రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

గాలిలో మెరుపు వేగంతో దూసుకెళ్లే జెట్ యుద్ధ విమానాలకి, రోడ్డుపై రయ్‌మని పరుగులు తీసే స్పోర్ట్స్ కార్లకు పోటీ ఏంటి అనుకుంటున్నారా ? అవును నిజమే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగులు తీసే కార్లలో ఒకటైన బుగాటి చిరోన్ మరియు యుద్ధ రంగంలో శత్రువు గుండెల్లో దడ పుట్టించే రాఫెల్ జెట్ విమానాకి పోటీ పెట్టారు.

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

ఈ పోటీకి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అయింది. ఇది డ్రాగ్ రేస్‌లకే బాబు లాంటిదంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రాన్స్‌లోని డసాల్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ ప్రత్యేకమైన ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై బుగాటి చిరోన్ పుర్ స్పోర్ట్ కారుకి మరియు డసార్ట్ రాఫెల్ ఫైటర్ జెట్ విమానానికి డ్రాగ్ రేస్ పోటీ నిర్వహించారు.

ఈ డ్రాగ్ రేస్‌లో పాల్గొన్న బుగాటి చిరోన్ పుర్ స్పోర్ట్ ఒక ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ మోడల్. ఈ సూపర్ కారులో శక్తివంతమైన 8.0-లీటర్ డబ్ల్యూ16 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 1,500 హెచ్‌పి శక్తిని మరియు 1,600 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

ఇకపోతే, ఫ్రెంచ్ నేవీకి చెందిన డసాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్ యుద్ధ విమానంలో రెండు టర్బోజెట్ ఇంజన్లు ఉంటాయి. ఇవి రెండూ కలిసి దాదాపు 58,550 న్యూటన్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగలవు. అంటే, ఇది సుమారు 5,727 హెచ్‌పిల శక్తికి సమానం అన్నమాట. అంటే, బుగాటి చిరోన్ కారు ఉత్పత్తి చేసే శక్తి కన్నా సుమారు నాలుగు రెట్లు అధికం.

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

ప్రపంచంలో ఇప్పటివరకు నిర్మించబడిన ఏదైనా అత్యంత శక్తివంతమైన హైపర్‌కార్‌లతో పోల్చినా ఈ రాఫెల్ జెట్ ఇంజన్ల శక్తితో అవి సరిపోలవు. బుగాటి చిరోన్ 16 సిలిండర్ల ఇంజన్‌తో గరిష్టంగా గంటకు 490 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదు. అదే సమయంలో డసాల్ట్ రాఫెల్ ఫైటర్ జెట్ విమానం మాక్ 1.8 లేదా గంటకు గరిష్టంగా 1,912 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

MOST READ:కరోనా బాధితులకోసం కొత్త హాస్పిటల్ ప్రారంభించిన ఒమేగా సెకి మొబిలిటీ; పూర్తి వివరాలు

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

ఈ రెండు వాహనాల్లో గణాంకాల పరంగా భారీ వ్యత్యాసం ఉంది. వీటిని పోల్చి చూస్తే, రాఫెల్ విమానం బుగాటి చిరోనో సూపర్ కార్ కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనది మరియు వేగవంతమైనదిగా తెలుస్తోంది. అయినా కూడా బుగాటి చిరోన్ ఎక్కడా జంకకుండా ఈ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమైంది.

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

డ్రాగ్ రేస్ ప్రారంభం నుండి బుగాటి చిరోన్ కారు ముందంజలో ఉండి కేవలం 2.4 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. ఈ హైపర్ కారు కేవలం 6.1 సెకన్లలోనే 200 కి.మీ వేగాన్ని, 13 సెకన్లలో 300 కి.మీ వేగాన్ని మరియు అర నిమిషయంలో గంటకు 400 కి.మీ వేగాన్ని చేరుకుంది.

MOST READ:రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

ఆ సమయంలో రాఫెల్ జెట్ విమానం 150 మీటర్ల దూరాన్ని కవర్ చేసే సయానికి గంటకు 165 కిలోమీటర్ల వేగంతో బుగాటి చిరోన్ కారు కన్నా వెనుకంజలో ఉంది. కాగా, 350 మీటర్ల దూరాన్ని కవర్ చేసేటప్పుడు యుద్ధ విమానం వేగం 210 కి.మీగా ఉంటే, 450 మీటర్ల దూరం దాటిన తరువాత విమాన వేగం 260 కిలోమీటర్లకు చేరుకుని భూమిని వదిలి గాలిలోకి ఎగరడం ప్రారంభించింది.

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

ఈ రేసు ప్రారంభమైనప్పటి నుండి కొన్ని వందల మీటర్ల దూరం వరకూ రాఫెల్ విమానం కంటే బుగాటి వేరాన్ కారే ముందంజలో ఉన్నదని ఆ బుగాటి హైపర్‌కార్‌ను నడిపిన పియరీ-హెన్రీ రాఫానెల్ వివరించారు. అయితే మరికొన్ని వందల మీటర్ల తరువాత, యుద్ధ విమానం తన కన్నా 20 మీటర్ల ఎత్తులో ఎగురుతూ కనిపించిందని, ఇదొక మ్మశక్యం కాని అద్భుతమైన దృశ్యమని హెన్రీ చెప్పాడు.

MOST READ:తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్; 37 మంది మరణం 38 మంది గల్లంతు

రాఫెల్ యుద్ధ విమానానికి, బుగాటి సూపర్ కారుకి పోటీ: ఎవరు గెలిచారో తెలిస్తే షాక్!

మరి ఇంతకీ ఈ డ్రాగ్ రేసులో ఎవరు గెలిచారని మీరు భావిస్తున్నారు? కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.

Most Read Articles

English summary
Drag Race Between Bugatti Chiron And Dassault Rafale Fighter Jet: Lets Find Out Who Won The Game. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X