ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt: పూర్తి వివరాలు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటుకి ఢిల్లీ ప్రభుత్వం కావలసిన ప్రయత్నాలను చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ eVolt దేశ రాజధానిలో EV ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన మూడు విద్యుత్ పంపిణీ సంస్థలచే నియమించబడింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

నివేదికల ప్రకారం eVolt ని BSES రాజధాని పవర్ లిమిటెడ్ (BRPL), BSES యమునా పవర్ లిమిటెడ్ (BYPL) మరియు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (TPDDL) మూడు సంవత్సరాల కాలానికి గాను నియమించడాం జరిగింది. ఈ స్టార్టప్ న్యూ ఢిల్లీ నగరంలో బలమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

ఇందులో భాగంగానే eVolt మాల్స్, ఆఫీసులు మరియు కళాశాలలతో వంటి పబ్లిక్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్‌లను ఏర్పాటు చేస్తుంది. స్టార్టప్ ప్రైవేట్ యాజమాన్యంలోని నివాసప్రాంతాలు మరియు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో ఛార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

భారతదేశ రాజధానిని దేశానికి EV రాజధానిగా చేయాలనే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం తన కొత్త EV విధానం ప్రకారం నగరంలో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంలో సహాయపడటానికి రాయితీలను కూడా అందిస్తుంది. దేశ రాజధాని ప్రభుత్వం స్లో ఛార్జర్‌లపై 100 శాతం వరకు రాయితీని ఇస్తుంది.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

అంటే ఒక ఛార్జింగ్ పాయింట్‌కు రూ. 6,000 వరకు రాయితీ అందిస్తుంది. ఈ సబ్సిడీ మొదటి 30,000 ఛార్జర్లకే పరిమితం కానుంది, కావున దీనిని వినియోగదారులు గమనించాలి. బాగా కనెక్ట్ చేయబడిన స్మార్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ని ఉపయోగించి EV ఛార్జింగ్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో eVolt 2019 సంవత్సరంలో స్థాపించబడింది.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

eVolt ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తి యజమానులతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా నిర్మించబడింది. ఢిల్లీలో EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి తన కంపెనీ నియామకం గురించి మాట్లాడుతూ, eVolt వ్యవస్థాపకుడు మరియు CEO సార్థక్ శుక్లా తెలియజేశారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ నిర్మాణానికి BSES చే నియమించబడినందుకు మేము చాలా సంతోషిస్తున్నామన్నారు.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

ప్రస్తుతం దేశ రాజధాని నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ యొక్క ఈ-మొబిలిటీకి మారడంలో ఇది ఒక ముఖ్యమైన దశ. స్థానిక ఉనికితో స్వదేశీ స్టార్టప్‌గా ఉండటంతో, ఢిల్లీ ఎలక్ట్రిక్‌గా మార్చబడింది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది వాహనాలకు చాలా వేగంగా ఛార్జింగ్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

అంతే కాకుండా పూర్తిగా అభివృద్ధి చెందిన ఛార్జింగ్ నెట్‌వర్క్ EV స్వీకరణకు వెన్నెముకగా ఉన్నందున, బలమైన EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని చురుకుగా ప్రోత్సహించినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని ఆయన అన్నారు.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

దేశ రాజధానిలో పటిష్టమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ఢిల్లీకి చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎంప్యానెల్ చేసిన 10 మంది విక్రేతలలో eVolt ఒకటి. ఢిల్లీ ప్రభుత్వం సింగిల్ విండో సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది, దీని ద్వారా ఢిల్లీ నివాసితులు వివిధ ఛార్జర్‌ల ఫీచర్లు మరియు ధరలను పోల్చవచ్చు. నివాసితులు ఛార్జర్ కోసం ఆర్డర్ చేయవచ్చు మరియు ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా దాని ఇన్‌స్టాలేషన్‌ను షెడ్యూల్ చేయవచ్చు.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

eVolt ప్రస్తుతం EV ఛార్జింగ్ పాయింట్ కోసం చూస్తున్న వారికి అనేక రకాల పరిష్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే నివాసప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టార్టప్ 1.4kW నుండి 22kW వరకు పవర్‌తో AC ఛార్జర్‌లను అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో వ్యాపారాల కోసం, eVolt 3.3kW నుండి 22kW వరకు పవర్ అవుట్‌పుట్‌లతో లోడ్-బ్యాలెన్స్‌డ్ AC ఛార్జింగ్ సొల్యూషన్‌ల శ్రేణిని అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

దేశంలో రోజురోజుకి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చాలా వేగంగా మరియు నిరంతం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇంధన ధరలు 100 రూపాయలు దాటింది. అమాంతం పెరిగిపోతున్న ఇంధన ధరలు సామాన్య మానవులపై ఎక్కువా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కారణంగా ఎక్కువమంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఢిల్లీలో విస్తృత ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్న eVolt

అయితే ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేవారి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేదు. ఛార్జింగ్ స్టేషన్స్ కావలసినన్ని తీసుకురావడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం 600 ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది.

Most Read Articles

English summary
Ev charging infrastructure startup evolt to setup charging stations in delhi details
Story first published: Monday, November 1, 2021, 11:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X