భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగం బాగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటి వరకు టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కమర్షియల్ వెహికల్స్ కూడా విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే భారతీయ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Euler Motors (యూలర్ మోటార్స్) దేశీయ మార్కెట్లో తన కొత్త హై లోడ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ L5 HiLoad (ఎల్5 హైలోడ్) ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

Euler Motors కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ వాణిజ్య అవసరాల కోసం అధిక లోడ్ మోసే సామర్థ్యంతో ఈ కొత్త L5 HiLoad వాహనాన్ని విడుదల చేసింది. ఈ కొత్త వెహికల్ ఇతర కమర్షియల్ త్రీ వీలర్స్ కంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Euler HiLoad ధర రూ. 3,49,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే ఈ కొత్త Euler HiLoad సేల్స్ 2022 జనవరి 15న ఢిల్లీ NCR ప్రాంతంలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

ఇప్పుడు భారతీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ L5 HiLoad త్రీ వీలర్ వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ అయినప్పటికీ, ఒక సాధారణ త్రీ-వీలర్‌లాగా ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఇది బరువులను కూడా మోయడానికి అనుకూలంగా ఉంటుంది.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

L5 HiLoad ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ సులభంగా ఒక నగరం నుండి మరో నగరానికి వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఏహికల్ డీజిల్ కార్గో త్రీ-వీలర్‌తో పోలిస్తే ఎక్కువ సామర్త్యాన్ని అందిస్తుంది. కావున ఏక్కువ ఖర్చు ఉండదు. కావున డ్రైవర్ యొక్క ఆదాయం పెరుగుతుంది.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

కేవలం ఈ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వల్ల ఆదాయం పెరగటం మాత్రమే కాకుండా, మెయింటెనెన్స్, స్పెర్ పార్ట్స్ మరియు మరమ్మతుల వంటి వాటికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి చాలా సదుపాయాలు ఈ వాహనంలో అందుబాటులో ఉంటాయి.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు బిగ్ బాస్కెట్ వంటి ఈ-కామర్స్ రిటైలర్‌ల నుండి 2021 ఆగస్టులో కంపెనీ 2,500 వాహనాలకు ఆర్డర్‌లను పొందినట్లు Euler Motors కంపెనీ అధికారికంగా తెలిపింది. అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో ఉండటమే కాకుండా ఇది మంచి సామర్థ్యాన్ని కూడా అందిస్తున్న కారణంగా ఈ-కామర్స్ కంపెనీలు వీటిని ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. ఈ కంపెనీలు ముందుగా ఈ ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ఉపయోగించనున్నారు.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

కొత్త Euler L5 HiLoad త్రీ-వీలర్, కంపెనీ స్వంతంగా అభివృద్ధి చేసిన 12.4 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తుంది. ఈ బ్యాటరీ పూర్తిగా వాటర్ ప్రొటెక్టెడ్, అంతే కాకుండా ఈ బ్యాటరీకి IP67 గ్రేడ్ వాటర్ ప్రొటెక్షన్ కూడా పొందింది. ఈ బ్యాటరీ ఏదైనా బహిరంగ ఉష్ణోగ్రత 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది. దీనికోసం కంపెనీ బ్యాటరీతో కూడిన లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని కూడా అందించింది. కావున ఈ బ్యాటరీ దేశంలోని ప్రతి వేడి మరియు చల్లని ప్రదేశాలలో కూడా ఒకే విధమైన పనితీరును అందిస్తుంది.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను తేలికగా మరియు బలంగా ఉండటానికి, ఇందులోని బ్యాటరీని పూర్తిగా రక్షించే స్కేట్‌బోర్డ్ చాసిస్ ఇందులో ఉపయోగించబడింది. ఈ ఎలక్ట్రిక్ కార్గో పేలోడ్ సామర్థ్యం 688 కేజీలు. ఈ అధిక పేలోడ్ సామర్థ్యంతో డ్రైవర్ తనకు మెరుగైన ఆదాయాన్ని పొందగలడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారత్‍లో విడుదలైన Euler HiLoad ఎలక్ట్రిక్ త్రీ వీలర్: ధర రూ. 3.50 లక్షలు

Euler L5 HiLoad ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 88.55 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది డీజిల్‌తో నడిచే త్రీ-వీలర్ కంటే చాలా ఎక్కువ. ఈ హై లోడ్ త్రీవీలర్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. కంపెనీ తన బ్యాటరీని ఛార్జ్ చేయడానికి DC ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందించింది. ఏది ఏమైనా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఒక ఆధునిక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడం నిజంగా అభినందనీయం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Euler l5 hiload three wheeler launched in india range features details
Story first published: Wednesday, October 27, 2021, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X