Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

భారతదేశపు ప్రముఖ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) ఈ పండుగ సీజన్‌లో తమ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా, కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఆఫర్లన్నీ కూడా అక్టోబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ఈ పండుగ సీజన్‌ లో మహీంద్రా కారు కొనుగోలు చేసే కస్టమర్లు గరిష్టంగా రూ. 81,500 వరకు నగదును ఆదా చేసుకోవచ్చు. మరి ఏయే మహీంద్రా మోడళ్లపై ఎలాంటి ఆఫర్లు లభిస్తున్నాయో తెలుసుకుందాం రండి.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

1. మహీంద్రా ఎక్స్‌యూవీ300 (Mahindra XUV300)

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఒకటి. ఒకవేళ మీరు ఈ నెలలో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ను కొనుగోలు చేయాలని చూస్తుంటే, కంపెనీ ఈ మోడల్ పై రూ. 44,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పోరేట్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 విలువైన ఇతర ఆఫర్లు ఉన్నాయి.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

మహీంద్రా ఎక్స్‌యూవీ300 అనేది ఒక 5 సీటర్ కాంపాక్ట్ ఎక్స్‌యూవీ300. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం 16 వేరియంట్లు మరియు 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధరలు రూ. 7.95 లక్షల నుండి ప్రారంభమై రూ. 13.46 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

2. మహీంద్రా కెయూవీ100 ఎన్ఎక్స్‌టి (Mahindra KUV100 NXT)

కెయూవీ100 ఎన్ఎక్స్‌టి అనేది మహీంద్రా ప్రోడక్ట్ లైనప్ లో అత్యంత సరసమైన మోడల్. కంపెనీ ఈ మోడల్ పై అక్టోబర్ నెలలో గరిష్టంగా రూ. 38,055 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 3,000 వరకు కార్పోరేట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. కెయూవీ100 ఎన్ఎక్స్‌టి మోడల్ మహీంద్రా ఎక్స్‌యూవీ300 కు దిగువన ఉంచబడింది, ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ కంటే చిన్నదిగా మరియు హ్యాచ్‌బ్యాక్ కంటే పెద్దదిగా ఉంటుంది.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

మహీంద్రా కెయూవీ100 ఎన్ఎక్స్‌టి రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో పెట్రోల్ mFalcon G80 మరియు డీజిల్ mFalcon D75 ఇంజన్లు ఉన్నాయి. ఇందులోని 1.2 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్ ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 1.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ 77 బిహెచ్‌పి పవర్ ను మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటాయి. భారత మార్కెట్లో మహీంద్రా కెయూవీ100 ఎన్ఎక్స్‌టి ధరలు రూ. 6.08 లక్షల నుండి రూ. 7.74 లక్షల (ఎక్స్ -షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

3. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీపై కంపెనీ ఈ నెలలో రూ. 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 4,000 కార్పోరేట్ తగ్గింపును కూడా అందిస్తోంది. ఇంతకు మించి ఈ మోడల్ పై వేరే ఆఫర్లేమీ లేవు. కంపెనీ ఇటీవలే స్కార్పియో ధరను రూ. 37,000 మేర పెంచింది. ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో ధరలు రూ. 12.59 లక్షల నుండి రూ. 17.39 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

మహీంద్రా స్కార్పియో వివిధ రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం 5 ట్రిమ్‌ లలో లభిస్తుంది. వీటిలో S3+, S5, S7, S9 మరియు S11 ట్రిమ్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజన్‌ తో రెండు రకాల ట్యూన్‌ లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో మొదటిది 120 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది, రెండవది 140 బిహెచ్‌పి పవర్ మరియు 319 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

4. మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4 (Mahindra Alturas G4)

మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4 కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఎస్‌యూవీ. ఈ అక్టోబర్ నెలలో కంపెనీ ఈ మోడల్ పై అత్యధిక డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ నెలలో మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4 కొనుగోలుపై కస్టమర్లు రూ. 81,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ. 50,000 ఎక్సేంజ్ బోనస్, రూ. 11,500 కార్పోరేట్ డిస్కౌంట్ మరియు రూ. 20,000 ఇతర ప్రయోజనాలు ఉన్నాయి.

Mahindra కార్లపై ఫెస్టివల్ ఆఫర్లు.. రూ.81,500 వరకూ డిస్కౌంట్స్..

గమనిక: పైన పేర్కొన్న డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలు కస్టమర్ ఎంచుకునే డీలర్‌షిప్ మరియు ఉండే నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఖచ్చితమైన వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత మహీంద్రా డీలర్‌షిప్ ను సంప్రదించగలరు. ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 16, 2021, 15:07 [IST]
English summary
Festive discounts on mahindra cars save upto rs 81500 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+