భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

భారతదేశంలో ఒకప్పుడు చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ Skoda పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేవి ఆ సంస్థ అందించిన ప్రీమియం కార్ల గురించి. Skoda Auto గడచిన 2001 లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, ఈ యూరోపియన్ బ్రాండ్ ఇటీవలే ప్రజలకు దగ్గర కావటం ప్రారంభించింది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

గతంలో Skoda భారత మార్కెట్లో Fabia, Yeti, Superb వంటి మంచి ప్రీమియం కార్లను అందించింది. అయితే, అప్పట్లో ఈ బ్రాండ్‌కు సరైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ లేకపోవటం, స్పేర్స్ లభ్యత తక్కువగా ఉండటం మరియు ఈ సంస్థ అందించే కార్లన్నీ కూడా చాలా ఖరీదుతో కూడుకున్నవి కావటం వంటి పలు కారణాలతో ఈ కార్లు భారత మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోయాయి.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

Skoda అందించిన ఈ కార్లలో Fabia కారుకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో Maruti Suzuki Swift మరియు Hyundai i20 వంటి ప్రీమియం కార్లకు పోటీగా వచ్చిన ఈ Skoda Fabia భారత మార్కెట్లో 2008 నుండి 2013 వరకు విక్రయించబడింది. నిజానికి, ఆ సమయంలో ఈ కారు అంతర్జాతీయ మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యేది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

కానీ, భారతదేశంలో మాత్రం ఇది కంపెనీకి ఆశించిన విజయాలను సాధించి పెట్టలేకపోయింది. Skoda తమ మొట్టమొదటి వాహనమైన ఆక్టావియాను మార్కెట్లో విడుదల చేయటం ద్వారా భారత్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2008 లో Fabia హ్యాచ్‌బ్యాక్‌ను పరిచయం చేసింది. అనంతరం కంపెనీ ఇందులో రెండవ తరం మోడల్‌ని కూడా ప్రవేశపెట్టింది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

Skoda Fabia లో యూరోపియన్ డిజైన్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో లభించే Fabia ను కంపెనీ యధావిధిగా మన మార్కెట్లో విడుదల చేసింది. లుక్ అండ్ డిజైన్ పరంగా ఇది ఇంచు మించు మన Maruti Swift మాదిరిగానే అనిపించేది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

Skoda ఈ ప్రీమయం హ్యాచ్‌బ్యాక్‌ను రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మొదటిది 1.2-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ యూనిట్. ఇది గరిష్టంగా 5,400 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 73.7 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

ఇకపోతే, రెండవది మరింత శక్తివంతమైన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా ఇది 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 103.2 బిహెచ్‌పి శక్తిని మరియు 3,800 ఆర్‌పిఎమ్ వద్ద 158 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

అప్పట్లోనే ఈ కారు టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో లభించేంది. ఇందులో 1.2-లీటర్ టిడిఐ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 73.7 బిహెచ్‌పి పవర్‌ను మరియు 2,000 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

ఈ మూడు ఇంజన్‌లు కూడా ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభ్యమయ్యేవి. ఆ సమయంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యూనిట్లు అంతగా ప్రాచుర్యం పొందనందున, కంపెనీ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌లను అందించడానికి సిద్ధపడలేదు. కానీ, విదేశీ మార్కెట్లలో మాత్రం ఇందులో ఆటోమేటిక్ వేరియంట్లు అందుబాటులో ఉండేవి.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్స్ అంతగా ప్రాచుర్యం పొందని సమయంలో Skoda Fabia ఈ విభాగంలో Maruti Suzuki Swift తో నేరుగా పోటీపడేది. అయితే, అనేక విషయాల్లో Fabia మన భారతీయ కారు కంటే చాలా ముందుండేది. అయినప్పటికీ, ఈ యూరోపియన్ కారు మాత్రం Maruti Swift పొందినంత విశ్వసనీయతను పొందలేకపోయింది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

Maruti Swift హ్యాచ్ కంటే Skoda Fabia పొడవుగా ఉంటుంది. దీని వీల్‌బేస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇది దాని ప్రత్యర్థుల కంటే మెరుగైన లెగ్‌రూమ్‌ను అందించేంది. నిజానికి, అప్పట్లో స్కోడా కార్లను లగ్జరీ కార్లుగా, స్టేటస్ సింబల్‌గా పరిగణించేవారు.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

Skoda Fabia కారు కూడా అదే ట్రెండ్‌తో వచ్చింది. ఈ కారులో ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పోలెన్ ఫిల్టర్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్, వెనుక ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్, ముందు మరియు వెనుక కప్‌హోల్డర్లు, ఇల్యుమినేటెడ్ గ్లోవ్ బాక్స్ వంటి ఎన్నో కీలక ఫీచర్లు ఇందులో లభించేవి.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

సేఫ్టీ విషయంలో కూడా Skoda Fabia అప్పటి ఇండియన్ కార్ల కన్నా ఎన్నో రెట్లు ముందంజలో ఉండేది. ఈ కారులో ఈబిడితో కూడిన ఏబిఎస్, హైడ్రాలిక్ సర్క్యూట్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ మరియు రియర్ ఫాగ్ ల్యాంప్స్ మరియు యాంటీ-గ్లేర్ రియర్‌వ్యూ మిర్రర్ వంటి సేఫ్టీ ఫీచర్లు లభించేవి. యూరో ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టింగ్‌లో ఇది 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

ఇన్ని ప్రత్యేకతలు కలిగిన Skoda Fabia భారత మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడలేకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో Skoda కార్ల మెయింటినెన్స్ చాలా అధికంగా ఉండేది. విడిభాగాలు (స్పేర్ పార్ట్స్) కూడా అంత సులువుగా దొరికేవు, వాటి కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చేది. అప్పట్లో ఈ బ్రాండ్ సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్ చాల బలహీనంగా ఉండటం, బ్రాండ్ పట్ల భారతీయుల్లో విశ్వసనీయత తక్కువగా ఉండటం వంటి పలు కారణాల వలన ఈ కారు భారత మార్కెట్ నుండి తొలగిపోయింది.

భారతదేశంలో Skoda Fabia హ్యాచ్‌బ్యాక్ వైఫల్యానికి కారణం ఏంటి?

Skoda ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో తమ నాల్గవ తరం Fabia మోడల్‌ను విడుదల చేసింది. అయితే, కంపెనీ ఈ మోడల్‌ను తిరిగి భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. Skoda ఇప్పుడిప్పుడే భారతదేశంలో ఓ స్థిరమైన బ్రాండ్‌గా ప్రజల విశ్వసనీయతను పొందుతోంది.

ఈ కంపెనీ ఇటీవల సరసమైన ధరకే ప్రవేశపెట్టిన Kushaq ఎస్‌యూవీతో భారతీయులకు మరింత చేరువైంది. ఇటువంటి పరిస్థితుల్లో Skoda ఇప్పుడు తమ Fabia ను తిరిగి భారత్‌కు తీసుకువచ్చి, సరసమైన ధరకే అందించగలిగినట్లయితే, ఇది ఖచ్చితంగా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. మీరేమంటారు?

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Did skoda fabia failed to impress indian audience lets find out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X