మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

ఒక వైపు దేశం మొత్తం కరోనా కోరల్లో నలుగుతున్నవేళ, మరోవైపు ఆటోమొబైల్ ప్రపంచంలో ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. నివేదికల ప్రకారం, ప్రముఖ వాహన తయారీ దిగ్గజం అయిన 'మారుతి సుజుకి ఇండియా' యొక్క మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) జగదీష్ ఖత్తర్ కన్నుమూసారు.

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

78 సంవత్సరాల జగదీష్ ఖత్తర్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఖత్తర్ 1993 నుంచి 2007 వరకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి, 2007 లో పదవీ విరమణ చేశారు. తరువాత మారుతి సుజుకి ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగారు.

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

జగదీష్ ఖత్తర్ 1993 లో మారుతి సుజుకి ఇండియాలో మార్కెటింగ్ డైరెక్టర్‌గా తన ఉన్నతిని ప్రారంభించి, 1999 సంవత్సరంలో పదోన్నతి పొంది, మారుతి సుజుకి ఇండియా కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించబడ్డాడు. జగదీష్ ఖత్తర్‌ను మొదట కేంద్ర ప్రభుత్వం, తరువాత సుజుకి మోటార్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసి) 2002 లో నామినేట్ చేసింది.

MOST READ:అలెర్ట్: కర్ణాటకలో 14 రోజుల కఠిన ఆంక్షలతో కరోనా లాక్‌డౌన్

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

మారుతి సుజుకి కంపెనీలో పనిచేయడానికి ముందు, అతను ఐఎఎస్ అధికారి. ఐ.ఎ.ఎస్ గా ఉన్న కాలంలో ఆయన ఉత్తర స్టీల్ డిపార్ట్మెంట్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ జాయింట్ సెక్రటరీతో సహా పలు పదవులను నిర్వహించారు.

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

అతను 2007 లో మారుతి సుజుకి నుండి రిటైర్ అయిన తరువాత, అతను కార్నేషన్ ఆటో కంపెనీని స్థాపించాడు. కార్నేషన్ అనేది మల్టిపుల్-బ్రాండ్ కార్ల అమ్మకాలు మరియు సేవా సంస్థ. తరువాత కాలంలో దీనిని 2018 సంవత్సరంలో మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ సొంతం చేసుకుంది.

MOST READ:కేవలం 2.7 సెకన్లలో గంటకు 100 కిమీ చేరుకోగల కొత్త ఫెరారీ కార్; వివరాలు

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

లోన్ కి సంబంధించిన ఆరోపణలపై 2019 డిసెంబర్‌లో ఖత్తర్‌ను కూడా సిబిఐ ఆరోపించింది. జగదీష్ ఖత్తర్ యొక్క కార్నేషన్ ఆటో తన సోదరి పనుల కోసం రుణ మొత్తాన్ని మళ్లించిందని, దీనివల్ల 110 కోట్ల రూపాయల నష్టం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కు ఉందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆరోపించింది.

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

మారుతి సుజుకి అధ్యక్షుడు ఆర్.సి.భార్గవ, జగదీష్ ఖత్తర్ మరణానికి సంతాపం తెలుపుతూ, "ఇది మాకు చాలావరకు వ్యక్తిగత నష్టం. అంతే కాకుండా ఇది ఒక్కసారిగా జీర్ణించుకోలేని విషయం. జగదీష్ ఖత్తర్ తో మేము చాలా సంవత్సరాలు కలిసి పనిచేశాము. అతను మారుతికి ఒక మూలస్తంభం వంటి వ్యక్తి అన్నారు.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

మారుతి సుజుకి మాజీ ఎండి 'జగదీష్ ఖత్తర్' మృతి; వివరాలు

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటి, మారుతి సుజుకి యొక్క వాహనాలకు ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాదు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి ప్రతిష్ట ఉంది. ఇటీవల కాలంలోనే మలేసియాలో మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ విడుదలైంది. మారుతి స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ex Maruti Suzuki MD Passes Away Due To Cardiac Arrest. Read in Telugu.
Story first published: Tuesday, April 27, 2021, 9:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X