచిస్తుంది.

MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

ముందుగా, ద్విచక్ర వాహన విభాగంలోని అమ్మకాలను గమనిస్తే, డిసెంబర్ 2020 నెలలో, మొత్తం 14,24,620 వాహనాల రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, డిసెంబర్ 2019 నెలలో వీటి సంఖ్య 12,73,318 యూనిట్లుగా నమోదై 11.88 శాతం వృద్ధిని సాధించినట్లు ఎఫ్ఏడిఏ తెలిపింది.

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

కాగా, మూడు చక్రాల (త్రీ-వీలర్) వాహన విభాగంలో రిజిస్ట్రేషన్లు మరోసారి భారీగా క్షీణించాయి. వార్షికంగా చూసుకుంటే డిసెంబర్ 2019లో మొత్తం 58,651 యూనిట్ల త్రీ వీలర్ రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, ఈ ఏడాది డిసెంబర్ (2020)లో కేవలం 27,715 యూనిట్ల త్రీ వీలర్స్ మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే, ఈ విభాగం 52.75 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

ప్యాసింజర్ వెహికల్స్ (పివి) విభాగాన్ని గమనిస్తే, ఈ విభాగం వార్షికంగా 23.99 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో గడచిన డిసెంబర్ 2020 నెలలో మొత్తం 2,71,249 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయని ఎఫ్ఏడిఏ తెలిపింది. గడచిన సంవత్సరం ఇదే సమయంలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 2,18,775 యూనిట్లుగా ఉన్నాయి.

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

త్రీవీలర్స్ మాదిరిగానే వాణిజ్య వాహన (సివి) విభాగంలో కూడా రిజిస్ట్రేషన్లు తక్కువగా నమోదయ్యాయి. డిసెంబర్ 2020లో మొత్తం 51,454 యూనిట్ల కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్లను కాగా, గడచిన సంవత్సరం ఇదే సమయంలో (డిసెంబర్ 2019లో) వీటి సంఖ్య 59,497 యూనిట్లగా ఉంది. అప్పటితో పోల్చుకుంటే ఈ విభాగం వార్షికంగా 13.52 శాతం క్షీణతను నమోదు చేసింది.

MOST READ:పాకిస్థాన్ క్రికెటర్ 'షోయబ్ మాలిక్' కార్ యాక్సిడెంట్ ; తృటిలో తప్పిన పెను ప్రమాదం

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

గత డిసెంబర్ నెలలో టూవీలర్లు, ఫోర్-వీలర్ల తర్వాత వృద్ధిని సాధించిన మరో వాహన విభాగం ట్రాక్టర్లు. డిసెంబర్ 2020 నెలలో ట్రాక్టర్ రిజిస్ట్రేషన్లు వార్షికంగా 35.49 శాతం వృద్ధి చెందాయి. గత నెలలో మొత్తం 69,105 యూనిట్ల ట్రాక్టర్లు రిజిస్టర్ కాగా, డిసెంబర్ 2019లో వీటి సంఖ్య 51,004 యూనిట్లుగా ఉన్నాయి.

డిసెంబర్ 2020లో ఫలించిన ఇయర్-ఎండ్ సెంటిమెంట్!

కాగా, నాలుగు చక్రాల డీలర్ జాబితాను 5 - 20 రోజులు, ద్విచక్ర వాహనాల జాబితాను 30 - 35 రోజులు తగ్గించినట్లు ఎఫ్ఏడిఏ తెలిపింది. అయితే, జనవరి 2021లో అన్ని వాహనాల ధరల పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, కొత్త వాహనాలకు డిమాండ్ కూడా స్వల్పంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

Most Read Articles

English summary
New Vehicle Registrations In December 2020 Up By 11 Percent. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X