Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, దీపావళి పండుగ సందర్భంగా ఈ నవంబర్ 2021 నెలలో తమ కార్ల ధరలపై తగ్గింపులను ప్రకటించింది. హోండా భారత మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో హోండా కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 38,608 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో నగదు తగ్గింపు, యాక్ససరీలు, పొడిగించిన వారంటీ, కార్ ఎక్స్ఛేంజ్ మరియు లాయల్టీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆఫర్లు నవంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటాయి. మోడల్ వారీగా హోండా అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఉన్నాయి.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

1. హోండా జాజ్ (Honda Jazz)

హోండా అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ పై కంపెనీ రూ. 10,000 నగదు తగ్గింపు లేదా రూ. 12,147 విలువైన యాక్సెసరీలను అందిస్తోంది. దీనితో పాటుగా, కార్ల మార్పిడి (ఎక్సేంజ్) పై రూ. 10,000 బోనస్, రూ. 5,000 తగ్గింపు మరియు రూ. 5,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 4000 కార్పొరేట్ తగ్గింపులను కూడా అందిస్తోంది. మొత్తంగా ఈ నవంబర్ నెలలో, హోండా జాజ్ పై కంపెనీ రూ. 36,147 వరకూ విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

2. హోండా అమేజ్ (Honda Amaze)

హోండా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్ పై కంపెనీ రూ. 5000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 6000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 4000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. ఈ నెలలోహోండా అమేజ్ సెడాన్ పై కంపెనీ మొత్తం రూ. 15,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. హోండా ఇటీవలే అమేజ్ సెడాన్ లో రిఫ్రెష్డ్ వెర్షన్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. అందుకే, కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అమేజ్ సెడాన్ పై భారీ తగ్గింపులను అందించడం లేదు.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

3. హోండా డబ్ల్యూఆర్-వి (Honda WR-V)

హోండా అందిస్తున్న క్రాసోవర్ / ఎస్‌యూవీ టైప్ డబ్ల్యూఆర్-వి మోడల్ కంపెనీ ఈ నెలలో రూ. 5000 నగదు తగ్గింపు లేదా రూ. 6058 విలువైన యాక్సెసరీలను అందిస్తోంది. ఈ ఆఫర్ అన్ని వేరియంట్‌లపై ఇవ్వబడుతోంది. అలాగే కార్ల మార్పిడి (ఎక్సేంజ్)పై రూ. 9000 తగ్గింపును ఇస్తోంది. దీనికి అదనంగా 5000 రూపాయల తగ్గింపు మరియు 5000 రూపాయల లాయల్టీ బెనిఫిట్ కూడా ఇవ్వబడుతోంది. ఈ నవంబర్ 202 నెలలో హోండా డబ్ల్యూఆర్-వి పై కంపెనీ మొత్తం రూ. 29,058 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

4. హోండా సిటీ (Honda City)

హోండా యొక్క పాపులర్ మిడ్-సైజ్ సెడాన్ సిటీలో కంపెనీ రెండు జనరేషన్ మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. వీటిలో పాత 4వ తరం హోండా సిటీ మరియు లేటెస్ట్ 5వ తరం హోండా సిటీ మోడళ్లు ఉన్నాయి. ఇందులో నాల్గవ తరం మోడల్‌పై కంపెనీ మొత్తంగా రూ. 23,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 5000 లాయల్టీ బోనస్, రూ. 10,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 8000 కార్పోరేట్ తగ్గింపు అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ కంపెనీ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా ఉంది.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

ఇకపోతే, తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఐదవ తరం హోండా సిటీపై కంపెనీ అత్యధికంగా డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నవంబర్‌లో 5వ తరం హోండా సిటీ కారును కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 38,608 ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 7500 క్యాష్ డిస్కౌంట్ లేదా రూ. 8108 విలువైన యాక్ససరీస్ ఉన్నాయి. దీంతో పాటుగా కార్ల మార్పిడిపై రూ. 10,000 బోనస్, రూ. 7500 తగ్గింపు, రూ. 5000 లాయల్టీ బెనిఫిట్‌ను మరియు రూ. 8000 కార్పొరేట్ డిస్కౌంట్ లను అందిస్తున్నారు.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

ఈ పండుగ సీజన్‌లో హోండా కార్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేయడానికి, కంపెనీ తమ వినియోగదారులకు సరసమైన ఫైనాన్స్ సేవలను అందించేందుకు గాను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది తక్కువ వడ్డీ రేటు (ROI) కే రుణ సదుపాయాన్ని పొందేందుకు హోండా కస్టమర్‌లకు సహాయం చేస్తుంది మరియు కొత్త హోండా అమేజ్, హోండా జాజ్, హోండా డబ్ల్యుఆర్-వి మరియు హోండా సిటీ కొనుగోలుపై సులభమైన లోన్‌ను ఆఫర్ లను అందిస్తుంది.

Honda కార్లపై దీపావళి ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో హోండా కార్స్ ఇండియా భాగస్వామ్యంలో భాగంగా, బ్యాంక్ సిగ్నేచర్ ప్రొడక్ట్ "మహా సూపర్ కార్ లోన్" నుండి కస్టమర్లు ప్రయోజనం పొందుతారు. ఈ పథకం కింద ప్రధాన ప్రయోజనాలలో వాహనం ధరలో 90 శాతం వరకు రుణం మరియు 7.05 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు, 48 గంటల టర్న్-అరౌండ్ టైమ్‌తో అవాంతరాలు లేని ఆమోదం, కార్పొరేట్ జీతం ఖాతాదారునికి వడ్డీ రేటుపై రాయితీ, డిసెంబర్ 31, 2021 వరకు జీరో ప్రాసెసింగ్ రుసుము, సున్నా ముందస్తు/పాక్షిక చెల్లింపు ఛార్జీలు మరియు ఇప్పటికే హోమ్ లోన్ కలిగి ఉన్న రుణగ్రహీతలకు ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, November 4, 2021, 15:21 [IST]
English summary
Diwali offers on honda cars november 2021 discounts on jazz amaze city wr v details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+