Just In
- 40 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 50 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 58 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Finance
మార్చి 31 వరకు.. వివాద్ సే విశ్వాస్ గడువు పొడిగింపు
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్‌ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్‌ను కాకుండా.. పిచ్‌ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా.. ఇది చూడండి
సాధారణంగా వాహనాలను డ్రైవ్ చేయడానికి వాహన చట్టం ప్రకారం కొన్ని నియమాలు ఉన్నాయి. వాహనదారులు తప్పకుండా వాటిని అనుసరించాలి. ఈ నియమాలను ఉల్లంఘించినట్లైతే వారికి భారీ జరిమానాలు విధించడమే కాకుండా, కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. మోటార్ వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ చేసేవారికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను డ్రైవ్ చేయడం చట్ట రీత్యా నేరం, కావున వాహనదారులు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టిఓ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాయాలి, అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే డ్రైవింగ్ టెస్ట్ కి హాజరవ్వాల్సి ఉంటుంది. కానీ ఇటీవల డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఆర్టిఓ ఆఫీస్ లో డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ జారీ చేసింది.

సాధారణంగా అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి మరియు ఆర్టీఓ ఆఫీస్ వద్ద డ్రైవింగ్ టెస్ట్ పాసవ్వాలి. కావున దీని కోసం డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడానికి అనేక డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి నాయిక అడ్డదారులను తొక్కుతున్నారు. వీటిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది.
MOST READ:ప్రమాదానికి గురైన అల్లు అర్జున్ కారావ్యాన్..ఎలా జరిగిందంటే ?

దేశవ్యాప్తంగా మెరుగైన డ్రైవర్లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ కొత్త ప్రణాళికను రూపొందించింది. వాహనం సక్రమంగా పనిచేస్తుందని ఆర్టీఓ అధికారి గుర్తించిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల విభాగం ఈ నిబంధనలో కొన్ని పెద్ద మార్పులను తీసుకువస్తోంది.

వాహనదారుల శిక్షణను మెరుగుపరచడానికి విభాగం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, డ్రైవింగ్ స్కూల్స్ నాణ్యతను మెరుగుపరిచేందుకు కొత్త ముసాయిదా విధానాన్ని విడుదల చేశారు.
MOST READ:ఇక తప్పనిసరే.. పొడగింపులు ఉండవ్..: ఫాస్టాగ్‌పై నితిన్ గడ్కరీ స్టేట్‌మెంట్

ఈ ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్స్ నాణ్యమైన డ్రైవర్లను చేయడానికి అధిక నాణ్యత పద్ధతులను అనుసరిస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్స్ కి వెళ్లడం ద్వారా డ్రైవింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారి కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టాలని కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల విభాగం పరిశీలిస్తోంది.

ఈ డ్రైవింగ్ స్కూల్స్ లో తమ ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన డ్రైవర్లు ఆర్టీఓ ఆఫీస్ వారు నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్ నుండి మినహాయింపు గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఈ డ్రైవింగ్ స్కూల్స్ లో శిక్షణ పొందిన వారిని డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయించి అవకాశం ఉంది.
MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

డ్రైవింగ్ స్కూల్స్ లో పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న వారు తమ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టిఓ ఆఫీస్ లో అప్లై చేసుకుని నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు. ఇది కేవలం డ్రైవింగ్ స్కూల్స్ లో పూర్తిగా ట్రింగ్ తీసుకున్న వాల్లకి మాత్రమే..

ఫెడరల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ ప్రకారం, ఈ డ్రైవింగ్ పాఠశాలల్లో శిక్షణ ఇచ్చే డ్రైవర్లు మంచి శిక్షణ పొందుతారు. కావున ఈ విధంగా ట్రైనింగ్ తీసుకున్న వారికి రోడ్డు నియమాలు తెలుస్తాయి. తద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గటమే కాకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
MOST READ:సరికొత్త రూపంలోకి మారిన బెంట్లీ కాంటినెంటల్ జిటి [వీడియో]