యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

భారతదేశంలో రోజురోజుకి ట్రాఫిక్ ఎక్కువవుతున్న కారణంగా టోల్ గేట్లలో వాహనాలు ఎక్కువ సేపు ఉండకూడనే సదుద్దేశంతో భారత ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్ సర్వీస్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రారంభమైన యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్ట్‌ట్యాగ్ ఎలక్ట్రానిక్ టోల్ సిస్టం అమలులో ఉంది.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

ప్రస్తుతం యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్ట్‌ట్యాగ్ అమలు చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ దాదాపు తగ్గుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు చక్రాల వాహనాలు తప్పకుండా ఫాస్ట్‌ట్యాగ్ సర్వీస్ కలిగి ఉండాలి. అప్పుడే వాహనదారులు ఎక్కువ సమయంలో టోల్ గేట్ దగ్గర వేచి ఉండవలసిన ఉండదు.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

ఫాస్ట్‌ట్యాగ్ సర్వీస్ ద్వారా వాహనాలు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కావున ఎక్కువ ఇంధన కూడా అదా చేయవచ్చు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ సర్వీస్ వల్ల లావాదేవీలన్నీ కూడా దాదాపు ఆన్లైన్ లోనే జరుగుతాయి, కావున కరోనా వంటి అంటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉండదు.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

165 కిలోమీటర్ల పొడవైన యమున ఎక్స్‌ప్రెస్‌వేను జెపి ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (జిఐఎల్) నిర్వహిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో టోల్ వసూలుపై జెపి ఇన్‌ఫ్రాటెక్ కూడా పని చేస్తుంది. అంతకుముందు, యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్ట్‌ట్యాగ్ ఎలక్ట్రానిక్ టోల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏప్రిల్ 1 వరకు గడువు ఇవ్వబడింది.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

ప్రకటించిన సమయానికి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరగక వల్ల, ఈ దీనిని టోల్ గేట్ వ్యవస్థాపించడం సాధ్యం కాలేదు. దాదపు రెండున్నర నెలల ఆలస్యం తర్వాత ఎట్టకేలకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్ట్‌ట్యాగ్ ఎలక్ట్రానిక్ టోల్ సిస్టం ఏర్పాటు చేశారు.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

నోయిడాను ఆగ్రాతో కలిపే యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై జువార్, మధుర మరియు ఆగ్రా వద్ద మూడు టోల్ ప్లాజాలు నిర్మించబడ్డాయి. ఫాస్ట్‌ట్యాగ్ ఎలక్ట్రానిక్ టోల్ సిస్టం అమలు చేయడం వల్ల నోయిడా మరియు లక్నో మధ్య ప్రయాణీకులు టోల్ ప్లాజాల వద్ద క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

నివేదికల ప్రకారం, యమునా డెవలప్మెంట్ అథారిటీ, ఐడిబిఐ మరియు జెపి ఇన్ఫ్రాటెక్ ప్రతినిధులు కొద్ది వారాల క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రారంభంలో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే యొక్క టోల్ ప్లాజాకు రెండు వైపుల వున్న టోల్ గేట్లు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా లభిస్తాయి.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

ఫాస్ట్‌ట్యాగ్ ఎలక్ట్రానిక్ టోల్ సేకరణ విధానం ఇప్పుడుబ దాదాపు అన్ని వాహనదారులు కలిగి ఉన్నారు. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అన్ని జాతీయ రహదారులపై ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని అమలు చేసింది.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ అథారిటీ ఫిబ్రవరి 1 నుంచి యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. కానీ వివిధ కారణాల వల్ల ఇది ఆలస్యమయ్యింది. నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా టోల్ ప్లాజా కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

ఈ మార్గదర్శకాల ప్రకారం అన్ని టోల్ ప్లాజాల్లోని వాహనాల నుండి 10 సెకన్లలోపు టోల్ ఫీజు వసూలు చేయాలని సూచించారు. అంతే కాకుండా టోల్ ప్లాజాల వద్ద టోల్ ప్లాజాకంటే 100 మీటర్ల దూరం వేచి ఉండరాదని తెలిపింది. వాహనదారులు 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో వేచి ఉన్నట్లయితే వారికి, ఎటువంటి టోల్ ఫీజు చెల్లించకుండా వాహనాలను టోల్ గేట్ గుండా వెళ్ళడానికి అనుమతిస్తారు.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ సిస్టం; మరిన్ని వివరాలు

ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ నియమాన్ని అములు చేయడానికి టోల్ ప్లాజా నుండి 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయబడతాయి. టోల్ గేట్ వద్ద ఈ గీత బయట వేచి ఉండవలసి వస్తే వారు ఎటువంటి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

Most Read Articles

English summary
Fastag Electronic Toll System Installed In Yamuna Expressway. Read in Telugu.
Story first published: Wednesday, June 16, 2021, 9:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X