ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

దేశంలో వాహనాల వినియోగం అధికం కావడంతో వాయు కాలుష్యం స్థాయి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. దీనికి అనుగుణంగా, కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత ప్రభుత్వం కూడా వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, దేశంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి ఇథనాల్ ఇంధన ఉత్పత్తి మరియు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి కొత్త లక్ష్యాలను కేంద్రం ప్రకటించింది.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

ఈ మేరకు, కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని కార్బన్ రహితంగా మార్చడంలో ఫ్లెక్స్-ఇంధన (ఫ్లెక్స్ ఫ్యూయెల్) వాహనాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. ఇందుకు ప్రభుత్వం దాని ప్రస్తుత పరిమాణం రూ. 20,000 కోట్ల నుండి 2 లక్షల కోట్ల రూపాయల ఇథనాల్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

ఒక సమగ్ర ఇథనాల్ పరిశ్రమ అభివృద్ధి అంటే దేశంలో బయోమాస్ మరియు అగ్రికల్చర్ రంగానికి కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడం అని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. ఇదే కాకుండా, ఇతర గ్రీన్ ఫ్యూయల్స్ వైపు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

నితిన్ గడ్కరీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బయో-సిఎన్‌జి మరియు గ్రీన్ హైడ్రోజన్ వాడకం వల్ల కూడా వాయు కాలుష్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో సిఎన్‌జి (CNG) వాహనాలను ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10,000 CNG స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, వచ్చే 2023 నాటికి వివిధ రకాల వాహన విభాగాల్లో అధిక శాతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేలా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. అధిక దిగుమతి సుంఖాల కారణంగా, ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ మరియు ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లో ఒక లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ. 103.54 మరియు రూ. 109.54 వరకు ఉంటోంది.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

అలాగే, ఈ రెండు నగరాల్లో డీజిల్ ధరలు వరుసగా రూ. 92.12 మరియు రూ. 99.92 లుగా ఉన్నాయి. కొన్ని నగరాల్లో అయితే పెట్రోల్ ధర లీటరుకు రూ. 111 లకు పైగానే కొనసాగుతోంది. భవిష్యత్తులో ఈ పరిస్థితిలు ఇలానే కొనసాగితే, ఎలక్ట్రిక్ మరియు ఇథనాల్ ఇంధనంతో నడిచే వాహనాలే ఉత్తమమైన ఆప్షన్ గా ఉంటాయి.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ల తయారీ తప్పనసరి కానుంది!

ఇదిలా ఉంటే, దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకొని, భారత రోడ్లపై తిరిగే కార్లలో తప్పనిసరిగా ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆటోమొబైల్ పరిశ్రమలు తప్పనిసరిగా ఈ తరహా ఇంజన్‌లను తయారు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఇంజన్ అంటే..?

పూర్తిగా 100 శాతం పెట్రోల్ లేదా పూర్తిగా 100 శాతం బయో-ఇథనాల్ (జీవ ఇంధన)తో నడిచే ఇంజన్‌ను ఫ్లెక్-ఫ్యూయెల్ ఇంజన్ అంటారు. అంటే, ఇది పూర్తిగా పెట్రోల్‌తో అయినా పనిచేస్తుంది లేదా పూర్తిగా జీవ ఇంధనంతోనైనా పనిచేస్తుంది. బ్రెజిల్, కెనడా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ తరహా ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జాతీయ వాహన స్క్రాపేజ్ విధానం అమలు..

దేశంలో పాత వాహనాల వలన కలిగే వాయు కాలుష్యం మరియు మరియు ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే, వచ్చే ఏడాది ఏప్రిల్ (2022) నుండి దేశవ్యాప్తంగా జాతీయ వాహన స్క్రాపేజ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ఓ నోటిఫికేషన్ ను కూడా జారీ చేసింది.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

వెహికల్ స్క్రాపింగ్ పాలసీని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ప్రతిపాదించారు. త్వరలోనే ఇది కార్య రూపం దాల్చనుంది. పాత మరియు సర్వీసులో లేని వాహనాలను దశలవారీగా తొలగించడమే ఈ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం.

ఇథనాల్ ఉత్పత్తి మరియు ఈవీ సేల్స్ టార్గెట్లను ఫిక్స్ చేసిన భారత ప్రభుత్వం!

ఇందులో భాగంగా, ప్రైవేట్ వాహనాల కోసం 20 ఏళ్లు మరియు వాణిజ్య వాహనాల కోసం 15 ఏళ్ల వయస్సు నిర్ధారించారు. ఈ వయస్సు దాటిన వాహనాలను పాత వాహనాలుగా పరిగణించడం జరుగుతుంది. ఇలాంటి వయసు మళ్ళిన వాహనాలను సదరు వాహన యజమానులు స్క్రాప్ చేయటం లేదా ఆటోమేటెడ్ సెంటర్లలో తరచూ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవడం మరియు రెట్టింపు టాక్సులు కట్టడం చేయాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Ethanol production and ev sales target in india set by govt details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X