మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫడా) మార్చి 2021 నెలకు గాను వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. గత నెలలో రిజిస్టర్ అయిన ద్విచక్ర వాహనాలు , త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు మరియు ప్రైవేటు, వాణిజ్య వాహనాల డేటాను ఫడా విడుదల చేసింది.

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

గడచిన మార్చి నెలలో దేశంలో మొత్తం 2,79,745 యూనిట్ల ప్యాసింజర్ కార్లు రిజిస్టర్ కాగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 2,17,879 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో దేశీయ ప్యాసింజర్ కార్లు 28.39 శాతం వృద్ధిని సాధించిన ఫడా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

ఇక ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే, గత మార్చి 2021లో దేశీయ మార్కెట్లో మొత్తం 11,95,445 యూనిట్ల ద్విచక్ర వాహనాలు రిజిస్టర్ కాగా మార్చి 2020లో ఇవి 18,46,613 యూనిట్లుగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 35.26 శాతం క్షీణించాయి.

MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

త్రిచక్ర వాహన (త్రీ వీలర్) విభాగంలో గత మార్చి 2021 నెలలో మొత్తం 38,034 యూనిట్లు రిజిస్టర్ కాగా, మార్చి 2020లో ఇవి 77,173 యూనిట్లుగా ఉన్నాయి. టూవీలర్స్ రిజిస్ట్రేషన్ల మాదిరిగానే త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు కూడా ఈ సమయంలో 50.73 శాతం క్షీణితను నమోదు చేశాయి.

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

వ్యవసాయ మరియు పారిశ్రామిక రంగాల కోసం ఉపయోగించే ట్రాక్టర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. మార్చి 2020లో 53,463 యూనిట్లుగా నమోదైన ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ మార్చి 2021లో 69,082 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో ట్రాక్టర్ల అమ్మకాలు 29.21 శాతం వృద్ధిని కనబరచాయి.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

ఈ సమయంలో, వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా భారీగా క్షీణించాయి. గత నెలలో 67,372 యూనిట్ల వాణిజ్య వాహనాలు రిజిస్టర్ కాగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి 1,16,559 యూనిట్లుగా రిజిస్టర్ అయ్యాయి. ఈ సమయంలో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 42.20 శాతం తగ్గాయి.

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

వాణిజ్య వాహనాల విభాగంలో తేలికపాటి, మధ్యస్థ మరియు భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా భారీ క్షీణతను నమోదు చేశాయి. ప్యాసింజర్ కార్ల విభాగంలో మారుతి సుజుకి ఇండియా 43.31 శాతం రిజిస్ట్రేషన్లతో మొదటి స్థానంలో ఉండగా, హ్యుందాయ్ మోటార్స్ 15 శాతంతో రెండవ స్థానంలో, టాటా మోటార్స్ 7.65 శాతంతో మూడవ స్థానంలో ఉన్నాయి.

MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీ XUV700; వివరాలు

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

అలాగే, ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ విభాగంలో, హీరో మోటోకార్ప్ 42.71 శాతం రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్లు 21.42 శాతంతో ద్వితీయ స్థానంలో, టివిఎస్ మోటార్ కంపెనీ 13.87 శాతంతో తృతీయ స్థానంలో మరియు బజాజ్ ఆటో 12.08 శాతంతో నాల్గవ స్థానంలో నిలిచాయి.

మార్చి నెల అమ్మకాల్లో జోరు చూపిన ప్యాసింజర్ కార్లు మరియు ట్రాక్టర్లు

వాణిజ్య వాహనాల విభాగంలో టాటా మోటార్స్ 46.09 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, మహీంద్రా అండ్ మహీంద్రా 22.15 శాతంతో ద్వితీయ స్థానంలో, అశోక్ లేలాండ్ 14.06 శాతంతో మూడవ స్థానంలో నిలిచాయి. ఫార్మ్ ఎక్విప్‌మెంట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 22.50 వాటాను నమోదు చేసింది.

MOST READ:స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్; అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

Most Read Articles

English summary
FADA Releases March 2021 Vehicle Registration Figures, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X