పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశలోని అనేక రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉంది. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

ఈ నేపథ్యంలో, దేశంలో సిఎన్‌జి వాహనాలపై ఆసక్తి చూపుతున్న కస్టమర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగుతున్నప్పటికీ, సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ధరలు మాత్రం పెరగడం లేదు. పెట్రోల్ ధరతో పోల్చుకుంటే, సిఎన్‌జి ధర చాలా తక్కువగా ఉంటుంది.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

అంతేకాదు, పెట్రోల్‌తో నడిచే కార్లతో పోల్చి చూస్తే, సిఎన్‌జి గ్యాస్‌తో నడిచే కార్లు అత్యధిక మైలేజీని కూడా అందిస్తాయి. ఈ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటున్న కస్టమర్లు ఇప్పుడు సిఎన్‌జి కార్ల వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సిఎన్‌‍జి వెర్షన్ కార్లకు ఎక్కడిలేని డిమాండ్ వచ్చి పడింది.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

తాజాగా మారుతి సుజుకి విడుదల చేసిన నివేదికల ప్రకారం, గతంలో కంటే 2020-21లోనే ఎక్కువగా సిఎన్‌జి కార్లు అమ్ముడయ్యాయి. మనదేశంలో మారుతి సుజుకి సంస్థ నుండే అత్యధికంగా సిఎన్‌జి కార్లు అమ్ముడవుతున్నాయి.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

మారుతి సుజుకి గడచిన 2019-2020 కాలంలో 1,06,444 సిఎన్‌జి కార్లను విక్రయించగా, 2020-2021 కాలంలో 1,57,954 యూనిట్ల సిఎన్‌జి వాహనాలను విక్రయించింది. మారుతి సుజుకి ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడు నెలల్లోనే అత్యధిక సిఎన్‌జి కార్లను విక్రయించింది.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

దీన్నిబట్టి చూస్తుంటే, సిఎన్‌జి కార్ల ట్రెండ్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం, భారత మార్కెట్లో హ్యుందాయ్, టాటా మోటార్స్ మరియు మారుతి సుజుకి వంటి సంస్థలు సిఎన్‌జి ఆధారిత వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటిలో, మారుతి సుజుకి నుండే అత్యధికంగా సిఎన్‌జి కార్లు అందుబాటులో ఉన్నాయి.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

మారుతి సుజుకి అందిస్తున్న సిఎన్‌జి మోడళ్లలో ఆల్టో, ఎస్ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఎర్టిగా, ఈకో మరియు సెలెరియో కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా లభిస్తున్నాయి. వీటికి అదనంగా మరిన్ని కొత్త సిఎన్‌జి మోడళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది.

పెట్రోల్ ధరలు భగ్గు.. సిఎన్‌జి కార్ల వైపు కస్టమర్ల మొగ్గు..

ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని రకాల సిఎన్‌జి కార్లు లభిస్తున్నాయి. - వాటికి సంబంధించిన వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Demand For CNG Cars Getting Increased In India After Continuous Fuel Price Hikes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X