మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

భారతదేశంలో ప్రస్తుతం ద్విచక్రవాహనాల మినహా మిగిలిన అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పని సరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. కావున ఇప్పుడు దాదాపు వాహనదారుణాలందరూ ఫాస్ట్‌ట్యాగ్ వినియోగిస్తున్నారు. ఈ ఫాస్ట్‌ట్యాగ్ వల్ల దేశంలో రోజూ రూ .100 కోట్ల టోల్ టాక్స్ వసూలు చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక నివేదికలో తెలిపింది.

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

2021 మార్చి 16 న ఎన్‌హెచ్‌ఏఐ దేశవ్యాప్తంగా 30 మిలియన్లకు పైగా ఫాస్ట్‌ట్యాగ్‌లను విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నివేదిక ప్రకారం, 2021 మార్చి 1 మరియు 16 మార్చి మధ్య, రోజుకు సగటున రూ. 100 కోట్లకు పైగా టోల్ టాక్స్ వసూలు చేసినట్లు తెలిసింది.

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

భారతదేశంలో ఫాస్ట్‌ట్యాగ్ అమలు చేసిన తర్వాత టోల్ వసూలు మునుపటికంటే చాలా పెరిగిందని పెరిగిందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఫాస్ట్‌ట్యాగ్ అమలు చేసిన తర్వాత టోల్ ప్లాజా వద్ద వేచి ఉండాల్సిన సమయం తగ్గింది, కావున పెద్ద క్యూ లైన్లు కూడా లేవు. టోల్ ప్లాజా ఆపరేటర్లు డిజిటల్ లావాదేవీలు టోల్ వసూలును మరింత సౌకర్యవంతంగా చేశాయని మరియు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేశాయని చెప్పారు.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

టోల్ సేకరణ ప్రక్రియ ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ వల్ల చాలా పారదర్శకంగా జరుగుతోంది. 2021 ఫిబ్రవరి 15 నుండి ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థ ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి చేయబడింది. ఫాస్ట్‌ట్యాగ్ అంటే వాహనాల ముందుభాగంలో ఉన్న గ్లాస్ పై అమర్చిన డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది.

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

టోల్ ప్లాజా గుండా వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు, టోల్ టాక్స్ ఆటోమాటిక్ గా బ్యాంక్ లేదా ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుబంధించబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి చెల్లించబడుతుంది. టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది, అంతే కాకుండా ఇంధనాన్ని కూడా బాగా ఆదా చేస్తుంది.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని నాలుగు చక్రాల వాహనాలు, బస్సులు, ట్రక్కులు, లారీ మరియు వాణిజ్య వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. అయితే ఇందులో ఫాస్ట్‌ట్యాగ్ నుంచి ద్విచక్ర వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం వాహనాలకు టోల్ ప్లాజా తప్పనిసరి, కావున టోల్ ప్లాజా గుండా వెళ్లే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే, అలాంటి వాహనాలకు డబుల్ టోల్ టాక్స్ వసూలు చేయబడుతుందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

ఫాస్ట్‌ట్యాగ్ లు బ్యాంకులు మరియు పాయింట్ ఆఫ్ సేల్ కేంద్రాల వద్ద తీసుకోవచ్చు. అంతే కాకుండా రవాణా కార్యాలయం నుండి కూడా ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు. దీనికోసం కెవైసి, వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి సమాచారం ఇవ్వడం తప్పనిసరి.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

మొదలైన ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల జాతర.. రోజుకు రూ. 100 కోట్లు వసూల్

బ్యాంకులు మరియు రవాణా కార్యాలయాలు మాత్రమే కాకుండా అమెజాన్, పేటీఎం వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు. మై ఫాస్ట్‌ట్యాగ్ అనే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ గురించి పూర్తి సమాచారం ఈ యాప్ ద్వారా వాహనదారులు తెలుసుకోవచ్చు.

Most Read Articles

English summary
Fastag Toll Collection Reaches 100 Crore Per Day Says Nitin Gadkari. Read in Telugu.
Story first published: Thursday, March 25, 2021, 11:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X