లాక్‌డౌన్‌ సడలింపుకు శ్రీకారం.. మొదటగా ఈ సర్వీస్ స్టార్ట్.. ఎక్కడంటే?

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా చాలా రాష్ట్రాల్లో కరోనా నివారణకు లాక్‌డౌన్‌ అమలు చేయబడింది. ఇందులో భాగంగానే కరోనా కేసులు ఎక్కువగా వున్న రాష్ట్రాల్లో ప్రజా రవాణా వంటివి కూడా మొత్తం నిలిపివేయబడింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో దేశ రాజధాని నగరం ఢిల్లీ కూడా ఒకటి.

ఢిల్లీలో కరోనా చాలా ఎక్కువగా విజృంభించడం వల్ల 2021 మే 10 నుంచి మెట్రో సేవలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ కొంత చల్లబడింది. ఈ తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెట్రో సర్వీస్ మళ్ళీ ప్రారంభించాలని ఆదేశించారు.

లాక్‌డౌన్‌ సడలింపుకు శ్రీకారం.. మొదటగా ఈ సర్వీస్ స్టార్ట్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ కారణంగా కరోనా లాక్ డౌన్ దశలవారీగా తొలగించబడుతోంది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ 2021 జూన్ 7 నుంచి మెట్రో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రకటన వల్ల 50 శాతం సామర్థ్యంతో మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంటుంది.

నివేదికల ప్రకారం గత మే 10 న మెట్రో సర్వీస్ ఆగిపోయింది. తర్వాత దాదాపు ఒక నెల రోజల తర్వాత తిరిగి మెట్రో సర్వీస్ పునః ప్రారంభమవుతోంది. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని, కోచ్‌లో దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబడతాయి. మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులు కూడా ఒక సీటును వదిలి కూర్చుని, సామజిక దూరం తప్పకుండా పాటించాలి.

మెట్రో సర్వీస్ ఉపయోగించుకునే వారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగానే మాస్క్ వంటివి తప్పకుండా ధరించాలి. ప్రయాణికులు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన అన్ని నిబంధనలను పాటించాలి. అదే సమయంలో, మెట్రో స్టేషన్‌లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ జరుగుతుంది.

గత సంవత్సరం 2020 లాక్ డౌన్ సమయంలో కూడా కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో మెట్రో సేవను దశలవారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు, ఢిల్లీ మార్కెట్లు మరియు మాల్స్ కొన్ని నియమాలతో ప్రారంభిస్తున్నట్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఢిల్లీలో ఇప్పుడు కొన్ని నియమాలతో వివిధ సర్వీసులు ప్రారంభించబడతాయి. ఇప్పుడున్న పరిస్థితి మరింత మెరుగుపడిన తరువాత అన్ని సడలింపులు జరుగుతాయని కేజ్రీవాల్ చెప్పారు. నివేదికల ప్రకారం శనివారం రోజు 400 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని తెలిసింది. ఇందులో 50 మరణించినట్లు కూడా తెలిసింది.

ఢిల్లీలో లాక్ డౌన్ సడలింపు దిశలో మొదటి భాగంగా అన్ని మెట్రో లైన్లను సోమవారం నుంచి ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇక్కడ ప్రయాణికులు గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మెట్రో సర్వీస్ తక్కువ సామర్థ్యంతో నడుస్తాయి. ప్రజలు కరోనా మహమ్మారిని నివారణలో భాగంగా అన్ని నియమాలు తప్పకుండా పాటించాలి.

Most Read Articles

English summary
Delhi Metro To Resume Services From Monday. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X